బీహార్: మూడో జాబితా విడుదల చేసిన బీజేపీ
x

బీహార్: మూడో జాబితా విడుదల చేసిన బీజేపీ

101 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమల దళం


బీహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత కూటమిలో చకచకా పొత్తులను కుదుర్చుకున్న బీజేపీ తనకు లభించిన 101 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

చివరి విడతగా 18 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను పార్టీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అంతకుముందు రోజు రెండో జాబితాను ప్రకటించింది.

ఇందులో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ప్రముఖ గాయకురాలు మైథిలీ ఠాకూర్ అలీనగర్ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, బక్సార్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాను పోటీకి దింపింది.

ఎన్నికల కోసం 71 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వరుసగా తారాపూర్, లఖిసరాయ్ స్థానాల నుంచి ఆరుగురు రాష్ట్ర మంత్రులను పోటీకి నిలిపారు.
మూడో జాబితా ప్రకారం.. బీనా దేవి కొచ్చధమన్ స్థానం, సంగీతా కుమారి షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన మోహానియా నుంచి పోటీ చేస్తున్నారు.
ఆ పార్టీ నర్కటియాగంజ్ స్థానం నుంచి సంజయ్ పాండేను, రాఘెపూర్ నుంచి సతీశ్ కుమార్ యాదవ్, భబువా నుంచి భరత్ బింద్ ను పోటీకి దింపింది. మూడో జాబితా నుంచి.. మురారీ పాశ్వాన్ ఎస్పీ సీటు అయిన పిర్పైంటీ నుంచి పోటీ చేయగా, అశోక్ కుమార్ సింగ్ రామ్ గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
మూడో జాబితా ప్రకటనతో బీజేపీ ఎన్డీఏలో తన వాటాలోని 101 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాలలో పోటీ చేస్తాయని, కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్ జన శక్తి పార్టీ 29 స్థానాలలో తమ అభ్యర్థులను నిలబెట్టనుందని బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్ ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ప్రకటించారు.
ప్రతిపక్ష మహాఘట్ బంధన్ లో ప్రధాన పార్టీ లైన ఆర్జేడీ, కాంగ్రెస్, మిగిలిన పార్టీల మధ్య పొత్తులు కుదరనప్పటికీ వారు ఇప్పటికే ఒంటరిగా తాము పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించుకుంటున్నారు.
ఆర్జేడీ నేత ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ రాఘెపూర్ స్థానం నుంచి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా డజన్ కు పైగా స్థానాలను తమ అభ్యర్థులను ప్రకటించింది. బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబ సభ్యులు పోటీ చేయబోయే స్థానాల జాబితాను విడుదల చేసింది.
243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14 న జరగనుంది.
Read More
Next Story