
కుల్దీప్ సింగ్ సెంగార్
కుల్దీప్ సింగ్ సెంగార్ ను విడుదల చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యాయమూర్తులు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తారన్న ప్రధాన న్యాయమూర్తి, మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
‘ఉన్నావ్‘ మైనర్ బాలిక అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
2017 లో ఉన్నావ్ అత్యాచారం కేసులో సెంగర్ కు జీవిత ఖైదు విధించిన ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 23న సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేసింది. దోషి ఇప్పటికే ఏడు సంవత్సరాల ఐదు నెలల జైలు శిక్ష అనుభవించాడని పేర్కొంది. ఈ కేసులో 2019 లో ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అతని అప్పీల్ పెండింగ్ లో ఉండే వరకూ సస్పెన్షన్ మంజూరు చేసింది.
బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో సెంగర్ పదేళ్ల జైలు శిక్ష అనుభవించిన్నందున ఆయన జైలులోనే కొనసాగుతారు. ఆ కేసులో ఆయన దాఖలు చేసిన అప్పీల్ కూడా పెండింగ్ లో ఉంది. ఇప్పటికే కస్టడీలో గడిపిన సమయాన్ని పేర్కొంటూ శిక్షను నిలిపివేయాలని ఆయన కోరారు.
హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన వెకేషన్ బెంచ్.. సెంగర్ ను కస్టడీ నుంచి విడుదల చేయరాదని పేర్కొంది.
‘‘మేము సీబీఐ తరఫు న్యాయవాదీ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను, దోషి తరఫున సీనియర్ న్యాయవాదీని విచారించాము. చట్టపరమైన అనేక ప్రశ్నలు తలెత్తాయి. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి.
దోషిని విడుదల చేయబడినప్పుడూ అటువంటి ఆదేశాలను నిలిపివేయదని మాకు తెలుసు. కానీ ప్రత్యేక నేరానికి దోషిగా తేలిన వ్యక్తులను విచిత్రమైన వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 23న జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నాము. అందువల్ల ఆ ఉత్తర్వు ప్రకారం ప్రతివాదిని విడుదల చేయకూడదు’’ అని కోర్టు చెప్పిందని బార్ అండ్ బెంచ్ నివేదించింది.
పోక్సో పరిధి..
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) లోని సెక్షన్ 5 నుంచి కింద ప్రజా సేవకుడు అనేక పదానికి హైకోర్టు ఇచ్చిన వివరణ తప్పు కావచ్చు. చట్టసభ సభ్యులను మినహయించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
న్యాయమూర్తులు కూడా అప్పుడప్పుడు తప్పులు చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. పోక్సో కింద కానిస్టేబుల్ ప్రభుత్వ సేవకుడిగా ఉంటారని, కానీ శాసనసభ సభ్యుడు మినహయించబడతారనే వ్యాఖ్యలపై మేము ఆందోళన చెందుతున్నట్లు వేకేషన్ బెంచ్ పేర్కొంది.
విచారణ సందర్భంగా సీబీఐ తరఫున హజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ విషయాన్ని చాలా భయంకరమైన కేసుగా అభివర్ణించారు. ‘‘మేము ఆ అమ్మాయికి జవాబుదారీగా ఉన్నాము’’ అని అన్నారు.
చట్టం ప్రకారం.. విధించదగిన గరిష్ట శిక్ష అయిన ఏడు సంవత్సరాల జైలు శిక్షను సెంగర్ ఇప్పటికే అనుభవించాడనే పరిశీలన ఆధారంగా సెంగర్ శిక్షను సస్పెండ్ చేయాలన్నా హైకోర్టు నిర్ణయాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.
అత్యాచార చట్టాలకు సవరణలు చేసిన తరువాత సెంగర్ చేసిన నేరానికి కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష అవసరమని మెహతా వాదించారు. అయితే ప్రస్తుత కేసులో నేరం జరిగిన తరువాత ఈ సవరణ అమల్లోకి వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘నేరం జరిగిన సమయంలో ఈ సవరణ లేదు’’ అని ధర్మాసనం పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టు షరతులు..
గతంలో శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు అనేక షరతులు విధించింది. అదే మొత్తంలో ముగ్గురు పూచీకత్తులతో పాటు రూ. 15 లక్షల వ్యక్తిగత బాండ్ ను సమర్పించాలని సెంగర్ ను ఆదేశించింది.
ఢిల్లీలోని బాధితురాలి నివాసం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోకి ప్రవేశించకుండా, బాధితురాలిని లేదా ఆమె తల్లిని బెదిరించకుండా కోర్టు అతడిని నిరోధించింది. ఏదైన ఉల్లంఘన జరిపితే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఆగష్టు 1, 2019 న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు యూపీ నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు.
Next Story

