
గ్యాస్ సిలిండర్ పేలుడుతోనే గాయాలు: నిక్కీ వాంగ్మూలం
కీలక మలుపు తిరిగిన గ్రేటర్ నోయిడా వరకట్నం కేసు
గ్రేటర్ నోయిడా వరకట్న కేసు కొత్త మలుపు తిరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే కాలిన గాయాలు అయ్యాయని నిక్కి భాటీ తన మరణవాంగ్మూలంలో పేర్కొన్నట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం రూ. 36 లక్షల కట్నం ఇవ్వడం లేదని నిక్కిపై ఏదో ద్రావణం పోసి నిప్పంటించారని ఆరోపణలు వచ్చాయి.
డాక్టర్, నర్స్ ఏం చెప్పారంటే..
బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. ఫోర్టిస్ హస్పిటల్ లోని ఒక వైద్యుడు, నర్సు తో ఆమె మాట్లాడారు. నిక్కిని ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడూ ఆమె స్పృహలో ఉందని, ఆమె మాట్లాడుతున్నదని డాక్టర్, నర్సు ఇద్దరు తమ ప్రకటనలలో పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల కాలిన గాయాలు అయ్యాయని వారికి నిక్కి చెప్పారు.
అయితే నివాసంలో గ్యాస్ సిలిండర్ పేలినట్లు పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కానీ ఇంటి నుంచి ఖాళీ థిన్నర్ బాటిల్, లైటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వీటిని సాక్ష్యంగా పరిగణించారు. నిక్కీ అలాంటి ప్రకటన ఎందుకు ఇచ్చిందో లేదా ఆమెను అలా చెప్పమని బలవంతం చేశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిలిండర్ పేలుళ్లు కనిపించలేదు
తన కుటుంబ సభ్యులకు జైలుకు వెళ్లకుండా ఉండటానికి నిక్కి నిజం దాచిపెట్టి ఉండవచ్చని కాస్నా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ధర్మేంద్ర శుక్లా అభిప్రాయపడ్డారు.
‘‘ఆమె ఎవరినీ జైలుకు పంపకూడదని అనుకుంది. అందుకే ఆమె తన చివరి మాటల్లో ఎవరిని నిందించలేదు’’ అని ఆయన చెప్పినట్లు హిందూస్థాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
నిక్కి తన సోదరి కాంచన్ ను కాపాడుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చని, ఆమె ఒకే కుటుంబంలో వివాహం చేసుకున్నందున ఆమె గాయాలు సిలిండర్ పేలుడు వల్లే జరిగిందని ఆమె అత్తమామలపై నిందలు వేయడం కంటే, తన గాయాలు పేలుడు వల్లే జరిగిందని అబద్దం చెప్పిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు
పోలీసులు తీసిన ఫొటో ప్రకారం.. వంటగది చెక్కు చెదరకుండా కనిపించింది. శవపరీక్షలో నిక్కి కాలిన గాయాలతో మరణించినట్లు నివేదిక వచ్చింది. నిక్కిని ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది.
భర్త అత్తమామల అరెస్ట్
ఈ కేసులో భర్త విపిన్, అతని తల్లిదండ్రులు నిక్కీ సోదరి కాంచన్ ను వివాహం చేసుకున్న రోహిత్ భాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా విపిన్ కాలిపై కాల్చి పట్టుకున్నారు. పోలీసులు ఫోర్టీస్ ఆసుపత్రిలోని సీసీ కెమెరాను తనికీ చేయగా నిక్కి ఇంటి పక్కన ఉన్న దేవేంద్ర కారు నడిపినట్లు తేలింది. వెనక సీట్లో నిక్కీ, ఆమె అత్తగారు, మామ గారు ఉన్నారు. అందులో రోహిత్ కూడా కనిపించాడు.
దర్యాప్తు జరుగుతోంది..
కాంచన్ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వరకట్నం డిమాండ్లను తీర్చడంలో విఫలమైనందుకు నిక్కీని ఆమె ఆరేళ్ల కుమారుడు ముందే భర్త, అత్తామామలు ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారని ఆరోపించింది.
ఓ వీడియోలో నిక్కిని ఆమె భర్త, అత్తామామలు కొడుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే నిక్కి చెప్పిన మరణ వాంగ్మూలం కేసును కొత్త మలుపు తిప్పాయి. నిక్కీ, ఆమె సోదరి కాంచన్ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేయడం, బ్యూటీ పార్లర్ నడపడం కుటుంబంలో వివాదాలు రేపాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
Next Story