కాశ్మీర్ లో చిన్న పార్టీలన్నీ ఓట్లను చీల్చి.. కమలదళానికి ?
జమ్మూకాశ్మీర్ లో చిన్న పార్టీలన్నీ కూడా ఎన్డీఏ చేర్పించడానికి బీజేపీ తెరవెనక ప్రయత్నాలు చేస్తోంది. లేదంటే ఒంటరిగా పోటీ చేయించడానికి ప్రయత్నిస్తుందా అనే అనుమనం..
దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. పార్టీలన్నీ దాదాపుగా పొత్తుల్ల చర్చల్లోకి దిగి సంపూర్ణంగా ముగించాయనే చెప్పుకోవాలి. అయితే కాశ్మీర్ లో ఉన్న రెండు ప్రధాన పార్టీలు ఇండి కూటమిలోనే దిగాయి. మిగిలిన కొన్ని పార్టీలు కూడా సొంతంగా పోటీ చేయడానికి అంతగా ఆసక్తి చూపట్లేదు. ఇదే అదనుగా ఎన్డీఏ లో చేర్పించడానికి రెండు వైపులా ప్రయత్నాలు తెరవెనక జోరుగా సాగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సజాద్ ఘనీ లోన్ నేతృత్వంలోని J&K పీపుల్స్ కాన్ఫరెన్స్ (JKPC), అల్తాఫ్ బుఖారీ నేతృత్వంలోని J&K అప్నీ పార్టీ (JKAP)ని లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ గూటికి చేరేలా బీజేపీ చేర్పించడంపై గత వారం రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల మొదటి ఐదు దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. అవసరమైన బలగాలను మోహరించింది.
బీజేపీకి బీ, సీ టీమ్‌లా?
ఏప్రిల్ 6న బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బుఖారీ, లోన్ లను శ్రీనగర్ లో కలిశారు. పార్లమెంటరీ ఎన్నికల్లో వారు పొత్తు పెట్టుకోవచ్చని ఊహగానాలు చెలరేగుతున్నాయి.
అయితే వీటిని బుఖారి కొట్టిపారేశారు. “ఇందులో రాజకీయంగా ఏమీ మాట్లాడుకోలేదు. నేను అనారోగ్యంతో ఉన్నాను. అందుకే నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఇది మర్యాదపూర్వక భేటీ, ఎలాంటి రాజకీయాలు చర్చించలేదు. సాజాద్ సాహిబ్ నన్ను సందర్శిస్తూనే ఉన్నారు. మాకు కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ”
అయినప్పటికీ, ఒక కీలకమైన JKAP నాయకుడు ది ఫెడరల్‌తో ఇలా చెప్పారు. “రాజకీయ నాయకులు ఒకరినొకరు ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటారు. వారు ఎప్పుడు తలుపులను తెరిచే ఉంచుతారు”
బుఖారీ, లోన్, గులాం నబీ ఆజాద్‌తో పాటు, వారి అంతగా తెలియని రాజకీయ సమూహాలను BJP.. B, C టీమ్‌లుగా నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)ని స్థాపించడానికి ఆజాద్ ఆగస్టు 2022లో తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు.
ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (NC), మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) తరచుగా బుఖారీ, లోన్, ఆజాద్ వంటి వారి నేతృత్వంలోని చిన్న సమూహాలకు మద్దతు ఇవ్వడం ద్వారా కాశ్మీర్‌లో బిజెపి ఓట్లను చీల్చిందని ఆరోపించారు.
'ఎవరు మాట్లాడుతున్నారో ..'
అయితే ముగ్గురు నాయకులు దీనిని ఖండించారు. గతంలో కాషాయదళంతో పీడీపీ, నేషనల్ కాన్పరెన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేశాయని కాశ్మీర్ లో ఏర్పాటు అయిన కొత్త పార్టీలు వారిపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
మార్చి 2015 నుంచి జూన్ 2018 వరకు, J&K సంకీర్ణ ప్రభుత్వంలో PDP -BJPతో భాగస్వామిగా ఉంది. ముఫ్తీ మహ్మద్ సయీద్ సంకీర్ణానికి నాయకత్వం వహించారు. అతని మరణానంతరం, 2016లో మెహబూబా ముఫ్తీ దీని అధినేత అయ్యారు.
అదేవిధంగా, నేషనల్ కాన్పరెన్స్ కూడా ఒమర్ అబ్దుల్లా జూలై 2001 నుంచి డిసెంబర్ 2002 వరకు కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
రాజకీయ నిపుణుడు ప్రొఫెసర్ నూర్ బాబా ప్రకారం.. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే కొత్త పార్టీలు సాంప్రదాయ ప్రాంతీయ పార్టీల (NC, PDP) ఓట్లను ఛిన్నాభిన్నం చేసే అవకాశం ఉంది. అందువల్ల బిజెపికి అనుకూలంగా ఉంటుంది.
కొత్త పార్టీల పరిస్థితి
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తి, రాష్ట్ర హోదాను కోల్పోయిన 2019 ఆగస్టు 5 తర్వాత బుఖారీ JKAP, ఆజాద్ DPAP పార్టీలు ఏర్పాటు అయ్యాయి.
ప్రస్తుతం సజాద్ లోన్ నేతృత్వంలోని JKPC 1970ల చివరలో అతని తండ్రి అబ్దుల్ గని లోన్ మొదట స్థాపించారు. ప్రముఖ షియా నాయకుడు మౌల్వీ ఇఫ్తికర్ అన్సారీ (ఇద్దరూ మరణించారు) సాజాద్ లోన్ 2000 ప్రారంభంలో అతని తండ్రి హత్య తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టారు.
పార్లమెంటరీ ఎన్నికల విషయానికొస్తే, ఈ పార్టీలు NC, PDP పై గణనీయమైన ప్రభావం చూపవు. జేకేపీసీ పెద్ద కూటమిలో ప్రవేశించినట్లయితే అనంతనాగ్, రాజౌరీ, సెంట్రల్ కాశ్మీర్ లోని శ్రీనగర్, ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లాలో ఓట్ల విభజన ఉంటుంది.
ఇది బీజేపీకి ప్రధాన ప్రయోజనం..
అనంత్‌నాగ్-రాజౌరీలో జరిగినట్లుగా ఈ ముగ్గురూ కలిసి తమ సొంత అభ్యర్థులను ఒకరిపై మరొకరు పోటీకి దింపకపోతేనే ముప్పు పొంచి ఉంటుంది. ప్రస్తుతానికి, JKAP- DPAP వరుసగా జాఫర్ మన్హాస్, ఆజాద్‌లను అనంతనాగ్-రాజౌరీ స్థానంలో నిలబెట్టాయి. NC ఇక్కడ మియాన్ అల్తాఫ్ పేరును ఖరారు చేసింది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు.
గతంలో, బుఖారీ శ్రీనగర్ నుంచి పీడీపీ తరఫున గెలుపొందారు. లోన్ పార్టీకి ఉత్తర కాశ్మీర్ ప్రాంతాలైన హంద్వారా, కుప్వారాలో కొంత ప్రాబల్యం ఉంది. ఆజాద్ చినాబ్ లోయలోని దోడా జిల్లాకు చెందినవాడు, అక్కడ అతనికి మద్దతు ఉంది.
ఛార్జ్, కౌంటర్
NC అధికార ప్రతినిధి ఇమ్రాన్ నబీ దార్ మాట్లాడుతూ.. బుఖారీ, లోన్‌లతో బిజెపి నాయకుడు చుగ్ తో సమావేశం అవడం వాళ్ల మధ్య కుదిరిన పొత్తును సూచిస్తుంది.
JKPC, JKAP మధ్య పొత్తు రహస్యం కాదని NC అధికార ప్రతినిధి తన్వీర్ సాదిక్ ది ఫెడరల్‌తో అన్నారు. “అది రహస్యం ఎలా అవుతుంది? అయినప్పటికీ, మాకు గట్టిపోటీని ఇవ్వడానికి న్యూ ఢిల్లీ జోక్యం, ఆశీర్వాదాలు అవసరమని వారు గ్రహించడం మాకు మంచిది” అని సాదిక్ అన్నారు. “లోన్, బుఖారీ ఇద్దరినీ తరచుగా ఢిల్లీకి పిలుస్తుంటారు. ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితిని చూసి తర్వాత ఒకే వేదికపైకి రావాలని వారికి సూచించారు.” అని తన్వీర్ అన్నారు.
అయితే ఈ ఆరోపణలను JKPC అధికార ప్రతినిధి అద్నాన్ అష్రఫ్ మీర్ తోసిపుచ్చారు. JKPC, JKAP, DPAP మధ్య పొత్తు చర్చల గురించి NC ఆరోపణలు అర్థరహితం. అవన్నీ ఊహగానాలే.
"కొత్త కుట్ర సిద్ధాంతాలను రూపొందించడంలో వారు సి-గ్రేడ్ బాలీవుడ్ రచయితలతో పోటీ పడుతున్నారు. బీజేపీతో పొత్తుకు ఆస్కారం లేదని మా పార్టీ పునరుద్ఘాటిస్తోంది. అదంతా వారి ఊహకు సంబంధించిన కల్పితం,” అని అద్నాన్ మీర్ ది ఫెడరల్‌తో అన్నారు.
ఒంటరి రాజకీయాలు
సజాద్ లోన్ ఒక దశాబ్దం క్రితం సమైక్యవాద శిబిరంలో తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి కాశ్మీర్‌లో BJP 'పోస్టర్ బాయ్'గా ముద్రపడ్డాడు, ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్‌లో అతని దివంగత తండ్రి అబ్దుల్ గనీ లోన్ ప్రతిపాదిస్తున్న సిద్ధాంతానికి వీడ్కోలు పలికాడు.
లోన్ గతంలోను బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. నవంబర్ 2018లో, PDP నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి BJP తన మద్దతును ఉపసంహరించుకున్న సుమారు ఐదు నెలల తర్వాత, లోన్ అప్పటి J&K గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో మాట్లాడుతూ, J&K అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది శాసనసభ్యుల మద్దతు తనకు ఉందని చెప్పారు.
బీజేపీతో పాటు మరో 18 మంది శాసనసభ్యుల మద్దతు తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. లోన్ తన వాదనను నిరూపించుకోనివ్వకుండా మాలిక్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశాడు, కాబట్టి ఆ తర్వాత బీజేపీతో చేసుకున్న ఒప్పందం ఫలించలేదు.
PDP వర్సెస్ NC
జేకేపీసీ చైర్‌పర్సన్ సజాద్ లోన్ ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి పోటీ చేయనున్నారు. JKAP ఇంకా అక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు.
ఇంతలో, PDP కశ్మీర్ లోయలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు తన నామినీలను ప్రకటించింది: మెహబూబా ముఫ్తీ, వహీద్ పర్రా, ఫయాజ్ మీర్ వరుసగా అనంతనాగ్-రాజౌరీ, శ్రీనగర్, బారాముల్లా నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరి పోరులో కాశ్మీర్ హక్కులన్నీ పక్కకు తొలగిపోయాయి.
Next Story