అతిపెద్ద కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రమేయం : రాహుల్ గాంధీ
x

అతిపెద్ద కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రమేయం : రాహుల్ గాంధీ

మార్పు తెస్తానని అంటూ ఢిల్లీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడని విమర్శలు


ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రజాధనాన్ని లూటీ చేయడానికి తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

ఢిల్లీ ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో వారిని విడిచిపెట్టాడని, వారి పరిస్థితి దిగజారడానికి కేజ్రీవాలే కారణమన్నారు. ఇంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్థానాలు అమలు చేయడంలో విఫలం అయ్యారని ఆరోపించారు.

భిన్న రాజకీయాల పేరుతో మోసం..
కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు భిన్న రాజకీయాల పేరు చెప్పి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బయటి వ్యక్తి ఆశాజనకమైన మార్పు తెస్తారని హమీ ఇచ్చారు. గత 15 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు తేలేక విఫలం అయ్యారు’’ అని విమర్శించారు.
అతడు ఢిల్లీని మారుస్తాడని చెప్పాడు.. కానీ పేదలకు అవసరమైనప్పుడు, హింసతో ఢిల్లీ నలిగిపోయినప్పుడూ, కేజ్రీవాల్ ప్రజలకు అందుబాటులోకి ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోనే అతిపెద్ద రాజకీయ కుంభకోణం..
కేజ్రీవాల్ కపటాల్లో ఆరితేరారని అన్నారు. దేశాన్ని క్లీన్ చేస్తానని చెప్పుకుంటూ దానికి బదులుగా అతిపెద్ద మద్యం కుంభకోణం చేశాడని అన్నారు. ఆయన ఉన్న శీష్ మహాల్ ను వందల కోట్లతో అభివృద్ధి చేసుకున్న ఫొటోలను ప్రజలంతా చూశారని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా తన సుఖం కోసం వాడుకున్నారని అన్నారు.
ఎంపీగా తన పై అనర్హత వేటు పడిన తరువాత మోదీని తన ఇంటిని ఇవ్వాలని కోరినప్పుడు నిర్భయంగా తాళం చెవులు ప్రభుత్వానికి అప్పగించానని, కానీ కేజ్రీవాల్ మాత్రం శీష్ మహాల్ లోనే నివసించాడని అన్నారు.
ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సైతం ఆయన విమర్శలు గుప్పించారు. ఇంతకుముందు ఆయన పోటీ చేసిన పట్పర్ గంజ్ సీటును విడిచిపెట్టి జంగ్ పురాలోని కొత్త నియోజకవర్గానికి ఎందుకు వచ్చాడని, ప్రశ్నించారు. ‘‘కేజ్రీవాల్ తో పాటు మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా కీలక పాత్రధారి. ఈసారి కొత్త స్నేహితులతో కొత్త సీటులో పోటీచేసేందుకు పట్పర్ గంజ్ నుంచి పారిపోయాడు’’ అని ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారు.


Read More
Next Story