విపక్ష ‘ఘట్ బంధం’ బలహీనంగా మారిందా?
x

విపక్ష ‘ఘట్ బంధం’ బలహీనంగా మారిందా?

ఇప్పటికీ తేలని సీట్ల పంచాయతీ, చాలా స్థానాలో నామినేషన్ దాఖలు చేసిన పార్టీలు


నీలు వ్యాస్

బీహార్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ అధికార ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్ష మహాఘట్ బంధం మధ్యే ప్రధాన పోటీ. అన్ని పార్టీలు రెండు కూటములుగా తలపడుతున్నాయి. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రమే ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి.


మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేసే గడువు ముగిసింది. అయినప్పటికి విపక్ష ‘మహాఘట్ బంధన్’ లో ఇప్పటిదాకా సీట్ల పంపకాలు కొలిక్కి రాలేదు. చాలా సీట్లలో స్నేహపూర్వక పోటీ తప్పడం లేదు.
ఈ అంశంపై ‘ది ఫెడరల్’ నిర్వహించిన ‘క్యాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్ లో ప్యానెలిస్ట్ లు అశోక్ మిశ్రా, ఫైజాన్ అహ్మాద్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కూటమిలో చాలా గందరగోళం నెలకొని ఉన్నది. నామినేషన్ల ఉప సంహరణ ముందు వరకూ కూటమి నేతల మధ్యే ప్రధాన పోటీ అవకాశం ఉందని ఇద్దరు విశ్లేషకులు అంచనాకు వచ్చారు.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఇందులో మొదటి దశలో 121 సీట్లకు నామినేషన్లు దాఖలు చేశారు. రెండో దశలో మిగిలిన 122 సీట్ల పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
మహాఘట్ బంధన్ లో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎం), సీపీఐ, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ లు ఉన్నాయి. వీటి మధ్య ఇంకా డజన్ కు పైగా సీట్ల చర్చలు కొనసాగుతున్నాయి. వీటిని ప్యానెల్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
‘‘మహాఘట్ బంధన్ కూటమి 243 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో విఫలం అయింది’’ అని విశ్లేషకుడు ఫైజాన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి పార్టీకి, కార్యకర్తలు, ఓటర్లను కూడా గందరగోళానికి గురి చేస్తుందని అభిప్రాయపడ్డారు.
స్నేహపూర్వక పోటీలే..
వైశాలి, లాల్ గంజ్ రెండు స్థానాలలో కాంగ్రెస్, ఆర్జేడీ తమ తమ అభ్యర్థులను ప్రకటించాయని ప్యానెల్ వివరించింది. కాంగ్రెస్ జాబితాలో 48 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ రెండింటి మధ్య కహల్గావ్, ప్రాన్ పూర్, జాలే, చాన్ పూర్, గయా టౌన్ స్థానాలపై కూడా పీటముడి ఉంది. కహల్గావ్ పై ఆర్జేడీ నిరంతరం వివాదం సృష్టిస్తోంది.
‘‘మహాఘట్ బంధన్ లోని పార్టీలు కనీసం పది స్థానాలలో తమ అభ్యర్థులను ప్రకటించాయి. పోటీ అంటే పోటీనే.. మళ్లీ స్నేహపూర్వకం ఏంటీ?’’ అని ఫైజాన్ అహ్మాద్ అన్నారు.
స్నేహపూర్వక పోటీ అనే పదం తప్పుదారి పట్టించేదిగా ఆయన అభిప్రాయపడ్డారు. అనేక స్థానాలపై చర్చలు కొనసాగుతూనే ఉండటం, ఆలస్య ప్రకటనల వల్ల ఏర్పడిన గందరగోళాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘ప్రజలు మహాఘట్ బంధన్ అభ్యర్థి ఎవరని అయోమయంలో ఉన్నారు’’ అని చెప్పారు.
ముందు వరుసలో ఎన్డీఏ.. జాప్యం చేసే పనిలో కూటమి
మహాఘట్ బంధన్ తో పోలీస్తే ఎన్డీఏ తన కూటమిలో పొత్తు, సీట్ల సర్ధుబాటును త్వరగా కుదర్చుకుందని అశోక్ మిశ్రా పేర్కొన్నారు. ప్రారంభంలో కాస్త గందరగోళం, మనస్పర్థలు ఉన్నప్పటికి వాటిని పూర్తిగా పరిష్కరించి, ప్రచారం పై దృష్టి పెట్టిందని అన్నారు.
నామినేషన్ వేసిన వారిని గుర్తించి, ఉపసంహరించుకోవడానికి ఎన్డీఏ తగిన సమయం దొరికింది. లేకుంటే పార్టీల మధ్య అంతర్గత పోటీ జరిగి అది విజయాకాశాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
రెండో దశ నామినేషన్లకు సమయం తక్కువగా ఉన్నప్పటి కూడా మహాఘట్ బంధన్ లో ఇంకా అనిశ్చితి ఉందని ప్యానెలిస్ట్ లు హైలైట్ చేశారు. ఇది ప్రచారానికి తగినంత సమయం కేటాయించకపోవడానికి దారితీస్తుందని అన్నారు.
తాత్కాలిక సీట్ల కేటాయింపుపై అవగాహాన
సీట్ల కేటాయింపు పై మహాఘట్ బంధన్ లో తాత్కాలిక అవగాహాన ఉందని అశోక్ మిశ్రా ఒక ఉదాహారణ చెప్పారు. ఆర్జేడీకి 135 సీట్లు, కాంగ్రెస్ 60-61 సీట్లు, సీపీఐ(ఎంఎల్)-18-19 సీట్లు, సీపీఐ 6, సీపీఐ(ఎం) 4 సర్ధుబాటు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
అనేక దశల చర్చల తరువాత వీఐపీ పార్టీ 15 సీట్లు సాధించిందని ఆయన గుర్తు చేశారు. సీట్ల సంఖ్య, అభ్యర్థులు ఎవరనే దానిపై మొదటి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉంది. నేటీకి అది పరిష్కారానికి నోచుకోలేదు.
పార్టీల వారీగా చూస్తే ఒక్కొ స్థానానికి అనేక మంది అభ్యర్థులు ఉన్నారని మిశ్రా చెప్పారు. జాతీయ స్థాయి సమీకరణల ద్వారా కాంగ్రెస్ పార్టీ తన సీట్ల సంఖ్యను పెంచుకుందని అనలిస్టులు చెప్పారు.
వీఐపీ పార్టీకి ప్రాధాన్యం..
కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీఐపీ కూడా తమ సీట్ల సంఖ్యను పెంచుకున్నాయని చెప్పారు. సీఈసీ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ముందు వరుసలో ఉండి, ఇవి కాలక్రమంలో సీట్ల సంఖ్య పెరగడానికి కారణమైంది.
‘‘నాయకులు కలిసి కూర్చుని విభేదాలను పరిష్కరించుకోవాలి. కానీ వారు ఆ పని చేయట్లేదు. ఈ గందరగోళం నేటీకి కనిపిస్తోంది’’ అని మిశ్రా వివరించారు. షెడ్యూల్ లోపాలు, కీలక నాయకులు దూరంగా ఉండటం, నామినేషన్ వేయడం, ఉపసంహరణ వంటివి కూడా ముంచుకు వచ్చాయి.
ఆర్జేడీదే బాధ్యత..
ఈ లోపాలకు కూటమిలోని అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీ బాధ్యత వహించాలని ఫైజాన్ అహ్మాద్ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రారంభంలో జోక్యం, తరువాత తేజస్వీ యాదవ్ పట్టును ఆయన ప్రస్తావించారు.
‘‘సీట్ల పంపకాలు ఖరారు కావడానికి ముందే బీ ఫామ్ లను పంపిణీ చేశారు. ఆ తరువాత అభ్యర్థులను నామినేషన్ వేయద్దని ఆర్జేడీ కోరింది. ఇది గందరగోళానికి పరాకాష్ట’’ అని ఫైజాన్ అహ్మాద్ అన్నారు.
అలంనగర్ లో ఒక అరుదైన సంఘటనను ఆయన హైలైట్ చేశారు. ఇక్కడ నవీన్ కుమార్ అనే అభ్యర్థి ఆర్జేడీ, వీఐపీ లపై నామినేషన్ దాఖలు చేశారు. ఇది కూటమిలో జరుగుతున్న పరిణామాలకు ఉదాహారణ.
ఓటర్ల అవగాహాన..
అస్పష్టమైన అభ్యర్థుల జాబితాను ఎదుర్కొంటున్న నియోజక వర్గాల ప్రజల స్థితిని కూడా ప్యానెల్ చర్చించింది. పార్టీల ఆలస్యం ఓటర్లకు తప్పుడు సందేశం పంపుతాయని ఫైజాన్ అహ్మాద్ పేర్కొన్నారు.
పార్టీల మద్దతుదారులు ఎవరికి మద్దతు ఇవ్వాలో అయోమయంలో ఉన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరిణామాలు మహాఘట్ బంధన్ పొందిన ప్రయోజనం మసకబారిందని అశోక్ మిశ్రా చెప్పారు. ‘‘కూటమి ప్రజల వద్దకు వెళ్లడం ఆలస్యంగా ప్రారంభం అయింది’’ అని ఆయన చెప్పారు.
గడువులను పోల్చడం..
జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా, చిరాగ్ పాసవాన్ మధ్య కూడా ఎన్డీఏ తొలి దశలో విభేదాలు తలెత్తాయని అంగీకరిస్తూనే.. వారు తరువాత ఏకాభిప్రాయానికి వచ్చి తమ సీట్లకు అభ్యర్థులు ప్రకటించారని అశోక్ మిశ్రా పేర్కొన్నారు. ఇది ప్రత్యర్థులను విధానపరంగా ముందుకు జరిపింది.
మహాఘట్ బంధన్ లోని పార్టీల మధ్య పోరాటాలను నివారించడానికి 20 వ తేదీ, రెండో దశ 24 తేదీలు నిర్ణయాత్మకమైనవని పునరుద్ఘాటించారు. ‘‘ఉప సంహరణ చివరి తేదీ నాటికి వారు విభేదాలు పరిష్కరించుకుని ఏ స్థానంలోనూ వారి మధ్య పోటీ లేకపోతే పర్వాలేదు . లేకపోతే కూటమి గత మూడు నెలల లాభాలను కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని అశోక్ మిశ్రా అన్నారు.
ఓట్లు చీలిపోకుండా ఉండటానికి ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి ఉండాలి. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా 243 మంది అభ్యర్థులతో కూడిన సమగ్ర జాబితాను రూపొందించడంలో క్రమశిక్షణ అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ గందరగోళం ఇప్పటికే ఓటర్లకు సమస్యలు సృష్టించిందని ఫైజాన్ అహ్మాద్ చెప్పారు. ఉపసంహరణ నాటిని కనీసం పరిష్కారం కనుగోనాలని సూచించారు. ‘‘నాయకులు విభేధాలు పరిష్కరించుకోవకపోవడమే ప్రస్తుత వైఫల్యానికి కారణం’’ అని మిశ్రా ముగించారు. క్షేత్ర స్థాయిలో కూటమి స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇదే ఏకైక దారని చెప్పారు.


Read More
Next Story