నిషికాంత్ దుబే పై చర్యలు తీసుకోవాలి: ఏజీకి లేఖ రాసిన న్యాయవాదీ
x
నిషికాంత్ దుబే

నిషికాంత్ దుబే పై చర్యలు తీసుకోవాలి: ఏజీకి లేఖ రాసిన న్యాయవాదీ

సుప్రీంకోర్టు గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడారని ఆరోపణ


గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లులు చట్టాలుగా మార్చడం, రాష్ట్రపతికే సుప్రీంకోర్టు నిబంధనలు విధించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి మరువక ముందే సుప్రీంకోర్టు వ్యవహార శైలిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు చట్టాలు చేయవలసి వస్తే పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలను మూసివేయాలని దుబే వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ఆయన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ అటార్నీ జనరల్ కు సుప్రీంకోర్టు న్యాయవాదీ లేఖ రాశారు. సదరు న్యాయవాదీ వక్ఫ్ చట్టం తరఫున ఓ కక్షిదారుడి తరఫున వాదనలు వినిపిస్తున్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
దూబే వ్యాఖ్యలు తీవ్ర అవమానకరమైనవి, ప్రమాదకరమైనవి, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయవాదీ అటార్నీ జనరల్ కు రాసిన లేఖలో విమర్శించారు.
‘‘1975 సుప్రీంకోర్టు ధిక్కారానికి సంబంధించిన ప్రొసిడింగ్ లను నియంత్రించే నిబంధనలలోని 3(సీ)నిబంధనతో పాటు 1971 కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 15(1)(బీ) కింద నేను ఈ లేఖ రాస్తున్నాను. జార్ఖండ్ లోని గొడ్డా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీ నిషికాంత్ దుబే బహిరంగంగా చేసిన ప్రకటనలు తీవ్ర అపకీర్తి కలిగించేవి. తప్పుదారి పట్టించేవి, గౌరవనీయ భారత సుప్రీంకోర్టు గౌరవం, అధికారాన్ని తగ్గించే లక్ష్యంతో ఉన్నాయి’’ అని లేఖలో పేర్కొన్నారు.
వక్ఫ్ చట్టంలోని కొన్ని వివాదాస్పద నిబంధనలను కోర్టు ప్రశ్నలు లేవనెత్తిన తరువాత ఈ పరిణామం జరిగింది. ఇవి వైరల్ గా మారాయి. ఇవి దుబే వ్యక్తిగత అభిప్రాయాలు అని బీజేపీ పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు నడ్డా ఇవి అతని వ్యక్తిగతమైనవని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలోని విడదీయరాని భాగమైన న్యాయవ్యవస్థ పట్ల అధికార పార్టీకి ఉన్న గౌరవాన్ని ఆయన ధృవీకరించారు. పార్టీ నాయకులకు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తాను ఆదేశించానని నడ్డా చెప్పారు.


Read More
Next Story