బీహార్: వంతెనలన్నీ పేకమేడల్లా కూలిపోవడానికి కారణమేంటీ?
x

బీహార్: వంతెనలన్నీ పేకమేడల్లా కూలిపోవడానికి కారణమేంటీ?

బిహార్ లోని దాదాపు 73 శాతం ప్రాంతం వరద ప్రభావిత ఏరియానే. ఈ వర్షకాలంలో వంతెనలన్నీ కుప్పకూలుతుంటే వరదల వల్ల ప్రజలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.


బీహార్‌లో కేవలం పక్షం రోజుల్లోనే 10 వంతెనలు కూలిపోయాయి , ఇది నితీష్ కుమార్ ప్రభుత్వానికి తీవ్రమైన సవాళ్లను విసిరింది. నాణ్యతల విషయలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ కాంట్రాక్టర్ల బంధాన్ని ఇది బహిర్గతం చేసింది.

బీహార్‌లో గత 19 ఏళ్లుగా రోడ్లు, వంతెనలు, కల్వర్టుల భారీ నెట్‌వర్క్‌ను నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కే దక్కుతుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు కేవలం ఆరు గంటల్లో పాట్నాకు చేరుకునేంత భారీ స్థాయిలో రోడ్లు, వంతెనలు నిర్మించానని ఆయన చెప్పుకునేవారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇది తన ఘనతగా ఆయన ప్రచారం చేసుకునేవారు. ఇదే స్థాయిలో ఓట్లను కూడా పొందారు.
అథ: పాతాళంలోకి..
వంతెనలు శిథిలావస్థకు చేరుకోవడం అతని ఇమేజ్‌ను భారీగా తగ్గించింది. వంతెనలు కూలిపోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణకు నితీశ్ ఆదేశించారు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. అధికారుల, కాంట్రాక్టర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ అనేక మంది ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్ల సంబంధాలపై అనేక విషయాలు ప్రచారంలోకి వచ్చాయి.
బీహార్‌లో, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, ముఖ్య మంత్రి సంపర్క్ యోజన, హైవే ప్రాజెక్టుల కింద వచ్చే ప్రాజెక్టులపై ఆధారపడి, గ్రామీణ పనుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్డు నిర్మాణ విభాగం, బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్‌తో సహా వివిధ శాఖలు వంతెనలను నిర్మిస్తాయి. దీనికి కేంద్రం నిధులు అందజేస్తుంది. అందువల్ల ఇదీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఏకకాలంలో ప్రశ్నలు లేవనెత్తింది.
ఇలాంటివి కొత్తగా జరగలేదు
అయితే ఇలా వంతెన కూలిపోవడం బీహార్‌కు కొత్తేమీ కాదు. గత సంవత్సరాల రికార్డులు పరిశీలిస్తే పెద్దవి, చిన్నవి అనే తేడా లేకుండా అనేక వంతెనలు కూలిపోయాయి. 2023లో తొమ్మిది వంతెనలు మునిగిపోగా, 2022లో ఆ సంఖ్య ఎనిమిదిగా ఉంది. ఇది కేవలం వంతెనలకు మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రంలో రోడ్లు, హైవే స్ట్రెచ్‌లు కొట్టుకుపోవడం వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.
సరన్ జిల్లాలో కేవలం 36 గంటల వ్యవధిలో మూడు వంతెనలు కూలిపోవడం ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెట్టింది. గండకి నదీ మీదుగా ఉన్న 15 ఏళ్ల నాటి వంతెన గురువారం ఉదయం కూలిపోయింది. ఒక రోజు ముందు, అదే జిల్లాలోని జంతా బజార్, లహ్లాద్‌పూర్ వద్ద మరో రెండు వంతెనలు కూలిపోయాయి. ఈ వంతెనలలో కొన్ని, సరన్‌లోని వంతెన బ్రిటిష్ కాలం నాటిది కాగా, మరొకటి 30 సంవత్సరాల కింద నిర్మించారు.
ఇటీవలి కాలంలో..
జూన్ 18న ఆరారియా జిల్లాలో మధుబని, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్‌లలో వరసగా వంతెనలు కూలిపోవడం ప్రారంభం అయ్యాయి. ఇలా ఏడు వంతెనలకు జరిగాయి.
ఈ ఏడాది మార్చిలో, సుపాల్ జిల్లాలో కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన గర్డర్ కూలిపోవడంతో ఒక కార్మికుడు మరణించాడు. 10 మంది గాయపడ్డారు. కేంద్రం, భారతమాల ప్రాజెక్టు కింద రూ.1700 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. 2014లో నితీష్‌ పునాది వేసిన ఈ వంతెన పూర్తయితే అస్సాంలోని భూపేన్ హజారికా వంతెన కంటే పెద్దదిగా ఉంటుంది. బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల పాత, కొత్త ఇతర వంతెనల నిర్మాణ సమగ్రత గురించి ఆందోళనలు తలెత్తాయి.
కారణాలు..
వంతెనలు కూలిపోవడానికి కారణం ఏంటనే విషయంలో ప్రభుత్వానికి ఓ స్పష్టత ఉంది. ప్రధానంగా అధికారులు- కాంట్రాక్టర్లు నాణ్యత విషయంలో రాజీపడటంతో ఇలా జరుగుతోందని గుర్తించారు. అయితే ఎవరూ కూడా ఈ నిందను మోయడానికి సిద్ధంగా లేరు.
వచ్చే ఏడాది బిహార్ లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సంగ్రామంలో మైలేజ్ సాధించడానికి వేగంగా మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నారు. ఇదే అదనుగా నిర్మాణంలో సరైన తనిఖీలు, భద్రతా పర్యవేక్షణ లేకుండా పనులు కొనసాగిస్తున్నారు. ఇది లోపభూయిష్టంగా పనులు జరగడానికి కారణమైంది.
సరన్‌లో వంతెనలు కూలిపోవడానికి కచ్చితమైన కారణం తెలియదు, అయితే అధికారులు ప్రాథమికంగా దీనిని ఇటీవల డీ-సిల్టేషన్ పని, ఆ తర్వాత భారీ వర్షపాతం కారణంగా స్తంభాల పునాది కోతకు కారణమైందని, దానివల్ల వంతెన కూలిపోయిందని పేర్కొన్నారు.
"ఈ నిర్మాణాలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం నిర్మించబడినట్లు కనిపించడం లేదు. పునాదులు కూలిపోవడానికి దారితీసేంత లోతుగా లేవు" అని గ్రామీణ పనుల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి చైతన్య ప్రసాద్ అన్నారు.
నాణ్యత లేమి..
బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరడానికి నాణ్యత లేని పదార్థాల వినియోగం, సిమెంట్, ఇసుక, రాతి నిర్దేశిత నిష్పత్తిలో ఉపయోగించకపోవడమే కారణమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. "నిబంధనల ప్రకారం ఇది 1:1.5:1 నిష్పత్తిలో ఉండాలి" అని రిటైర్డ్ ఇంజనీర్ టుంటున్ ఝా అన్నారు, అయితే ఈ సూత్రాన్ని తరచుగా ఉల్లంఘిస్తున్నారు.
కొన్ని రాజకీయ కారణాలు కూడా వంతెనలు కూలడానికి కారణంగా చెప్పవచ్చు. ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థ మే 10, 2019న ఒకే రోజు రూ. 75 లక్షల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. కంపెనీ భాగల్‌పూర్-ఖగారియా వంతెనను నిర్మించింది. వంతెన భాగాలు 2023లో రెండుసార్లు కూలిపోయాయి.
పాలసీ లోపాల కారణం కూడా వంతెనలు కూలిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. వంతెనలను మెయిన్ టెన్స్ చేసిన రికార్డు జలవనరుల శాఖ, రూరల్ వర్క్స్ డిపార్ట్ మెంట్ వద్ద లేదు.
అధికారిక రికార్డుల ప్రకారం, బీహార్‌లో 1.5 లక్షల కిలోమీటర్ల రహదారి, 30,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్‌వర్క్, వేలాది చిన్న వంతెనలు, కల్వర్టులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో మెయింటెనెన్స్ పాలసీ లేదు. ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మార్గదర్శకాలకు కట్టుబడి అయినా, వాటి నిర్వహణ జరగట్లేదని తేలింది.
పిల్ దాఖలు
రాష్ట్రంలో ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న, అలాగే నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలపై స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించేలా బీహార్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలైంది. వంతెనలతో సహా నిర్మాణ పనుల నిజ-సమయ పర్యవేక్షణను నిర్ధారించడానికి ఇది మార్గదర్శకాలు, విధానాలను రూపొందించాలని కూడా కోరుతుంది.
బీహార్‌లో వరద ప్రభావిత ప్రాంతం మొత్తం 68,800 చదరపు కిలోమీటర్లు, ఇది రాష్ట్ర మొత్తం భౌగోళిక ప్రాంతంలో దాదాపు 73 శాతం అని పిటిషన్ పేర్కొంది. "అందువల్ల, పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి" అని పిటిషన్ దారులు ఆందోళన వ్యక్తం చేశారు.
సర్వేకు నితీశ్‌ ఆదేశాలు
పాత వంతెనలన్నింటిని సవివరంగా సర్వే చేయాలని నితీశ్ ఆదేశించారు. తక్షణ మరమ్మతులు, నిర్వహణ పనులు అవసరమయ్యే వంతెనలను గుర్తించాలని గ్రామీణ పనుల శాఖ, రోడ్డు నిర్మాణ విభాగాన్ని ఆదేశించారు.
నేపాల్‌లోని పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉత్తర బీహార్‌లోని నదుల నీటిమట్టాలను పర్యవేక్షించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆప్టిక్స్ మేనేజ్‌మెంట్‌ను దాటి వెళ్లకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు దుర్భరంగా మారే అవకాశం ఉంది.
Read More
Next Story