రామమందిర చరిత్రను డాక్యుమెంటరీగా తీసిన ప్రముఖ దర్శకుడు
x

రామమందిర చరిత్రను డాక్యుమెంటరీగా తీసిన ప్రముఖ దర్శకుడు

ప్రముఖ దర్శకుడు అయోధ్య రామమందిర చరిత్రను ఐదు భాగాలుగా డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించారు.


ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అయోధ్య రామమందిర చరిత్రను ఐదు భాగాలుగా డాక్యుమెంటరీ పూర్తి చేశారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ మేరకు ప్రియదర్శన్ వివిరంచారు. ఆలయ చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో తీయడానికి తనకు ఆహ్వానం అందిందని వివరించారు.

ఈ ఆహ్వానాన్ని నేను సంతోషంగా స్వీకరించాను. ఎంతో ఉత్సాహంతో పని చేశానన్నారు. స్క్రిప్ట్ “చాలా ఆసక్తికరంగా” ఉందని, గత 500 సంవత్సరాల ఆలయ చరిత్ర, “రాముడు తన పవిత్ర జన్మస్థలానికి తిరిగి రావడానికి చేసిన తీవ్రమైన పోరాటాన్ని” డాక్యుమెంట్-సిరీస్ ప్రదర్శిస్తుందని వెల్లడించారు.

ఈ డాక్యుమెంట్-సిరీస్‌ని రూపొందించడానికి దూరదర్శన్‌తో ప్రియదర్శన్ భాగస్వామ్యం అయ్యారు. ఇందుకోసం 60 రోజుల పాటు నిరంతరాయంగా భక్తితో పనిచేసినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం కావడానికి జరిగిన ప్రయత్నాలు, ప్రయాణాలు ప్రభావంతంగా చిత్రీకరించడానికి చాలా జాగ్రత్తగా పనిచేశానని ప్రియదర్శన్ వివరించారు.

రాముడిగా రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ చిత్రం 'రామాయణం' గురించి చాలా చర్చలు జరుగుతున్నప్పటికీ, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అయోధ్యలోని రామ మందిర చరిత్రను ఐదు భాగాల సిరీస్ లో డాక్యుమెంట్ చేసే పనిని పూర్తి చేశారు. ఈ డాక్యుమెంటరీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా వివిధ వ్యక్తులతో ఇంటర్వ్యూలు ఉన్నాయి.



సెన్సిటివ్ సబ్జెక్ట్
సిరీస్ చేస్తున్నప్పుడు కొన్నిసవాల్లు తనముందు నిలిచాయని అన్నారు. చారిత్రాత్మక కథనాన్ని విశ్వసనీయంగా ప్రదర్శిస్తూనే "సున్నితమైన విషయాలను జాగ్రత్తగా" దృశ్యరూపంలో తీసుకురావడం కష్టమైన అనుభవమని ప్రియదర్శన్ అన్నారు. ప్రియదర్శన్ కొంత డ్రామాను కూడా ఇందులో చేర్చారు.
జవహర్‌లాల్ నెహ్రూ, కలెక్టర్ KK నాయర్ వంటి వ్యక్తులను స్క్రీన్ పై చూపడానికి కొంతమంది నటులను సైతం ఎంపిక చేసుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ప్రముఖ దర్శకుడు ఊర్వశితో తమిళంలో ‘అప్పత’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస హిట్ చిత్రాలను అందించాడు.



Read More
Next Story