కోడలితో మాజీ డీజీపీ అక్రమ సంబంధం, కుమారుడి మృతి
x
పంజాబ్ మాజీ డీజీపీ

కోడలితో మాజీ డీజీపీ అక్రమ సంబంధం, కుమారుడి మృతి

చట్టాన్ని కాపాడాల్సిన వాడే కాటేశాడు, కోడలితో కాపురం చేసిన మామ


పంజాబ్‌లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మాజీ డీజీపీ మహమ్మద్‌ ముస్తాఫా కుమారుడు అఖిల్‌ అఖ్తర్‌ మృతి ఘటన సంచలనం సృష్టిస్తోంది. మాజీ డీజీపీ కుమారుడు చనిపోతూ తీసిన ఓ వీడియో ఇప్పుడు వెలుగులోకి రావడమే ఇందుకు కారణం.

కూతురిగా భావించాల్సిన కోడలితో అక్రమ సంబంధమే అఖిల్ అఖ్తర్ కారణమని తెలుస్తోంది. అఖ్తర్ మృతిని తొలుత అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ ఇప్పుడు బయటపడుతున్న సంఘటనలు భావించినప్పటికీ అది అనుమానాస్పద మృతి కాదని, ఆత్మహత్య అని అనుమానిస్తున్నారు.
తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖీల్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు రావడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు మృతుడి కుటుంబసభ్యులపై హత్య అభియోగాలు మోపారు.
33 ఏళ్ల అఖీల్‌ అఖ్తర్‌ అక్టోబరు 16న పంచకులలోని తన ఇంట్లో స్పృహ కోల్పోయి కన్పించాడు. కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అఖ్తర్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డ్రగ్‌ ఓవర్‌డోస్‌ కారణంగానే తమ కుమారుడు మరణించినట్లు అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీంతో అనారోగ్య సమస్యలతో మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అఖిల్‌ తండ్రి ముస్తాఫా మాజీ డీజీపీ. తల్లి రజియా సుల్తానా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు.
యువకుడిని హతమార్చిన తండ్రి!
కాగా.. అఖిల్ మరణించిన కొద్ది రోజుల తర్వాత అతడి స్నేహితుడు షంషుద్దీన్ ఒకరు పోలీసులను ఆశ్రయించారు. అతడిని హత్య చేసి ఉంటారని ఆరోపించారు. అదే సమయంలో ఆగస్టు 27న అఖిల్ రికార్డు చేసిన ఓ వీడియో బయటకు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అందులో మాజీ డీజీపీపై మృతుడు సంచలన ఆరోపణలు చేశాడు.
షంషుద్దీన్ ఫిర్యాదు అఖిల్, అతని కుటుంబం మధ్య ఉన్న సంబంధాలను ఎత్తి చూపింది. అఖిల్ వీడియో అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని స్పష్టమైన హెచ్చరికగా పేర్కొన్నారు. అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేయాలని ఆయన అధికారులను కోరారు.
అఖిల్ సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు, పోస్ట్‌మార్టం నివేదిక, కుటుంబ సభ్యులు లేదా సహచరుల ప్రమేయం ఉందా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూడాలని ఫిర్యాదులో కోరారు.
మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫా, అతని భార్, మాజీ మంత్రి రజియా సుల్తానా, వారి కుమార్తె, కోడలిపై ఐపీసీ సెక్షన్లు 103(1), 61 కింద కేసు నమోదు చేశారు.
‘‘నా భార్యకు నా తండ్రితో సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను మానసికంగా కుంగిపోయా. ఈ సంబంధం గురించి మా ఇంట్లో అందరికీ తెలుసు. వాళ్లు నన్ను పిచ్చోడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులో ఇరికించడమూ లేక చంపేసేందుకో ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రలో నా తండ్రితో పాటు తల్లి, సోదరి కూడా భాగస్వాములే’’ అని అఖిల్ ఆ వీడియోలో ఆరోపించాడు. దీంతో ఈ వీడియో ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్‌ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తండ్రిలా కాపాడాల్సిన వాడే కాటేస్తే ఎలా అని సోషల్ మీడియా హోరెత్తుతుంది. నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం.
Read More
Next Story