
ఈడీ సోదాల సందర్భంగా టీఎంసీ ఎమ్మెల్యే జిబన్ సాహ ఇంటి వద్ద పహారా కాస్తున్న పారామిలిటరీ బలగాలు
ఎన్నికల ముందే టీఎంసీ నాయకుల అరెస్ట్ కు కారణమేంటీ?
కేంద్ర దర్యాప్తు సంస్థలు తరుచుగా రాజకీయం చేస్తున్నాయని బెంగాల్ లో విమర్శలు
పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి బెంగాల్ లో అడుగు పెట్టాయి.
కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హస్పిటల్ లో జరిగిన ఆర్ధిక అవకతవకలకు సంబంధించి సీబీఐ, టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్త రాయ్ నివాసంపై దాడులు చేసింది.
మరో వైపు స్కూల్ సర్వీస్ కమిషన్ నియామక కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా రాష్ట్ర అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాను ఈడీ అరెస్ట్ చేసింది. జిబన్ సోమవారం అరెస్ట్ కాగా, శనివారం ఈడీ కస్టడీకి తరలించారు.
జిబన్ తన కుటుంబ సభ్యుల పేరు మీద అనేక అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను నిర్వహించాడని ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ముఖ్యంగా అతని భార్య పేరు మీద 2020 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య రూ. 26 లక్షలు జమ అయ్యాయి.
అలాగే రాజకీయ నాయకుడి ఇతర బంధువుల ఖాతాలో కూడా ఇలాంటి నగదు జమ అయినట్లు ఈడీ తెలిపింది. ఎస్ఎస్సీ కుంభకోణంలో మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ, ప్రాథమిక విద్యా మండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య ల ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
సుదీప్త రాయ్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిన తరువాత ఆసుపత్రి పరికరాల కొనుగోలు, అనధికార స్టాళ్ల ఏర్పాటులో, రోగులను సొంత ఆసుపత్రికి తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది.
అలాగే అక్రమంగా సిబ్బంది నియమాకాలకు సంబంధించి విద్యా కోర్సుల నకిలీ పత్రాలు సృష్టించారని పేర్కొంది. ఇవి ప్రజల దృష్టిని ఆకర్షించినప్పటికీ, అనేక ప్రశ్నలు సైతం లేవనెత్తాయి.
చాలామందికి నమ్మకం లేదా?
కేంద్ర దర్యాప్తు సంస్థల ఇతర ట్రాక్ రికార్డ్, ఎన్నికల ముందు ఇంతకుముందు జరిగిన చర్యలు వారిలో అనుమానం రేకెత్తిస్తున్నాయి. ఇవి చాలా అరుదుగా మాత్రమే నిజం అవుతాయని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. వీటినే టీఎంసీనే తరుచుగా హైలైట్ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం వాటిని రాజకీయంగా ప్రేరేపించిందని, కేంద్ర సంస్థలు రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ ఆరోపణల సంగతి అలా ఉంచితే, రాష్ట్రంలో కేంద్ర సంస్థలు అనేక ప్రధాన కేసులను సమర్థవంతంగా అనుసరించలేదనే భావన కూడా పెరుగుతోంది.
బీజేపీ ఏమంటోంది..
బెంగాల్ లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ రాష్ట్ర శాఖ కూడా కేంద్ర దర్యాప్తుసంస్థల విచారణపై ఏ మాత్రం ఆసక్తిగా లేదు. ‘‘మాకు సీబీఐ దర్యాప్తు వద్దు. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయనివ్వండి. మమతా బెనర్జీ పోలీసులకు బెంగాల్ ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తున్నారు.
కాబట్టి సరైన దర్యాప్తు ద్వారా నిజం బయటకు రావాలి’’ అని ఏడాది జూన్ లో కోల్ కతలోని లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం తరువాత బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ వ్యాఖ్యానించారు.
ఆర్జీకర్ కేసును దర్యాప్తు చేయడంలో సీబీఐ విజయవంతం కాలేదని ఆమె అన్నారు. ఏజెన్సీ దర్యాప్తు చేయాలని నిందితుడిని ఎందుకు పట్టుకులేదో కూడా ఆమె వివరించారు.
సీబీఐపై విశ్వాసం లేకపోవడంపై టీఎంసీ విమర్శలు చేసిన తరువాత పాల్ వ్యాఖ్యకు బీజేపీ దూరంగా ఉంటోంది. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలు చేస్తున్న కేసుల దర్యాప్తు చాలా నెమ్మదిగా సాగుతోంది. దీనిపై రాష్ట్ర యూనిట్ కేంద్ర నాయకత్వానికి అసంతృప్తిని తెలియజేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సీబీఐ షో చేస్తోంది: న్యాయమూర్తి
కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్న కేసులలో పురోగతి లేకపోవడంపై న్యాయవ్యవస్థ ఇటీవల సంవత్సరాలలో అనేక సందర్భాలలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూలై లో తూర్పు మిడ్నాపూర్ ఇద్దరు బీజేపీ కార్యకర్తల హత్య కేసును సీబీఐకి ఇవ్వడానికి కలకత్త హైకోర్టు నిరాకరించింది. ఇది గ్యాలరీ షో గా మారుతుందని పేర్కొంది.
‘‘సీబీఐ ప్రస్తుతం ఒక గ్యాలరీ షో. నేను దానిని సీబీఐకి ఇస్తే, అది కేవలం గ్యాలరీ షో అవుతుంది’’ అని జస్టిస్ తీర్థంకర్ ఘోష్ వ్యాఖ్యానించారు. అటువంటి దర్యాప్తు ఫలితాల కంటే ఆప్టిక్స్ గురించి ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు.
గత నెలలో ఆర్జీకర్ అవినీతి కేసులో కీలకమైన ఫిర్యాదు లేక అసలు కాపీని సమర్పించడంలో విఫలమైందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు కేంద్ర సంస్థను మందలించింది.
కేసులు ఏమవుతుంటాయంటే..
కేంద్ర సంస్థలు దర్యాప్తు చేసిన అనేక ప్రధాన కేసులు కూడా కోర్టులో నిరూపించలేకపోతున్నాయి. దీనికి శారదా చిట్ ఫండ్ కుంభకోణం దీనికి ఓ ఉదాహారణ. సంవత్సరాల తరబడి దర్యాప్తు జరిగినప్పటీకి ప్రధాన నిందితుడైన సుదీప్త సేన్ ఇటీవల సాక్ష్యాలు లేకపోవడంతో నిర్ధోషిగా విడుదలయ్యాడు. ఇతర కేసులలో అతను అండర్ ట్రయల్ ఖైదీగా జైలులో ఉన్నారు. అతను నిర్ధోషిగా ఉండటంతో సీబీఐ దర్యాప్తు పై అనుమానాలు వస్తున్నాయి.
ఇతర దర్యాప్తులు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. ఆర్జీకర్ అత్యాచార- హత్య కేసు కూడా నెమ్మదిగా సాగుతోంది. దీనిలో విధానపరమైన లోపాలు కనిపించాయి. టీచర్ల నియామక కుంభకోణం లో ఇదే విధంగా జరుగుతోంది.
జిబన్ కేసు ఈ విషయాన్ని వివరిస్తుంది. అతన్ని సీబీఐ ఏప్రిల్ 2023 లో అరెస్ట్ చేసిింది. కానీ మే 2025 లో బెయిల్ మంజూరు చేసింది. కొన్ని నెలల తరువాత ఈడీ అతన్ని అరెస్ట్ చేసింది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోయినప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కొత్త కేసులు తీసుకోవడం, అలాగే వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆగష్టు 21న బీజేపీ కార్యకర్త హత్యకు సంబంధించిన అనుబంధ చార్జీషీట్ లో సీబీఐ టీఎంసీ ఎమ్మెల్యే పరేష్ పాల్, ఇద్దరు కౌన్సిలర్లను పేర్కొంది. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇవన్నీ దర్యాప్తు సంస్థల బలం, న్యాయబద్దతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
ఎన్నికల ముందే ఆక్టివ్ గా మారతాయి?
‘‘రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందే కేంద్ర సంస్థలు అకస్మాత్తుగా క్రియాశీలకంగా మారతాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ గా మారింది. బెంగాల్ లో ఇదే జరిగింది. చాలామంది టీఎంసీ నాయకులు అవినీతిలో పాలుపంచుకున్నారు.
కానీ వీరిని దోషులుగా నిర్ధారించే బదులు, కేంద్ర సంస్థలు కేసులను రాజకీయం చేయడంపై ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది’’ అని బెంగాల్ పీసీసీ కమిటీ సీనియర్ సభ్యుడు రణజిత్ ముఖర్జీ అన్నారు.
పెండింగ్ లో ఉన్న కేసులలో పురోగతి కనిపించడం లేదు. సీబీఐ వద్ద 900 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో కొన్ని 20 సంవత్సరాలకు పైగా పరిష్కారం కాకుండా ఉన్నాయి.
‘‘ఇది ఇబ్బందికరమైన గణాంకాలను తెలియజేస్తోంది. ఎన్నికల ముందు కేంద్ర సంస్థలు తరుచుగా హై ప్రొఫైల్ చర్యలను ప్రారంభిస్తాయి. కానీ ఈ కేసులు కోర్టుల్లో నిలబడట్లేదు. సంవత్సరాలుగా వ్యవస్థలో చిక్కుకుపోయి ఉంటాయి.
ప్రస్తుతం కొంచెం ముందస్తుగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇవి కేవలం రాజకీయం చేయడానికే వచ్చాయా అనే సందేహాలు వస్తున్నాయి’’ అని కోల్ కతాకు చెందిన న్యాయవాదీ నబా పల్లబ్ రాయ్ అన్నారు.
Next Story