‘సనాతన ధర్మ రక్షా బోర్డు’ ఏర్పాటు పై ఢిల్లీ హైకోర్టులో  విచారణ..
x

‘సనాతన ధర్మ రక్షా బోర్డు’ ఏర్పాటు పై ఢిల్లీ హైకోర్టులో విచారణ..

దేశంలో సనాతన ధర్మా రక్షా బోర్డును ఏర్పాటు చేయాలని పిటిషన్ దాఖలైంది. సనాతన ధర్మం ఆచరించే వారి పై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, వెంటనే బోర్డు ఏర్పాటుకు..


దేశంలో ‘సనాతన ధర్మ రక్షా బోర్డు’ను ఏర్పాటు చేయాలని, ధర్మ రక్షకులపై, అనుచరులపై ఇతర మతాల వారు దాడులు చేస్తున్నారని అందుకు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారించడానికి కోర్టు నిరాకరించింది.

ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించింది. ఈ సమస్య ప్రభుత్వ పాలసీ డొమైన్‌లో ఉన్నందున అటువంటి బోర్డును ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. కోర్టుకు బదులుగా ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్‌ను కోరింది.
"మీరు ప్రభుత్వం వద్దకు వెళ్లాలి. మేము అలాంటి ఆదేశాలు జారీ చేయలేము. వారు (ఎంపీలు) దీనిని పార్లమెంటులో లేవనెత్తాలి. ఇందులో మేమేమీ చేయలేము. ట్రస్ట్ సృష్టించమని మేము చెప్పలేము" అని జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు.
పిటిషనర్ 'సనాతన్ హిందూ సేవా సంఘ్ ట్రస్ట్' తరఫు న్యాయవాది వాదిస్తూ, 'సనాతన్ ధర్మం'ను రక్షించడానికి బోర్డు అవసరమని సనాతన ధర్మవాదులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇతర మతాలకు కూడా ఇలాంటి బోర్డులు ఉన్నాయని, అయితే తన ప్రాతినిథ్యంపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదన్నారు.
పిటిషనర్ కోరిన ఉపశమనం మేము అందించలేదని కోర్టు పేర్కొంది. "ప్రభుత్వాన్ని ఆశ్రయించడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత రిట్ పిటిషన్ కొట్టివేస్తున్నామని" అని కోర్టు పేర్కొంది.


Read More
Next Story