అయితే ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ ఇటీవల ఇక్కడి రాజకీయాలను తట్టుకోలేక రాజీనామా చేశారు. ఈ షాక్ నుంచి తేరుకున్న రెండు పార్టీలు తమ వ్యూహాన్ని చర్చించడానికి ఢిల్లీలో సమావేశమయ్యాయి. పై స్థాయిలో మేము కలిసే ఉన్నామనే భావన కార్యకర్తలతో పాటు ఓటర్లకు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.
అయితే ఇది సాధ్యమయ్యే పనేనా అనిపిస్తోంది. గత ఏడాది వరకూ కాంగ్రెస్, ఆప్ పరస్పరం కత్తులు నూరుకున్నాయి. నిజానికి కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడానికి కారణం అయినా లిక్కర్ స్కాం ను బయటకు తీసిందే కాంగ్రెస్. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్, ఇతర నాయకులు ఈ కుంభకోణాన్ని వెలికి తీశారు.
కాంగ్రెస్‌కు పెద్ద సవాళ్లు
దశాబ్దం కింద ఢిల్లీ కాంగ్రెస్ కు పెట్టని కోట. ఇక్కడ వరుసగా మూడు సార్లు గెలిచి ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ అధికారం చెలాయించారు. అయితే తరువాత ఆప్ బరిలోకి దిగడంతో దానికి ఎదురుదెబ్బలు తగిలాయి. క్యాడర్ మొత్తం కకావికలు అయింది. దాని ఓటు బ్యాంకు మొత్తం ఆప్ కు తరలిపోయింది. దీంతో లవ్లీ వంటి నాయకులు పార్టీ వీడటం షరా మామూలు విషయం అయింది. తమ అభిప్రాయాలకు విరుద్దంగా ఆప్ తో, కాంగ్రెస్ నాయకత్వం పొత్తు పెట్టుకుందని ఆయన ఓ రాయి విసిరి వెళ్లారు.
జాతీయ రాజధానిలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాలలో రెండింటికి అభ్యర్థులుగా పార్టీ విధేయుల కంటే 'బయటి వ్యక్తులు' కన్హయ్య కుమార్, ఉదిత్ రాజ్‌లను ఎంపిక చేయడం కార్యకర్తలకు మింగుడు పడలేదు. చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన జేపీ అగర్వాల్ మాత్రమే ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పాత సభ్యుడు.
నిజానికి కన్హయ కుమార్ కు బీహర్ 2019 లో బరిలోకి దిగితే కనీసం డిపాజిట్ రాలేదు. ఇతని కోసం భారీ స్థాయిలో జాతీయ నాయకులు, సినిమా స్టార్లు ప్రచారం చేసిన డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. అలాంటి నాయకుడిని తీసుకొచ్చి తమ నెత్తిన పెట్టారని సగటు కార్యకర్తల ఆవేదన.
లవ్లీ బయటకు వెళ్లడానికి దారి తీసిన కారణాలైన వాటితోనే, కాంగ్రెస్ సీనియర్ నేతలు నసీబ్ సింగ్, నీరజ్ బసోయా కూడా పార్టీని వీడారు. వీరు దివంగత షీలా దీక్షిత్ విధేయులు. ఢిల్లీలోని ఏడు స్థానాలకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 6వ తేదీ దగ్గరపడుతుండగా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు సహా దాదాపు డజను మంది ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మునిగిపోతున్న AAP
అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి తమ పార్టీని స్థాపించినట్లు ఆప్ నాయకత్వం మొదట ప్రకటించింది. కానీ దశాబ్దం తిరిగే సరికి అదే అవినీతి కంపులో పార్టీ అగ్రనాయకత్వం పీకల్లోతులో కూరుకుపోయింది. సీఎం కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు ఇప్పటికే తీహార్ జైలులో ఉన్నారు. మరో కీలక నేత సంజయ్ సింగ్ మాత్రం బెయిల్ పై బయట ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి నాయకులు బయటకు వెళ్లినట్లు, ఆప్ నుంచి వలసలు ప్రారంభం అయ్యాయి. కేజ్రీవాల్ సహచరుడు రాజ్ కుమర్ ఇప్పటికే పార్టీని విడిచిపెట్టాడు. ఎన్నికల ఫలితాలు ఆప్ కు వ్యతిరేకంగా వచ్చినట్లు అయితే ఇది జోరందుకునే అవకాశం ఉంది. ఆప్ ఇప్పుడు కేవలం కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందనే ఆశతోనే ఉంది.
అది కూడా పోలింగ్ ముగిసే మే 25 లోపునే రావాలని న్యాయస్థానాలను అభ్యర్థిస్తోంది. ప్రచారానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సునీత కేజ్రీవాల్, అతిషీ, సౌరభ్ భరద్వాజ్ లు మాత్రమే ముందు వరుసలో ఉన్నారు. వీరి సానూభూతితో ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే తీరులో ప్రచారం చేస్తున్నారు.
వెన్నుపోట్లు..
ఈ సంక్లిష్ట నేపథ్యంలోనే ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఢిల్లీలో పోటీ చేస్తున్నాయి. ఇరు పార్టీలు కొన్ని సందర్బాల్లో అనాలోచితంగా ప్రచారం చేస్తున్నారు. ఇది కామెడీలాగా కనిపిస్తోంది.
అరవింద్ లవ్లీ, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా వంటి నాయకులు ఢిల్లీలోని కూటమిపై నిప్పులు చెరుగుతున్నారు. ఆప్ అధినేత ఒకప్పుడు షీలా దీక్షిత్, సోనియా గాంధీ అన్న మాటలను ఇప్పుడు ప్రజలకు గుర్తు చేసే పని చేపడుతున్నారు. అయితే కాంగ్రెస్, ఆప్ నాయకత్వాలు ఇవేవీ పట్టించుకోకుండా బిజీగా ఉన్నారు.
నరేంద్ర మోదీ నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లకు వివరిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ పై ప్రజలు ఏ మాత్రం ఆసక్తిగా చూపించడంలేదని రెండు పార్టీల కార్యకర్తలు అంటున్న మాట.
న్యూఢిల్లీ అభ్యర్థి మాల్వియా నగర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఓ సమావేశం లో మాట్లాడుతూ.. అవినీతి మకిలి అంటిన వారితో అగ్రనాయకత్వం పోత్తు పెట్టుకుంది ఎందుకు.. అని ప్రశ్నించారు. ఈ వీడియోత తరువాత బయటకు వచ్చింది. ఇదే నియోజకవర్గంలో సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఓట్లు ఉన్నాయి. వీరు తమ కూటమి అభ్యర్థి తరఫును భారతికే ఓటు వేయాల్సి ఉంది.
ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో కన్హయ్య కుమార్ కోసం తన పార్టీ కార్యకర్తలను సమీకరించడానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించబడిన AAP నాయకుడు ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, "ఆప్ నలుగురు అభ్యర్థులలో కనీసం ముగ్గురు బాగా రాణిస్తారని అతని పార్టీ విశ్వసిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (వచ్చే ఏడాది) వెళ్లినప్పుడు మాత్రం ఈ కూటమి మనకు ఎదురుదెబ్బ తీయగలదని వ్యాఖ్యానించారు.
2013లో స్పష్టమైన మెజారిటీ లేకుండా అధికారంలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ మాకు బేషరతుగా బయటి నుంచి మద్దతు ఇచ్చింది, కానీ ఒక సంవత్సరంలోనే, కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలనే కేజ్రీవాల్ నిర్ణయంతో ప్రజలు సంతోషంగా లేనందున, మేము ఆ కూటమిని విచ్ఛిన్నం చేసాము. ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉండవచ్చు కానీ మేము ఎందుకు కలిసి రావాల్సి వచ్చిందో మా మద్దతుదారులకు వివరించడం ఇంకా కష్టం; కేజ్రీవాల్‌ను కాపాడేందుకు మాత్రమే కూటమి చేస్తున్నామని, ప్రజాస్వామ్యం కోసం కాదని చాలా మంది అనుకుంటున్నారు.
పాత కాంగ్రెస్ విధేయులు ఇప్పటికీ దీక్షిత్ పాలన, ఆమె ఢిల్లీలోని మౌలిక సదుపాయాలను మార్చిన విధానాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆమె కుమారుడు, కాంగ్రెస్ మాజీ తూర్పు ఢిల్లీ ఎంపీ సందీప్ దీక్షిత్, ఢిల్లీలోని మెజారిటీ పార్టీ నాయకులతో పాటు, కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. AAP కన్వీనర్, అతని సహచరులు ప్రస్తుతం చిక్కుకున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌పై అసలు ఫిర్యాదు చేసిందే.. సందీప్ దీక్షిత్, మాజీ ఢిల్లీ మంత్రి కిరణ్ వాలియా, ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అనిల్ చౌదరి ఉన్నారు. ఇప్పుడు ఇవే పార్టీలు అవి తప్పు అని, ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.
2019 లో, షీలా దీక్షిత్ తన గత ఎన్నికల్లో కన్హయ్య ఈ రోజు నుండి పోటీ చేస్తున్న అదే స్థానం నుంచి పోటీ చేసింది. ఆమె మరోసారి బిజెపికి చెందిన మనోజ్ తివారీ చేతిలో 3.66 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. అయితే ఇప్పుడు కన్హయ్య గెలవడం కోసం అరవింద్ కేజ్రీవాల్ ను పొగుడుతూ మాట్లాడుతున్నాడు. దీనిపై అరవిందర్ లవ్లీ చేసిన విమర్శలు సహేతుకమైనవే.
అబ్బురపరిచే ద్విపాత్రాభినయం
ఇక కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను తీసుకునే ప్రక్రియ సాధారణంగానే ఉంది. లవ్లీ రాజీనామా నేపథ్యంలో, కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ ఢిల్లీ విభాగానికి తాత్కాలిక చీఫ్‌గా దేవేంద్ర యాదవ్‌ను నియమించింది. ఒకప్పుడు షీలా దీక్షిత్ ద్వారా ఢిల్లీ కాంగ్రెస్‌లోని అనేకమందికి మార్గదర్శకత్వం వహించిన యువ నాయకుడైన యాదవ్, ఈ పోస్టుకు మంచి ఎంపిక కావచ్చు, అయితే అతను పంజాబ్‌లో పార్టీ వ్యవహారాలకు కూడా ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంది.
ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌లలో కాంగ్రెస్, ఆప్ మిత్రపక్షాలుగా ఉండవచ్చు కానీ పంజాబ్‌లో రెండు పార్టీలు బద్ద ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలలో పరస్పరం పోటీ పడుతున్నాయి. AAP ఎన్నికలకు ముందు పంజాబ్‌లో కాంగ్రెస్ నాయకులను వేటాడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం "రాజకీయ ప్రత్యర్థులపై ఫేక్ కేసులను నమోదు చేయడం ద్వారా వారిని భయపెట్టే బిజెపి రాజకీయాలను ఆచరిస్తోంది" అని ఆరోపించింది.
అందువల్ల, కొత్త DPCC చీఫ్‌గా యాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్-ఆప్ కూటమికి బ్యాటింగ్ చేయవలసి ఉంటుంది, పంజాబ్‌లో ప్రచార ట్రయల్‌లో తన పార్టీ అభ్యర్థులతో చేరేటప్పుడు అతను 'మిత్రపక్షాన్ని' దూషించవలసి ఉంటుంది.
చిక్కుముళ్లు విప్పడం ఎలా?
ఢిల్లీలో ఎన్నికలకు కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇండి కూటమికి ముందరి కాళ్లకు బంధం పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.రెండు పార్టీలు తమ ఉమ్మడి ప్రచారాన్ని ముమ్మరం చేయడంపై చర్చలు ప్రారంభించినట్లు వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలో కూటమి అభ్యర్థుల కోసం రెండు పార్టీలు కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ నాయకత్వ త్రయం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు విజ్ఞప్తి చేశారు. అట్టడుగు స్థాయిలో కూటమి సంక్లిష్టతలను అధిగమించడానికి ఇది సరిపోతుందా అనేది చూడాలి.