బీహర్ లో అధికారాన్ని ఏ ఒక్కరు ఒంటరిగా సాధించలేరా?
x
బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రతిపక్ష నాాయకుడు తేజస్వీ యాదవ్

బీహర్ లో అధికారాన్ని ఏ ఒక్కరు ఒంటరిగా సాధించలేరా?

రెండు దశాబ్ధాలుగా రాష్ట్రాన్ని శాసిస్తున్న కూటములు


రంజిత్ భూషణ్

ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఒక పార్టీదే ఏకఛత్రాధిపత్యం నడుస్తోంది కానీ బీహార్ ఇందుకు మినహయింపు అని చెప్పవచ్చు. బీహార్ కుల రాజకీయాలు హిందీ బెల్ట్ లోని హిందూత్వ ప్రభావ రాజకీయాలను సమానంగా ఉంటాయి.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం రెండు విడతలుగా అంటే నవంబర్ 6, 11 తేదీలలో ఎన్నికలు నిర్వహించబోతోంది.
దేశంలోని చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు లేదా జాతీయ పార్టీలుగా పోటీ చేయడం మనం గమనించి ఉంటాం. కానీ బీహర్ ఒక కలగూరగంప. ఇందులో ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి.
ఇవే కాకుండా స్థానిక కుల బలంతోనే కొన్ని రంగంలోకి దూకుతాయి. అధికారంలో ఉన్న జేడీ(యూ), బీజేపీ తో పాటు ప్రతిపక్ష ఆర్జేడీతో కాంగ్రెస్, హిందూస్థాన్ అవామీ మోర్చా, ఆల్ ఇండియా ఇత్తేహదుల్ ముస్లమీన్, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతోంది.
సంకీర్ణ రాజకీయాలకు కేంద్రంగా..
90 వ దశకంలో బీహార్ లో దేశంలోనూ.. ఏకకాలంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయింది. జనతాదళ్ కు చెందిన పార్టీలు తమ ప్రభావాన్ని బలంగా చూపడం ప్రారంభించాయి. అలాగే రాష్ట్రంలో వ్యక్తులు డామినేట్ చేసే పాలన మొదలయింది. ముఖ్యంగా 1995 లో లాలు ప్రసాద్ యాదవ్ అధికారంలోకి రావడంతో ఈ రాజకీయాలకు ఊపు వచ్చింది.
1997 లో ఈ రాజకీయాలు ఇంకాస్త ముందుకు వెళ్లాయి. 2005 నుంచి బీహార్ ను వరుసగా సంకీర్ణ రాజకీయాలే శాసిస్తున్నాయి. వీటిలో జేడీ(యూ) - బీజేపీ కూటమి తో పాటు ఆర్జేడీ- కాంగ్రెస్ ఇతర పార్టీల కూటమి అధికారాలను పంచుకుంటున్నాయి.
బీహర్ లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇక్కడి ఓటర్ల విభజన దాదాపుగా సమాన స్థాయిలో ఉంది. తటస్థ ఓటర్ల శాతం చాలా తక్కువ. కానీ వాళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా మెజారిటీ సాధించలేదు. కూటమిగానే అధికారం పంచుకోవాల్సి ఉంటుంది. 243 సీట్లు ఉన్న బీహార్ శాసనసభలో అధికారం చేపట్టాలంటే పార్టీ గానీ, కూటమిగానీ కనీసం 122 మేజిక్ ఫిగర్ ను దాటాల్సిందే.
2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ పార్టీకి 75 స్థానాలు రాగా, బీజేపీకి 74 సీట్లు, జేడీ(యూ)కు 43, ఎంఐఎంకు 5, హెచ్ ఏ ఎం, వీఐపీ చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే బీహార్ లో సింగిల్ గా విజేత కావడం కష్టమే అని అర్థమవుతోంది.
ప్రాంతీయ ఆటగాళ్ల ఆధిపత్యం..
బీహార్ ఎన్నికల డేటాను గనక పరిశీలిస్తే.. 2020 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మొత్తం ఓట్లలో 15 శాతం, జేడీయూ 20 శాతం, ఆర్జేడీ 24 శాతం, ఎల్జేపీ 11 శాతం, కాంగ్రెస్ కేవలం 6 శాతం ఓట్లను సాధించాయి.
ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కడ లేనన్నీ ప్రాంతీయ పార్టీలు బీహర్ లో కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితులు, కూటములు, ప్రాంతీయ పార్టీల ప్రభావంతో 1989లోనే ఏకపార్టీ పాలన ముగిసింది. ఇక్కడ కాంగ్రెస్ చివరగా సొంతంగా మెజారిటీ సాధించింది.
నేడు బీహర్ ప్రధానంగా రెండు కూటముల ఆధిపత్యం మధ్యే కొనసాగుతోంది. ఒకటి ఎన్డీఏ, రెండోది మహ గట్ బంధన్. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీ(యూ) రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన శక్తులలు ఒకటి, ఇది సంకీర్ణాలకు కేంద్రంగా పనిచేస్తోంది.
లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ మహా గట్ బంధన్ కు నాయకుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ ఇక్కడ గణనీయమైన పట్టు ఉంది.
అలాగే చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని పార్టీ, హిందూస్తాన్ అవామీ మోర్చా వంటి వాటికి ఇక్కడ ప్రజాదరణ ఉంది. అలాగే సీపీఐ ఎంఎల్ కు కూడా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. ఆ పార్టీ మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది.
జన్ సు‘రాజ్’ అవుతాడా..
ప్రస్తుతం బీహార్ లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంతంగా జన్ సురాజ్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం. ఈ వారం ఆయన పార్టీ 51 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. మొత్తం 243 స్థానాలలో జన్ సురాజ్ పోటీ చేస్తుందని పీకే అధికారికంగా చెప్పేశారు కూడా.
‘‘ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ కూడా ఎన్నికలలో పోటీ చేస్తోంది. సాంప్రదాయ రాజకీయాలతో ఓటర్లను ఆకర్షించే డైనమిక్స్ పై ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఈ అంచనాలను తోసిపుచ్చలేము’’ అని రాజకీయ విశ్లేషకుడు ప్రభాత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రెండు కూటములు కూడా సీట్ల సర్దుబాటుపై దృష్టి సారిస్తున్నాయి. రెండు శిబిరాల్లోని మిత్రపక్షాలు మరింత అనుకూలమైన నిబంధనల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్డీఏ తన ఒప్పందాన్ని ఖరారు చేసే దశలో ఉన్నట్లు కనిపిస్తోంది.
సీట్ల డిమాండ్...
2024 సార్వత్రిక ఎన్నికల తరువాత నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) బేరసారాలకు దిగడంతో ఎన్డీఏలో సీట్ల పంపకాలు కష్టంగా మారుతోంది. చిన్న చిన్న పార్టీలు కూడా ఎక్కువ మొత్తంలో సీట్లు సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ అక్టోబర్ 10 న మాట్లాడుతూ.. ఎన్డీఏ విస్తృత ఏకాభిప్రాయానికి చేరుకుందని, అధికారిక త్వరలోనే జరుగుతుందని చెప్పారు. అక్టోబర్ 13 నాటికి అన్ని తెములుతాయన్నారు.
అయితే జేడీ(యూ) ఇప్పుడు 2020 అసెంబ్లీ ఎన్నికల సమయం కంటే బలహీనంగా ఉంది. చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీకి 22-26 సీట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఆయితే ఆ పార్టీ మాత్రం తమకు 35 నుంచి 40 సీట్లు కావాలని పట్టుబడుతోంది.
చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చిరాగ్ పాసవాన్ వెల్లడించారు. జీతన్ రామ్ మాంజీకి కూడా 15 సీట్ల కోసం డిమాండ్ చేస్తున్నాడు. ఆయన పార్టీకి కనీసం ఏడు నుంచి ఎనిమిది స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది.
మాంఝీ ఈ మధ్య ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ తో తన సీట్ల సంఖ్యను పెంచాలనే కోరికను పరోక్షంగా వెల్లడించాడు. ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా కూడా ఎన్డీఏ కొనసాగుతోంది.
మహ గట్ బంధన్..
సీట్ల పంపకాలలో ఎన్డీఏతో సమానంగా మహా గట్ బంధన్ కూడా ఇబ్బందులు ఎదుర్కోంటోంది. సీట్ల పంపిణీ కేవలం ఆర్జేడీ- కాంగ్రెస్ మధ్యే ఉంది. అక్టోబర్ 7 నాటి నివేదికల ప్రకారం.. మహా కూటమిలో సీట్ల పంపకం పూర్తయిందని ఆర్జేడీకి అధిక సీట్ల కేటాయింపు జరిగిందని ప్రకటన వచ్చింది. ఈ విషయం తుది నిర్ణయం వెలువడనప్పటికీ 2020 లో కాంగ్రెస్ పోటీ చేసిన 50 స్థానాలలో ఈ సారి భారీ స్థాయిలో కోతపడినట్లు తెలుస్తోంది.
వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, వీఐపీ పార్టీలు అధిక సంఖ్యలో సీట్ల కోసం పట్టుబట్టే బదులు, గెలిచే స్థానాలలో పోటీకి దిగాలని, వాటిపై దృష్టి పెట్టాలని కూడా ఆర్జేడీ సూచిస్తోంది. వీఐపీ నాయకుడు ముఖేష్ సహాని కూడా మహా ఘట్ బంధన్ లో చేరి తన స్వరం బలంగా వినిపించాడని తెలుస్తోంది.
మరికొన్ని పార్టీలు..
రెండు ప్రధాన సంకీర్ణ కూటములతో పాటు మూడో పక్షం కూడా ఇక్కడ పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వాటిలో ముందు వరుసలో ఉన్నది ఆమ్ ఆద్మీపార్టీ. తమ పాలన బీహర్ కు ప్రత్యామ్నయం అందిస్తుందని వారు చెబుతున్నారు.
‘‘మాకు వృద్ది, పాలనకు సంబంధించిన మోడల్ ఉంది. ఆప్ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది’’ అని బీహర్ ఆప్ ఇన్ చార్జ్ అజేష్ యాదవ్ మీడియాతో అన్నారు.
చాలామంది మిత్రులు సీట్ల కోసం బరిలోకి దిగడంతో కొన్ని నియోజకవర్గాలలో స్నేహపూర్వక పోటీ ఉంటుందని కూడా కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి. దీనితో వాస్తవిక అంచనాలు వెలువరించడం కూడా రాజకీయ విశ్లేషకులకు కష్టంగా మారింది.


Read More
Next Story