హర్యానాలోని నుహ్ లో అదనపు భద్రతా చర్యలు
x

హర్యానాలోని నుహ్ లో అదనపు భద్రతా చర్యలు

నేడు బ్రజ్ మండల్ జలాభిషేకం యాత్ర, నుహ్ లో మెజారిటీగా ముస్లింలు


బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్రకు ముందు సోమవారం నుహ్ జిల్లా అంతటా హర్యానా ప్రభుత్వం భద్రతా చర్యలను తీసుకుంది. శాంతిభద్రతల సమస్యల కారణంగా జూలై 13 రాత్రి 9 గంటల నుంచి 24 గంటల పాటు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేయడం , సోమవారం పాఠశాలలను మూసివేయడం వంటివి ఉన్నాయి.

రాజకీయ అశాంతి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి డిజిటల్ ప్లాట్ ఫారమ్ లను దుర్వినియోగం చేయడం వంటి భయాలను ఉదహారణంగా చూపి ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.
పరిమితులకు కారణం..
2023 లో యాత్ర సందర్భంగా జిల్లాలో జరిగిన సంఘటనల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై ఒక గుంపు దాడి చేయగా హింస చెలరేగింది. ఈ హింసలో ఐదుగురు మరణించారు. వారిలో ఇద్దరు హోమ్ గార్డులు కూడా ఉన్నారు. ఆ సంవత్సరం నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 200 మంది గాయపడ్డారు.
ఆ సంవత్సరం జరిగిన అనేక దహన సంఘటనల తరువాత గురుగ్రామ్ మసీద్ లోని ఒక నాయిబ్ ఇమామ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
హోంశాఖ ఆదేశాలు..
టెలికమ్యూనికేషన్స్ చట్టంలోని 2023 లోని సెక్షన్ 20 టెలికమ్యూనికేషన్స్ (సేవల తాత్కాలిక సస్పెన్షన్) రూల్స్ 2024 లోని రూల్ 3 ప్రకారం హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో బల్క్ ఎస్ఎంఎస్ సేవలు సహ ఇంటర్నేట్, మొబైల్ డేటా సేవలు సోమవారం రాత్రి 9 గంటల వరకు నిలిపివేయబడతాయని పేర్కొంది.
సోషల్ మీడియా ద్వారా హింస లేదా ప్రయివేట్ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే పుకార్లు, రెచ్చగొట్టే వార్తలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని నుహ్ డిప్యూటీ కమిషనర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఆయన ఆదేశం ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
‘‘ప్రజాశాంతిని కాపాడటానికి, శాంతి భద్రతలకు భంగం జరగకుండా నిరోధించడానికి ఈ ఆర్డర్ ముందు జాగ్రత్త చర్య’’ ని హోంశాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. అవసరమైన సేవలను మినహయించడం ద్వారా భద్రతా అవసరాలను ప్రజల సౌకర్యంతో సమతుల్యం చేస్తుందని పేర్కొంది.
పాఠశాలల మూసివేత..
నుహ్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలను సోమవారం మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
‘‘విద్యార్థుల భద్రత, సౌలభ్యం దృష్ట్యా నుహ్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు సోమవారం మూసివేస్తున్నారు. ఈ ఆదేశాలను పాటించేలా చూడాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు.’’ అని డిప్యూటీ కమిషనర్ విశ్రామ్ కుమార్ మీనా జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.
డ్రోన్లు బాణసంచాపై నిషేధం..
భద్రతా చర్యలలో భాగంగా డ్రోన్లు, గ్లైడర్లు, విమానాలు, బాణసంచా, మైక్రో లైట్లు, గాలిపటాలు ఎగరవేయడం, వేడీ గాలి బెలూన్లు, పవర్ గ్లైడర్ల వాడకాన్ని కూడా జిల్లా యంత్రాంగం నిలిపివేసింది.
మాంసాహారం అమ్మాకాలపై నిషేధం..
నుహ్ డిప్యూటీ కమిషనర్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. యాత్ర మార్గంలో చేపలు, మాంసం మొదలైన మాంసాహార పదార్థాల అమ్మకం, ప్రదర్శన లేదా బహిరంగంగా వేలాడదీయడంపై నిషేధం ఉంది.
ఈ నిషేధం సోమవారం ఉదయం ఆరుగంటల నుంచి అర్థరాత్రి వరకు అమలులో ఉంటాయని నల్హాద్ మహాదేవ్ ఆలయం నుంచి ఫిరోజ్ పూర్ ఝర్కాలోని ఝికేశ్వర్ మహాదేవ్ ఆలయం మరియు సింగర్ గ్రామంలోని సింగర్ ఆలయం వరకూ ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. మత పరమైన ప్రదేశాల చుట్టూ ఉన్న తినుబండారాలు, దుకాణాలకు సంబంధించిన ఉత్తర్వులూ సైతం ప్రభుత్వం జారీ చేసింది.


Read More
Next Story