హర్యానా భూకుంభకోణం: ఈడీ విచారణకు హజరైన రాబర్ట్ వాద్రా
x
రాబర్ట్ వాద్రా

హర్యానా భూకుంభకోణం: ఈడీ విచారణకు హజరైన రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ అధికారంలో ఉండగా నిమిషాల వ్యవధిలోనే లావాదేవీలు పూర్తి


లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బావమరిది, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మంగళవారం హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం న్యూఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హజరైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ విచారణ సందర్భంగా వాద్రా తన భద్రతా సిబ్బంది, మీడియా బృందంతో కలిసి సెంట్రల్ ఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్ లోని తన నివాసం నుంచి ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయం వరకూ దాదాపు 2 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య మాత్రమే అన్నారు. నేను మైనారిటీల కోసం మాట్లాడినప్పుడల్లా, వారు నన్ను ఆపడానికి మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తారు.

పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీని ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది దర్యాప్తు సంస్థల ను దుర్వినియోగం చేయడమే అన్నారు.

ఈ కేసులో వాద్రాకు మొదట ఏప్రిల్ 8న సమన్లు జారీ అయ్యాయి. కానీ ఆయన హజరుకాలేదు. దీనితో కొత్త తేదీ కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘శికోపూర్ భూ ఒప్పందం దర్యాప్తులో భాగంగా ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకోవడానికి మేము రాబర్ట్ వాద్రాను పిలిపించాము’’ అని ఈడీ అధికారి తెలిపారు.
భూమి ఒప్పందం..
వాద్రా భార్య ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. వీరిపై దర్యాప్తు హర్యానాలోని షికోహ్ పూర్ లో జరిగిన భూ ఒప్పందంతో ముడిపడి ఉంది.
ఫిబ్రవరి 2008 నాటి భూ ఒప్పందానికి సంబంధించినది. ఇందులో వాద్రాతో సంబంధం ఉన్న కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటేడ్ గురుగ్రామ్ లోని షికోహ్ పూర్ లో 3.5 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే సంస్థ నుంచి రూ. 7.5 కోట్ల ధరకు కొనుగోలు చేసింది.
ఈ భూమిని గంటల్లోనే మ్యూటేషన్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందంపై హర్యానా పోలీసులు 2018 లో కేసు నమోదు చేశారు. వాద్రా కంపెనీ ఆభూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ కి రూ. 58 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.
ఈ భారీ లాభాలు మనీలాండరింగ్ పథకంలో భాగమేనా అని తెలుసుకోవడానికి ఈడీ ఈ డబ్బు జాడ కోసం పరిశీలిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అతని వాంగ్మూలాన్ని నమోదు చేస్తుందని ఈ వర్గాలు తెలిపాయి. వేరే మనీలాండరింగ్ కేసులో వాద్రాను కేంద్ర దర్యాప్తు సంస్థ అనేకసార్లు ప్రశ్నించింది.


Read More
Next Story