మోదీకి జమ్మూకశ్మీర్ విద్యార్థుల విన్నపం
x
జే అండ్ కే విద్యార్థులు

మోదీకి జమ్మూకశ్మీర్ విద్యార్థుల విన్నపం

విచారణ పేరిట పోలీసులు తమను వేధించకుండా చూడాలని లేఖ


దేశంలో కశ్మీరీ విద్యార్థులపై ద్వేషపూరిత వాతావరణం ఉందని, ఈ సమయంలో జే అండ్ కే విద్యార్థులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని ఆ రాష్ట్ర విద్యార్థులు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

నవంబర్ 10న జరిగిన ఎర్రకోట బాంబు పేలుడులో12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడుకు ప్రధాన కారణంగా కశ్మీర్ కు చెందిన ఉమర్ నబీ ప్రధాన సూత్రధారి అని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఈ ఉగ్రవాద చర్యలో జే అండ్ కే కు చెందిన అనేక మంది వైద్యులు వైట్ కాలర్ సంఘటనలతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

మోదీకి విన్నపం..
న్యూఢిల్లీలో ని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మీడియా ప్రతినిధులను ఉద్దేశించి జేకేఎస్ఏ జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుయేహమీ మాట్లాడారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అందరికి ప్రధాని.
కశ్మీరీలపై సవతి తల్లి ప్రేమ చూపించకూడదు. వారు కశ్మీర్ లను సొంత దేశంలో శరణార్థులని నమ్మించకూడదు. ఒక సాధారణ ప్రకటన జారీ చేయాలని మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చే సందేశం విశ్వాసాన్ని పెంపొందించే గొప్ప చర్య అవుతుందని అన్నారు.
ఈ సంఘటన తరువాత వాట్సాప్ లో కశ్మీర్ విద్యార్థులపై బురద జల్లే పనులు ప్రారంభమయ్యాయని దీనివల్ల దేశవ్యాప్తంగా చదువుకుంటున్నా 1.5 లక్షలకు పైగా కశ్మీర్ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఖుయోహమీ అన్నారు. ‘‘ఇందులో మొత్తం కశ్మీరీ సమాజం పాల్గొన్నట్లుంది’’ అన్నారు.
రాజ్యాంగంపై నమ్మకం..
కశ్మీరీ యువత ఎల్లప్పుడూ భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తారని ఖుయేహమీ అన్నారు. ‘‘మేము ఎల్లప్పుడూ ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తిరస్కరించాము. కానీ వాట్సాప్ విశ్వవిద్యాలయం ద్వారా ద్వేషం వ్యాపిస్తుంది’’ అని ఆయన అన్నారు.
ఎర్రకోట సంఘటనను ఖండించిన ఆయన.. ఈ సంఘటనకు పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని, తద్వారా దీనిని భవిష్యత్ తరాలు గుర్తించుకుంటాయని అన్నారు.
వేధింపుల ఫిర్యాదులు
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో చదువుకుంటున్న జేకే విద్యార్థులకు ఇంటి యజమానుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని ఖుయోహమీ ఆరోపించారు. విద్యార్థుల ప్రొఫైల్ ను పరిశీలిస్తున్నారని, ఇది వారిలో మరింత ఆందోళనకు కారణమవుతుందని ఆయన అన్నారు.
ఇటీవల ఎర్రకోట కారు పేలుడుకు కారణమని ఆరోపిస్తున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ఫరీదాబాద్ పోలీసులు నగరంలో నివసిస్తున్నా 2 వేల మందికి పైగా కశ్మీర్ విద్యార్థులను ప్రశ్నించారని, ఇంకా వందల మందిని ప్రశ్నిస్తున్నారని జేకేఎస్ఏ ఆరోపించింది.
దోషులను కఠినంగా శిక్షించాల్సి ఉన్నప్పటికీ, కశ్మీర్ విద్యార్థులను అనవసరంగా దానిలోకి లాగకూడదని ఖుహమీ అన్నారు. ఈ వేధింపుల కారణంగా గురుగ్రామ్, ఫరీదాబాద్ లలో చదువుతున్న 700 మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే కశ్మీర్ కు తిరిగి వచ్చారని ఆయన అన్నారు.
సామూహిక శిక్ష..
ఎర్రకోట పేలుడు తరువాత కశ్మీర్ విద్యార్థులను రక్షించడానికి, సామూహిక ఇంటరాగేషన్ శిక్షను నిరోధించడానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ అసోసియేషన్ మోదీకి ఒక లేఖ రాసింది. దేశం కోసం కశ్మీరీలు త్యాగాలు చేశారని, మా కుటుంబాలు సరిహద్దులో నిలబడి, ధైర్యంగా దేశాన్ని రక్షించాయని లేఖలో వారు పేర్కొన్నారు.


Read More
Next Story