తీహార్ జైలు వసతులు పరిశీలించిన బ్రిటన్ బృందం
x
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా

తీహార్ జైలు వసతులు పరిశీలించిన బ్రిటన్ బృందం

విజయ్ మాల్య, నీరవ్ మోదీని అప్పగిస్తే తీహార్ జైలులో ఖైదు చేస్తామన్న భారత్


భారత్ లో ఆర్థిక నేరాలు చేసి బ్రిటన్ కు పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి నిందితులను తిరిగి భారత్ కు రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇందులో భాగంగా యూకే కు చెందిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) బృందం ఇటీవల ఢిల్లీలోని తీహార్ జైలును సందర్శించారు.

ఈ సందర్శనకు భారత విదేశాంగ శాఖ సాయం చేసింది. నిందితులను భారత్ కు అప్పగించిన తరువాత తీహార్ జైలులోనే వారిని ఉంచుతామని న్యూఢిల్లీ, లండన్ కు తెలిపింది. ఇక్కడ వారికి సురక్షిత వాతావరణం లభిస్తుందని నిరూపించడానికి ఈ పర్యటన ఏర్పాటు చేసింది.

హమీ ఇచ్చిన న్యూఢిల్లీ..
మాల్యా, మోదీ లాంటి ఆర్థిక నేరగాళ్లను భారత్ కు అప్పగించడానికి భారత్ చేసిన విజ్ఞప్తిని బ్రిటిష్ కోర్టులు ఇంతకుముందు తిరస్కరించాయి. భారత్ లోని జైళ్లలో దుర్భర పరిస్థితులు ఉంటాయని నిందితులు వాదించడమే ఇందుకు కారణం. అయితే నిందితులను ఎవరిని కూడా జైలులో చట్టవిరుద్ధంగా విచారించబోమని భారత ప్రభుత్వం బ్రిటన్ కు హమీ ఇచ్చింది.
కొన్ని నివేదికల ప్రకారం.. సీపీఎస్ బృందం తమ పర్యటన సమయంలో తీహార్ లోని హై సెక్యూరిటీ వార్డును పరిశీలించింది. అక్కడి ఖైదీలతో మాట్లాడింది. వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీసి, సంతృప్తి చెందినట్లు సమాచారం.
జైలు అధికారులు కూడా యూకే బృందానికి జైలు ప్రాంగణం లోపల ఉన్నత స్థాయి విచారణ ఖైదీలు, దోషులను ఖైదు చేయడానికి ప్రత్యేక వసతులు ఉన్నాయని వివరించింది.
అప్పగింతలు..
జాతీయమీడియాతో మాట్లాడిన పలువురు అధికారులు జూలైలో యూకే బృందం తీహార్ జైలును సందర్శించినట్లు అంగీకరించారు. ‘‘భారత ప్రభుత్వం తరఫున సీపీఎస్ అనుసరిస్తున్న నేరస్థుల అప్పగింత కేసులకు జైలు పరిస్థితులను అంచనా వేయడానికి జూలైలో నలుగురు సభ్యుల బృందం, ఇద్దరు సీపీఎస్ నిఫుణులు, ఇద్దరు బ్రిటీష్ హైకమిషన్ అధికారులు తీహార్ జైలును సందర్శించారు.
హై సెక్యూరిటీ వార్డులతో సహ ఖైదీలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వారు సంతృప్తి చెందారు. అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా ఇక్కడ వసతులు ఉన్నాయని చెప్పారు’’ అని ఒక అధికారి జాతీయ మీడియాకు వివరించారు.
బ్రిటన్ తో సహ 20 దేశాలలో కోర్టులలో భారత్ 178 మంది నిందితులను అప్పగించమని కేసులు దాఖలు చేసింది. వీటిలో ఎక్కువ శాతం ఆర్థిక నేరాలు ఉన్నాయి.
ప్రస్తుతం యూకే కు లో తలదాచుకున్న నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను అప్పగించాలని భారత్ ఒత్తిడి చేస్తోంది. మాల్యాపై రూ. 9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసినట్లు అభియోగాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.13,800 కోట్లు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన ముద్ధాయి. వీరి కోసం భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.


Read More
Next Story