
కేజ్రీవాల్ పై కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు
ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన ఢిల్లీ కోర్టు
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది. పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయనతో పాటు ఆప్ కు చెందిన ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తర్వూలు జారీ చేసింది.
ఇప్పటికే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో బెయిల్ పై బయట ఉన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైంది. స్వయంగా కేజ్రీవాల్ ఓటమి చెందారు. ఆయన ప్రస్తుతం పంజాబ్ లో జరిగే ఉప ఎన్నికపై దృష్టి పెట్టి, తన మకాం అక్కడికే మార్చారు.
‘‘156(3) సీఆర్పీసీ సెక్షన్ కింద దరఖాస్తు అనుమతించడానికి అర్హమైనదని ఈ కోర్టు భావిస్తుంది. దీని ప్రకారం .. ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ వైకల్యం ఆఫ్ ప్రాయార్టీ యాక్ట 2007 లోని సెక్షన్ 3 కింద కేసు వాస్తవాల నుంచి జరిగినట్లు కనిపించే ఏదైనా ఇత నేరం కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత ఎస్ హెచ్ ఓ ని ఆదేశించిడం జరిగింది’’ అని అదనపు చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నేహ మిట్టల్ అన్నారు.
2019 లో దాఖలైన ఫిర్యాదులో కేజ్రీవాల్ అప్పటి మటియాల ఎమ్మెల్యే గులాబ్ సింగ్, అప్పటి ద్వారాకా వార్డ్ కౌన్సిలర్ నితికా శర్మ లు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాధనాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.
Next Story