షీలా దీక్షిత్ లాంటి పాలన మళ్లీ తీసుకొస్తాం: కాంగ్రెస్
x

షీలా దీక్షిత్ లాంటి పాలన మళ్లీ తీసుకొస్తాం: కాంగ్రెస్

కేజ్రీవాల్ మూలాలే అవినీతితో ఉన్నాయని విమర్శలు


ఢిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తూనే ఉన్నాయి. పార్టీల ప్రచారానికి చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ పార్టీ దివంగత మాజీ సీఎం, షీలా దీక్షిత్ పేరుతో ప్రచారాలు చేసింది.

ఆమె హయాంలో ఢిల్లీ అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించిందని, మరోసారి మాకు అవకాశం ఇస్తే అలాంటి పాలనే తెస్తామని హమీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలను చిక్కుకోవడాన్ని గుర్తు చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది.

భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలను అణచివేస్తోందని, ఢిల్లీలోని అట్టడుగు వర్గాల ఆందోళనలను నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
దీక్షిత్ పాలన వైభవాన్ని తిరిగి తెస్తాం: యాదవ్
ఢిల్లీని 15 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంతో ఏలిన షీలా దీక్షిత్ వైభవాన్ని తిరిగి ఈ ఎన్నికల విజయంతో నెలకొల్పుతాయని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ విశ్వసం వ్యక్తం చేశారు. ఆమె అభివృద్ధి వారసత్వాన్ని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు.
ఆప్ పాలనలో ఢిల్లీ అన్ని రంగాల్లో క్షీణించిందని, మౌలిక సదుపాయాలు నాసిరంకగా ఉన్నాయని విమర్శించారు. నీటి నాణ్యత అధ్వాన్నంగా మారాయని, ప్రజా సమస్యలను గాలికి కొదిలేశారని, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
ఈ ఎన్నికలు షీలాదీక్షిత్ నిర్మించిన ఢిల్లీని తిరిగి తీసుకురావడమే ప్రపంచ స్థాయి రోడ్లు, స్వచ్ఛమైన నీరు, సమర్థవంతమైన పాలనతో కూడిన నగరం అని యాదవ్ పేర్కొన్నారు.
ఆప్ విమర్శలు గుప్పించిన సందీప్ దీక్షిత్..
దివంగత షీలా దీక్షిత్ కుమారుడు న్యూ ఢిల్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ ప్రచారం చేసుకుంటుందని, కానీ అదంతా తప్పని అన్నారు.
కోవిడ్ సమయంలో దాని హెల్త్ కేర్ మోడల్ పూర్తిగా విఫలమయిందని, ముఖ్యంగా మొహల్లా క్లినిక్ ఎందుకు ఉపయోగపడదని విమర్శించారు. మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ అతిపెద్ద అవినీతి మూలాల్లో ఒకరని అభివర్ణించారు. నగరంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే ఢిల్లీ నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.


Read More
Next Story