‘జస్టిస్ ఈజ్ డ్యూ’ కాగితం అంటించుకునీ మరీ ఆత్మహత్య
x

‘జస్టిస్ ఈజ్ డ్యూ’ కాగితం అంటించుకునీ మరీ ఆత్మహత్య

బెంగళూర్ టేకీ బలవన్శరణంపై 498-ఏ పై దేశ వ్యాప్త చర్చ


భారత్ లో ఏకపక్ష చట్టాలు ఓ వ్యక్తి నరకం అనుభవించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాయి. పోలీసులు, న్యాయ వ్యవస్థ బాధితుడికి భరోసా కల్పించకుండా వేధించడం, తన గోడు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో 24 పేజీల ఆత్మహత్య లేఖ రాసి, తన శరీరంపై ‘‘ జస్టిస్ ఈజ్ డ్యూ’’ అని రాసి ఉన్న కాగితం అంటించుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడటం దేశంలో సంచలనం రేపింది. వివరాలు.. బెంగళూర్ లో పనిచేసే టెకీ అతుల్ సుభాష్ తన భార్య నికితా సింఘానియా, అతని కుటుంబం చేస్తున్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

అక్రమ కేసులతో వేధించిన మాజీ భార్య..
అతుల్ సుభాష్ కు 2020 లో నికితా తో వివాహం అయింది. సంవత్సరం తరువాత వీరికో కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి అతనికి వేధింపులు ప్రారంభం అయ్యాయి. చివరకు ఇద్దరు 2022లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం అంటే ఏప్రిల్ లో నికిత కుటుంబం ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ లో తనను వరకట్నం కోసం భర్త అత్తమామలు వేధిస్తున్నారని, భర్త అసహజ శృంగారంతో మానసికంగా వేధించేవాడని, తరచుగా భౌతిక దాడికి పాల్పడేవాడని కేసు పెట్టింది. ఈ కేసులో అతుల్ తో పాటు అతని తల్లిదండ్రులు, సోదరుడిపై సైతం కేసు నమోదు అయింది.
కోర్టులో తన మాజీ భార్య రూ. 10 అదనపు కట్నం తెచ్చే విధంగా ఒత్తిడి చేసినట్లు వివరించిన ఆయన.. తను సంపాదించిన వివరాలు సైతం సూసైట్ నోట్ లో వివరించాడు. తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో రూ. 40 లక్షల సంపాదించానని, తరువాత రూ. 80 ఆదాయం సమకూరిందని, కేవలం పది లక్షల కోసం తానేందుకు వేధిస్తానని వివరించాడు. తను రక్తం కారినట్లు కొట్టినట్లు కోర్టుకు చెప్పిన సమయంలో కనీసం ఒక్క ఆధారం కూడా అడగలేదని, ఓ వ్యక్తిని రక్తం వచ్చినట్లు బాదితే కొన్ని గుర్తులు కనిపిస్తాయని కానీ అవేవీ లేకుండా తనను వేధించారని తెలిపారు.
ఆమె తండ్రి మరణం ఓ బాలీవుడ్ కథ..
తాను, తన కుటుంబం చేసిన వేధింపుల వల్లే నికితా సింఘానియా తండ్రి మరణించినట్లు కూడా కేసు దాఖలైనట్లు ఉన్న ఆరోపణలపై అతుల్ స్పందించాడు. ఆయనకు షుగర్, గుండె జబ్బులతో గత పది సంవత్సరాలుగా చికిత్స పొందుతున్నారని, తమ పెళ్లి నాటికే వైద్యులు ఆయనకు కొన్ని నెలల సమయం ఇచ్చారని తెలిపారు. ఆయన మరణం పై వీళ్లు చెప్పినవన్నీ కూడా "పేద్ద బాలీవుడ్ ప్లాట్" అని పేర్కొన్నారు.
తన భార్య, ఆమె బంధువులు తనపై, తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని, ఆమెకు నెలకు ₹ 2 లక్షలు భరణం చెల్లించాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అతుల్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. "ఇప్పుడు, నేను వెళ్లిపోవడంతో, డబ్బు ఉండదు. నా వృద్ధ తల్లిదండ్రులను, నా సోదరుడిని వేధించడానికి ఎటువంటి ఆధారం ఉండదు. నేను నా శరీరాన్ని నాశనం చేసి ఉండవచ్చు, కానీ నేను నమ్మిన ప్రతిదాన్ని అది కాపాడింది" అని అతను రాశాడు.

ఉత్తర ప్రదేశ్ చేరుకున్న బెంగళూర్ పోలీసులు..

అతుల్ మరణంపై బెంగళూర్ పోలీసులు గురువారం నికితా సింఘానియా సొంత ఊరు అయిన జౌన్పూర్ చేరుకున్నారు. ఈ కేసు విషయంపై మాజీ భార్యను విచారించనున్నట్లు తెలిసింది. అతుల్ మరణంపై మీడియా సింఘానియా కుటుంబాన్ని ప్రశ్నించగా.. వారు సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఏదైన చెప్పుకోవాల్సింది ఉంటే.. కోర్టులో చెప్పుకుంటామని పేర్కొన్నారు.


Read More
Next Story