లక్నోలో లవ్ జిహాద్ కు ప్రయత్నించిన వైద్యుడు
x
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ

లక్నోలో లవ్ జిహాద్ కు ప్రయత్నించిన వైద్యుడు

తనకు పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి, ప్రేమ పేరుతో బలవంతపు మత మార్పిడి, యోగీ ఆదిత్యనాథ్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు


శిల్పి సేన్

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రతిష్టాత్మక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ(కేజీఎంయూ) లో ఓ వైద్యురాలిపై బలవంతపు మతమార్పిడి, లవ్ జిహాద్ వ్యవహరం కేసు సంచలనం సృష్టిస్తోంది.
ఓ హిందూ డాక్టర్ ను, పాథాలజీ విభాగానికి చెందిన జూనియర్ రెసిడెంట్ డాక్టర్ రమీజుద్దీన్ నాయక్( రమీజ్ మాలిక్) పై లవ్ జిహాద్ కు ప్రయత్నించారు. నిందితుడు తనకు పెళ్లి అయిన సంగతిని దాచిపెట్టి తనను ప్రేమించినట్లు నటించాడని, తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధిత వైద్యురాలు తీవ్ర స్థాయిలో ఆరోపించింది. తనను బలవంతంగా ఇస్లాంలోకి మారాల్సిందిగా ఒత్తిడి చేశాడని కూడా సదరు డాక్టర్ పేర్కొంది.
బాధిత మహిళ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కు ఫిర్యాదు చేసి న్యాయం కోసం విజ్ఞప్తి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహరం పై కేజీఎంయూ కూడా ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి నివేదికను సమర్పించడంతో సదరు వైద్యుడిని సస్పెండ్ చేశారు.
మోసం, వేధింపులు..
ఈ ఏడాది జూలైలో వారు తొలిసారిగా క్యాంపస్ కలుసుకున్నారు. వారి పరిచయం తరువాత ప్రేమగా మారిందని నివేదిక తెలియజేసింది. అయితే అప్పటికే రమీజ్ మాలిక్ కు వివాహం జరిగింది. ఈ విషయాన్ని అతడు దాచి పెట్టాడని తేలింది.
ఆశ్చర్యకరంగా మొదటి వివాహం కూడా హిందూ అమ్మాయితోనే జరిగింది. ఆమెను కూడా తరువాత ఇస్లాంలోకి మార్చుకున్నాడు.
డాక్టర్ బాధితురాలిని కూడా ఇస్లాం స్వీకరించాల్సిందిగా డాక్టర్ రమీజ్ ఒత్తిడి చేశాడని, కానీ ఆమె నిరాకరించడంతో మానసికంగా హింసించాడని, దీని ఫలితంగా బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. డిసెంబర్ 17న ఆమె నిద్రమాత్రలు తీసుకోగా సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలు ముఖ్యమంత్రి పబ్లిక్ హియరింగ్ పోర్టల్ హెల్ప్ లైన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేసిన తరువాత ప్రస్తుతం పోలీస్ రక్షణలో ఉంది. లైంగిక వేధింపులు, మోసం, చట్ట విరుద్దమైన మతమార్పిడి ప్రయత్నించడం కింద లక్నో లోని చౌక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది.
పరారీలో నిందితుడు
కేజీఎంయూ పరిపాలన విభాగం దర్యాప్తు చేపట్టడంతో నేరం రుజువు అయింది. వెంటనే రమీజ్ సస్పెండ్ చేసి, క్యాంపస్ లోకి అతడి ప్రవేశాన్ని నిషేధించింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బాధితురాలి కుటుంబం రాష్ట్ర మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. బాధితురాలితో మాట్లాడిన మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలు అపర్ణ యాదవ్, ఇలాంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ సంఘటనపై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు కేజీఎంయూ క్యాంపస్ లో లవ్ జిహాద్, మత మార్పిడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్స్ లర్ కు మెమోరాండం సమర్పించారు. కఠిన చర్య తీసుకోకపోతే పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


Read More
Next Story