సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం?
x
సీఈసీ జ్ఞానేష్ కుమార్

సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం?

రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ కౌంటర్, అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఎన్నికల అయ్యాక ఓటర్ల సంఖ్య పెరిగినట్లు గుర్తుకు వచ్చిందా అని ఎదురుదాడి


ప్రతిపక్ష పార్టీలు, భారత ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన పోరు తీవ్రతరం కావడంతో ఇండి కూటమి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల సంఘం మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున ఓటర్లను మోసం చేసిందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను నిరాధారమైంది, రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని జ్ఞానేష్ కుమార్ ఎదురుదాడికి దిగాడు. దీనితో ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సీఈసీ మాట్లాడుతూ.. తాను చేసిన ఆరోపణలపై రుజువు చేస్తూ అఫిడవిట్లు సమర్పించాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్రలో దొంగ ఓట్లు వచ్చాయని ఎన్నికలు అయి ఓటమి తరువాత గుర్తుకు వచ్చిందా అని ఈసీ ఘాటుగా స్పందించింది. ఎన్నికల ముందు ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని పలు ప్రశ్నలు సంధించింది.

ఓట్ల దొంగతనం..
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. బీజేపీకి అనుకూలంగా ఓటర్ల డేటాను ఎన్నికల సంఘం తారుమారు చేసిందని ఆరోపించారు.
ఆగష్టు 7న బెంగళూర్ సెంట్రల్ నియోజకవర్గంలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 అక్రమ ఓట్లు జత చేసి లోక్ సభలో బీజేపీ విజయానికి దోహదపడ్డాయని రాహుల్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఈసీఐ బీజేపీతో కుమ్మక్కు అయిందని ఆరోపించారు.
అభిశంసన ప్రక్రియ..
ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగించే అభిశంసన ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ లాంటిది. దీనికి పార్లమెంట్ ద్వారా అభిశంసన తీర్మానం అవసరం. కానీ ప్రతిపక్షానికి తగినంత బలం లేకపోవడంతో ఉభయ సభల్లో ఇది నెగ్గడం కష్టమే.
ఈసీ మీడియా సమావేశం తరువాత రాహుల్ తిరిగి మాట్లాడారు. ఈసీ అనురాగ్ ఠాకూర్ ఇవే మాట్లాడితే ఎందుకు అఫిడవిట్ అడగలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా సీఈసీ వ్యాఖ్యలను విమర్శిస్తూ .. ఈసీ మాట్లాడితే బీజేపీ మాట్లాడుతున్నట్లు అనిపించింది అన్నారు.
మహాదేవపురలో మేము బహిర్గతం చేసిన లక్ష మంది ఓటర్ల గురించి ఆయన ఏదైనా స్పందించారా? అన్నారు. ఎన్నికల కమిషన్ కీలకమైన ప్రశ్నలను తప్పించుకుంటోందని ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా అన్నారు. రాహుల్ గాంధీ తన విలేకరుల సమావేశంలో సమర్పించిన పత్రాల ప్రామాణికతను స్పష్టం చేయాలని జేఎంఎం ఎంపీ మహువా ఈసీని కోరారు.


Read More
Next Story