‘ఆప్’ మెడకు కాగ్ నివేదిక ఉచ్చు
x

‘ఆప్’ మెడకు కాగ్ నివేదిక ఉచ్చు

లిక్కర్ పాలసీలో ఆప్ విధానంతో నష్టం జరిగిందని నివేదిక?


ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ కు కాగ్ రిపోర్ట్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అమలులో లోపాలు, పారదర్శకత లేకపోవడం, అనుకున్న విధాన లక్ష్యాలు లేకపోవడంతో రాష్ట్ర ఖజానాకు రూ. 2026 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. కాగ్ నివేదికను అధికారికంగా బయటకు రానప్పటికీ దానిలోని కొన్ని పేరాలు మీడియాలో వచ్చాయి. దీనితో ఆప్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది.

ఇప్పటికే ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. వచ్చే నెల ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగగా, 8న ఓట్ల లెక్కింపు జరిగింది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయి జైలు జీవితం అనుభవించారు. తాజాగా కాగ్ నివేదికలోని అంశాలు బయటకురావడంతో బీజేపీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించింది.
నష్టాలు..
జాతీయ మీడియాలోని కొన్ని అంశాల ప్రకారం... కొంతమంది రిటైలర్లు తమ లైసెన్సులను ముందుగానే సరెండర్ చేయగా, మరికొంత లేకుండానే ఉన్నారు. సరెండర్ చేసిన లైసెన్స్ లను తిరిగి జారీ చేయడంలో ప్రభుత్వం విఫలమయింది. దాని వల్ల ఖజానాకు రూ. 890 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే జోనల్ లైసెన్స్ లకు ఇచ్చిన మినహాయింపుల వల్ల రూ. 941 కోట్ల రెవెన్యూ లోటుకు కారణమయ్యాయి.
కోవిడ్ పరిమితులను ఉటంకిస్తూ జోనల్ లైసెన్స్ ల కోసం మొత్తం రూ. 144 కోట్ల లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం మాఫీ చేసింది. సెక్యూరిటీ డిపాజిట్లను సేకరించడంలో విధానపరమైన లోపాల వల్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొంది.
ఫైనాన్షియల్ దుర్వినియోగం, విధానపరమైన ఉల్లంఘనలు జరిగినట్లుగా పేర్కొంది. అనేక సంస్థలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నాయని తెలిసినప్పటికీ లైసెన్స్ మంజూరు చేయడం పై కాగ్ విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కీలక ఫలితాలు.. లోపాలు..
నిపుణుల ప్యానెల్ సిఫార్సులను మనీష్ సిసోడియా నేతృత్వంలోని కమిటీ విస్మరించిందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఫిర్యాదులు ఉన్నప్పటికీ అన్ని సంస్థలను వేలంలోకి అనుమతించారు. అసలు వేలంలో పాల్గొన్న సంస్థల ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండానే ఇందుకు అనుమతించారని పేర్కొంది.
ఓ సంస్థ నష్టాన్ని చూపినప్పటికీ దాని లైసెన్స్ ను పునరుద్దరించారు. లైసెన్స్ ల జారీలో కూడా అనేక లోపాలు ఉన్నాయని, నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఎత్తి చూపింది. అయినప్పటికీ వాటిపై ఎలాంటి నిబంధనలు విధించలేదు. ధరల విషయంలో పారదర్శకత కొరవడిందని, అనేక కీలక నిర్ణయాలపై క్యాబినెట్ లేదా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఆమోదం కోరలేదని నివేదిక హైలైట్ చేసింది. శాసనసభ ముందు ఎలాంటి ఎక్సైజ్ నియమాలు అమలు పొందలేదని పేర్కొంది.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ఈ లోపాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరింది. పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ ఈ ఫలితాలు ఆప్ ప్రభుత్వం కు మింగుడు పడటం లేదు. కాగ్ నివేదిక ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపింది. వేలంలో పాల్గొన్న సంస్థలను అసలు సరిగా అంచనా వేయలేదని పేర్కొంది. ఇవన్నీ పాలసీ లక్ష్యాలను నెరవేరకుండా అడ్డుకున్నాయని అంది. రిటైల్అవుట్ లెట్ ల సమాన పంపిణీని నిర్ధారించడంలో ఈ విధానం విఫలమైందని పేర్కొంది.
బీజేపీ విమర్శలు..
కాగ్’ ఆప్ ప్రభుత్వం అమలు చేసిన లోపాలను బహిర్గతం చేయడంతో బీజేపీ విమర్శలను తీవ్రతరం చేసింది. ప్రభుత్వం తన దుర్మార్గాలను దాచడానికే కాగ్ నివేదికను అసెంబ్లీలో సమర్పించకుండా దాగుడు మూతలు ఆడిందని కమలదళం ఆరోపించింది. ఆప్ సర్కార్ నిర్వాకంతోనే ప్రభుత్వానికి రూ. 2026 కోట్ల నష్టం వాటిల్లందని, ఈ మొత్తాలను కంపెనీల నుంచి మినహాయించి కిక్ బ్యాక్ ల రూపంలో తీసుకున్నారని విమర్శలు గుప్పించింది.

ఇదే అంశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘ ఆ పార్టీ అధికార మత్తులో ఉంది. ఆప్ లూట్ మోడల్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. దాని దుర్మార్గాలకు శిక్ష పడటానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది’’ అని పేర్కొన్నారు.
ఇదే విషయంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక ఇచ్చిందని దీనిని మధ్యలోనే ప్రభుత్వం రద్దు చేసిందని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. కేజ్రీవాలే స్కామ్ లో కింగ్ ఫిన్ అని ఆయన ముడుపులను జేబులో వేసుకున్నారని విమర్శలు గుప్పించారు.
ఆప్ కు నిజాయతీ ముఖం లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి పదవిలో ఇప్పుడూ ఎవరుంటారని అన్నారు. ఇవే ఆరోపణలపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ప్రశ్నించగా ‘‘ రిపోర్ట్ ఎక్కడ ఉంది. కాగ్ రిపోర్ట్ ఇవ్వలేదని బీజేపీ చెబుతూనే, మళ్లీ ఆరోపణలు చెస్తోంది’’ అని సమాధానమిచ్చారు.


Read More
Next Story