
ది ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్
బీహార్: మహాఘట్ బంధన్ ఎందుకు విఫలమైంది?
ది ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ విశ్లేషణ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) బీహార్ లో అఖండ విజయం సాధించింది.
మొత్తం 243 స్థానాలున్నా రాష్ట్రంలో ఏకంగా 202 స్థానాలు గెలుచుకుంది. ఈ అంశానికి సంబంధించి ‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’లో ది ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ మాట్లాడారు.
ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు లభించిన ఆదేశం, బీజేపీ యంత్రాంగం ద్వారా సాధించిన విజయంగా అభివర్ణించారు.
పాలన, నితీశ్ ఖ్యాతి..
బీజేపీ తొలిసారిగా దాని మిత్రపక్షాన్ని సీట్ల స్థానంలో అధిగమించింది. అయితే ఇది నితీశ్ కుమార్ ఖ్యాతి వలనే సాధించిందన్నారు. మహిళా ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించారని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
బీహార్ లో స్త్రీ, పురుష ఓటింగ్ శాతం 9 నుంచి 10 శాతం తేడా ఉందని, పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, శానిటరీ ప్యాడ్ పథకాలు, మద్యం నిషేధం వంటి ప్రకటనల కారణంగా మహిళలు ‘‘నితీశ్ కుమార్ కు ఓటు వేశారు’’ అని శ్రీని చెప్పారు. గృహ హింస, వీధి వేధింపులను అరికట్టడంలో ఇవి సహాయపడ్డాయని ఆయన అన్నారు.
రాహుల్ పార్ట్ టైమ్ రాజకీయాలు..
మహాఘట్ బంధన్ ఘోర అపజయం గురించి కూడా విశ్లేషించారు. రాహుల్ గాంధీ అస్థిరత కూటమి విజయావకాశాలను దెబ్బతీసిందని కూడా అభిప్రాయపడ్డారు. తేజస్వీ యాదవ్ తో కలిసి ప్రచారం చేస్తున్న సమయంలో రాహుల్ 40 రోజులు విదేశీ పర్యటన చేయడం కూడా కూటమిని ప్రభావితం చేసిందని అన్నారు.
మరోవైపు టికెట్ల పంపిణీ, అంతర్గత కలహాలు, కూటమికి హనీ కలిగించింది. సంస్థాగత సమస్యలు, ఎన్నికల లాభాలు స్వీకరించకుండా చేసిందన్నారు.
ఏఐఎంఐఎం వల్లే..
ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలలో బీజేపీ విజయం సాధించడానికి ఎంఐఎం కారణమని అన్నారు. ఆ పార్టీ మెజారిటీ ఓట్లను చీల్చిందని, దాని కారణంగానే మహాఘట్ బంధన్ కు దెబ్బపడిందన్నారు.
భవిష్యత్ లో వివాదాస్పద ఎస్ఐఆర్(సర్) ప్రక్రియను అమలు చేయడంలో కేంద్రం, ఈసీకి బలం చేకూరిందని, రాబోయే రాష్ట్రాలలో చాలా దూకుడుగా అమలు చేస్తుందని శ్రీనివాసన్ అన్నారు.
ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ విషయాన్ని పరిశీలిస్తే దానికి తక్కువ ఓటింగ్ శాతం సాధించినప్పటికీ భవిష్యత్ లో కచ్చితంగా రాజకీయంగా రాణిస్తారని అంచనా వేశారు.
Next Story

