రంగ్ పూర్ డివిజన్, చిట్టగాంగ్ కారిడార్ గురించి మర్చిపోయారా? అస్సా సీఎం
x
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ

రంగ్ పూర్ డివిజన్, చిట్టగాంగ్ కారిడార్ గురించి మర్చిపోయారా? అస్సా సీఎం

మీరు చికెన్ నెక్ పై దాడి చేస్తే ఈ రెండు ప్రాంతాలపై మా దాడులు ఉంటాయన్న బంగ్లాకు హెచ్చరిక


బంగ్లాదేశ్ కు అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ లోని సిలిగురి కారిడార్ పై, ఈశాన్య రాష్ట్రాలపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బంగ్లా నేతలు తమ దేశం గురించి కూడా ఆలోచించుకోవాలని చురకలు వేశారు.

భారత్ కు సిలిగిర్ కారిడార్ మాత్రమే ఉందని, కానీ బంగ్లాదేశ్ కు మాత్రం రెండు చికెన్ నెక్ లు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

కొన్ని వారాల క్రితం చైనాలో పర్యటించిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ నే బంగాళఖాతానికి నిజమైన రక్షకుడని ప్రగల్భాలు పలికారు. అలాగే ఈశాన్యభారతం ల్యాండ్ లాక్ ప్రాంతమని, చైనా ఈ ప్రాంతంపై పట్టు సాధించాలని అన్నారు.
హిమాంత బిశ్వ శర్మ ట్వీట్..
అస్సాం ముఖ్యమంత్రి శర్మ ఆదివారం రాత్రి ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ లో రెండు చికెన్ నెక్ లు ఉన్నాయని, దాని బలహీనతలను గుర్తు చేశారు. ‘‘చికెన్ నెక్ కారిడార్’’ పై భారత్ ను అలవాటుగా బెదిరించేవారు ఈ వాస్తవాలను కూడా గమనించాలన్నారు. బంగ్లాదేశ్ కు రెండు చికెన్ నెక్ లు ఉన్నాయి. ఈ రెండు చాలా దుర్భలమైనవని ఆయన ట్వీట్ లో రాసుకొచ్చారు.

‘‘మొదటిది 80 కిలోమీటర్ల మాత్రమే ఉన్న ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్- దఖిన్ దినాజ్ పూర్ నుంచి నైరుతి గారో హిల్స్ వరకూ ఉంది. ఇక్కడ ఏదైన అంతరాయం ఏర్పడితే బంగ్లాలోని రంగ్ పూర్ డివిజన్ మిగిలిన బంగ్లా ప్రధాన భూభాగం నుంచి పూర్తిగా వేరు చేయబడుతుంది.
రెండోది దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకూ ఉన్న 28 కిలోమీటర్ల చిట్టగాంగ్ కారిడార్. భారత్ చికెన్ నెక్ కంటే ఈ చిన్నదైన కారిడార్ బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధానికి ఉన్న ఏకైక లింక్.
‘‘కొందరు మర్చిపోయే అవకాశం ఉన్న భౌగోళిక వాస్తవాలను మాత్రమే తాను ప్రయత్నిస్తున్నానని శర్మ అన్నారు. ‘‘భారత్ లోని సిలిగుర్ కారిడార్ లాగే, మన పొరుగుదేశం కూడా వారి రెండు ఇరుకైన కారిడార్లతో మనుగడ సాగిస్తోంది’’ అని శర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
భారత సైనిక శక్తి..
బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో హిమంత శర్మ మాట్లాడుతూ.. భారత్ కు ఒక కోడి మెడ ఉంటే.. బంగ్లాదేశ్ కు రెండు ఉన్నాయి. బంగ్లాదేశ్ భారత్ చికెన్ నెక్ పై దాడి చేస్తే, భారత్, బంగ్లాలోని రెండు చికెన్ నెక్ లపై దాడి చేస్తుందని ఆయన హెచ్చరించారు.
పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన దాడులను శర్మ ప్రస్తావిస్తూ, మన దేశ సైనిక బలాన్ని గుర్తు చేశారు. ‘‘భారత్ పై దాడి చేయడానికి బంగ్లా 14 సార్లు జన్మ ఎత్తాలి’’ అని శర్మ అన్నారు.
యూనస్ పర్యటనలో ఏమన్నారంటే..
ఈ సంవత్సరం మార్చి చివరలో మహ్మద్ యూనస్, భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉన్నాయని బంగ్లాదేశ్ ను బంగాళాఖాతానికి ఏకైక రక్షకుడు అని పేర్కొన్నారు. ఆయన తన చైనా పర్యటన సందర్భంగా ఇది ఒక భారీ అవకాశాన్ని తెరుస్తుందని చైనాకు చెప్పారని, బంగ్లాదేశ్ లో చైనా తన ఆర్థిక ప్రభావాన్ని పెంచుకోవాలని కోరారు.
యూనస్ ప్రకటనపై అస్సాం ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ ప్రకటన తీవ్ర అభ్యంతరకరమైనదని, ఖండించదగినదిగా అభివర్ణించారు. భారత్ లోని అంతర్గత అంశాలు కూడా ఈశాన్య రాష్ట్రాలు ప్రధాన భూభాగం నుంచి భౌతికంగా దూరంగా, ఒంటరిగా ఉన్నాయనే బెదిరింపులు చేస్తున్నారని శర్మ అన్నారు. సిలిగురి కారిడార్ లోని చికెన్ నెక్ కారిడార్ కింద, చుట్టూ మరింత బలమైన రైల్వే రోడ్డు నెట్ వర్క్ లను అభివృద్ది చేయడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
భారత చికెన్ నెక్..
సిలిగురి కారిడార్ దాని భౌగోళిక పరిస్థితుల కారణంగా చికెన్ నెక్ అని పిలుస్తారు. దీనికి దక్షిణాళ బంగ్లాదేశ్, ఉత్తరాన భూటాన్, నేపాల్ ఉన్నాయి. భారత ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్ర రోడ్డు లేదా రైలు ద్వారా అన్ని భూ రవాణా కారిడార్ గుండానే వెళ్లాలి. ఈ కారిడార్ వెడల్పు కొన్ని ప్రాంతాలలో కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
ఈ చికెన్ నెక్ పై దాడి చేసి భారత్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చైనా కుతంత్రాలు చేస్తోంది. అందుకోసం భూటాన్ కు చెందిన డోక్ లాం వ్యాలీపై పట్టు బిగించాలని కుట్ర చేస్తోంది.
Read More
Next Story