కర్రెగుట్టలో జరిపిన ఆపరేషన్లతోనే మావోయిస్టుల ఉద్యమం బలహీనపడిందా?
x
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్

కర్రెగుట్టలో జరిపిన ఆపరేషన్లతోనే మావోయిస్టుల ఉద్యమం బలహీనపడిందా?

చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కార్యదర్శి బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావు హతం


రాజేశ్ అహుజా

దేశంలో మావోయిస్టు పార్టీకి చివరాఖరు గడియాలు వచ్చేసినట్లే ఉన్నాయి. సాయుధ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న అబూజ్ మఢ్ కోటను భద్రతా బలగాలు మెల్లగా బద్దలు కొడుతున్నాయి.

ఇదేమీ ఒక్కరోజులోనూ జరగలేదు. దశలవారీగా దళాలు లోపలికి ప్రవేశించి మెల్లగా పట్టు బిగించాయి. చత్తీస్ గఢ్ లోని మావోయిస్టుల బలమైన ప్రదేశాలలో ఇటుక ఇటుకు పేరుస్తూ భద్రతను బలోపేతం చేశారు.

దీనిఫలితమే బుధవారం మావోయిస్టు అగ్రనేత, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు అలియాస్ బసవరాజు, దాదాపు రెండు డజన్ల మంది అంగరక్షకులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు.

చత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట కొండలలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), ఆ రాష్ట్ర పోలీసులు కలిసి ఏప్రిల్ 21 నుంచి మే 11 మధ్య ఆపరేషన్ నిర్వహించారు.
భద్రతా దళాలు మావోయిస్టుల బలమైన ప్రదేశంలోకి చొరబడి, తిరుగుబాటుదారులకు, వారి వనరులకు భారీ నష్టం కలిగించి, క్షేమంగా బయటపడ్డాయి. బలగాలు, మావోయిస్టులపై తమ పట్టు పెంచుకున్నారనేదానికి ఇవి తాజా సంకేతాలు.
31 మంది మావోయిస్టుల మృతి..
కర్రెగుట్టలలో చేసిన కూంబింగ్ సందర్భంగా భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య అనేక ఎన్ కౌంటర్లు జరిగాయి. ఫలితంగా 31 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారు. వీరిలో ఎక్కువ మంది సీపీఐ(మావోయిస్టు) పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో అత్యంత బలమైన బెటాలియన్ వన్ కి చెందినవారు.
‘‘ఈ ఆపరేషన్ మావోయిస్టులను విచ్చిన్నం చేసింది. ఒకప్పుడూ మావోయిస్టులు 300 నుంచి 400 మంది గుంపుగా తిరిగేవారు. ఇప్పుడు సీఆర్పీఎఫ్ వారిని విచ్చిన్నం చేసింది.
వీరు ప్రస్తుతం 20 నుంచి 30 మంది వ్యక్తుల సమూహంగా తిరుగుతున్నారు. ఇది వారి సంఖ్య బలాన్ని తగ్గించింది’’ అని ఆపరేషన్ ప్రణాళిక, అమలులో పాల్గొన్న ఒక భద్రతా అధికారి అన్నారు.
మావోయిస్టులు చిన్న సమూహాలుగా సంచరిస్తున్నందున వారిని ఛత్తీస్ గఢ్ లోని స్థానిక పోలీసులు చూసుకోవచ్చు. వాస్తవానికి బుధవారం నాడు జిల్లా స్థాయిలో రాష్ట్ర పోలీసుల మావోయిస్టు వ్యతిరేక విభాగం అయిన డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావును కాల్చిచంపగలిగింది. అంటే ఎంత చిన్న బృందాలుగా మావోయిస్టులు విడిపోయారో అర్థం చేసుకోవచ్చు.
స్థానికులకు ఒక సందేశం..
కర్రెగుట్ట లో బలగాలు చేసిన కూంబింగ్ స్థానిక ప్రజలకు మావోయిస్టులు అజేయులు కారని, వారి కోటలను కూడా సులభంగా ఛేదించవచ్చని చూపించిందని అధికారులు చెబుతున్నారు.
‘‘ఈ ఆపరేషన్ విజయం మావోయిస్టుల బెదిరింపుతో బాధపడుతున్న ఈ ప్రాంత ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని పంపడమే కాకుండా, భద్రతా దళాలకు మనోధైర్యాన్ని పెంచింది.
మావోయిస్టులకు బలమైన ప్రదేశంలోనే విజయవంతంగా ఎదుర్కొని వారిని పారిపోయేలా చేయగలదనే విశ్వాసాన్ని స్థానిక ప్రజలలో నింపింది’’ అని అధికారి తెలిపారు.
ఈ ఆపరేషన్ ఫలితంగా కర్రెగుట్ట కొండలలో మావోయిస్టుల ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నారని, వారి వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు తగ్గిపోయాయని అధికారులు తెలిపారు. ఇక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. వారికి ఆయుధాలు అందే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు.
‘‘కర్రెగుట్ట ప్రచారం సమయంలో ఇది ముగింపుకు నాంది అని నేను చెప్పాను. ఇప్పుడు ఇది జరుగుతోంది.’’ అని చత్తీస్ గఢ్ లో మకాం వేసిన సీఆర్పీఎఫ్ చీప్ జి సింగ్ అన్నారు.
నాలుగు రోజుల వేట ముగింపు..
మావోయిస్టులకు మరో బలమైన కోట అయిన అబూజ్ మడ్ ల చత్తీస్ గఢ్ పోలీసులు నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ లో బసవరాజు హత్య పరాకాష్టం.
‘‘మాకు ఇక్కడ సాయుధ మావోయిస్టుల బృందం కదలిక గురించి సమాచారం అందింది. ఆ పార్టీ నాయకులు ఆ బృందంలో భాగమే అని అనుమానం వచ్చింది. మేము నాలుగు రోజులుగా వారిని వెంబడిస్తున్నాము.
రెండు సార్లు మేము వారితో కాల్పులు జరిపాము. వారి కమ్యూనికేషన్ పరికరాలు, ఆయుధాలతో సహ వారి సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నాము. వాటిని బృందం పారిపోతున్నప్పుడు వదిలివేసింది.
చివరకు ఒక ఎన్ కౌంటర్ జరిగింది. దీనిలో బసవరాజు కూడా మరణించాడు’’ అని ఛత్తీస్ గఢ్ అదనపు జనరల్ ఆఫ్ పోలీస్( యాంటీ నక్సల్) వివేకానంద సిన్హా అన్నారు. ఇది మావోయిస్టు ఉద్యమానికి పెద్ద గొడ్డలిపెట్టు లాంటిది.
Read More
Next Story