సీట్ల షేరింగ్ లో అలకపాన్పుపై ఆర్జేడీ.. ఏకపక్షం అంటూ ప్రకటన
x

సీట్ల షేరింగ్ లో అలకపాన్పుపై ఆర్జేడీ.. ఏకపక్షం అంటూ ప్రకటన

ఎన్నికలలో సీట్ల షేరింగ్ పై భాగస్వామ్య పక్షాల ఏకపక్షంతో వ్యవహరిస్తున్నాయని ఆర్జేడీ అలకపాన్పు ఎక్కింది. తమకు వేరే దారులు ఉన్నాయని..


జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ లో పార్టీల మధ్య పొత్తు కుదరట్లేదు. తమ కోసం జేఎంఎం, కాంగ్రెస్ ప్రకటించిన సీట్లపై రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) అలకపాన్పు ఎక్కింది. అయితే తమ ఎంపికలు అన్ని తెరిచే ఉన్నాయని ఆర్జేడీ ప్రకటించింది. అంటే వేరే పార్టీలతో తాము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా చెప్పినట్లు అయింది.

ఆర్‌జేడీ, వామపక్షాలు కలిసి మొత్తం 81 స్థానాల్లో 11 స్థానాల్లో పోటీ చేస్తాయని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ ఏకపక్షంగా ప్రకటించాయని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా తెలిపారు.
సంతోషించని RJD
జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ మాట్లాడుతూ 70 స్థానాల్లో అత్యధికంగా జేఎంఎం, కాంగ్రెస్‌ పోటీ చేస్తాయని చెప్పారు. "మాకు సీట్ల ఆఫర్‌పై మేము నిరాశను వ్యక్తం చేస్తున్నాము. నిర్ణయం ఏకపక్షంగా ఉంది" అని ఝా అన్నారు. “మమ్మల్ని సంప్రదించలేదు. అన్ని వేరే దారులు ఉన్నాయి." అని చెప్పారు.
జార్ఖండ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని సొంతంగా ఓడించే సత్తా ఉన్న 15 నుంచి 18 స్థానాలను ఆర్జేడీ గుర్తించిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ ఏడు స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జార్ఖండ్ ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరో వైపు దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో కూడా సీట్ల షేరింగ్ విషయంలో పీటముడి వీడట్లేదు. ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడీ లోని కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఠాక్రే శివసేనలో కూడా తమకే ఎక్కువ సీట్లు కావాలని మూడు వర్గాలు పట్టుపడుతున్నాయి. అలాగే అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో కూడా ఇలాగే సీట్ల షేరింగ్ విషయంలో అలకలు మొదలయ్యాయి.



Read More
Next Story