మోదీపై ఈసీకి ఫిర్యాదు చేస్తానంటున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమత.. ఎందుకు?
x

మోదీపై ఈసీకి ఫిర్యాదు చేస్తానంటున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమత.. ఎందుకు?

ప్రధాని మోదీ ఏం చేశారు? మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానంటున్నారు?


లోక్‌సభ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మే 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు కన్యాకుమారిలో ఉండబోతున్నారు. అక్కడ స్వామి వివేకానందుడికి నివాళి అర్పించిన అనంతరం రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

‘టెలికాస్ట్ చేయడం కోడ్ ఉల్లంఘనే’

అయితే మోదీ ధ్యానం చేస్తున్న విజువల్స్‌ను ప్రసారం చేస్తే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అలా చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అవుతుందన్నారు. జాదవ్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఇటీవల ప్రధాని మోదీ ఓ మైదానంలో ప్రచార సభ నిర్వహించారు. అదే మైదానంలో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2019 ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని కేదార్‌నాథ్ గుహలో ఇలాగే ధ్యానానికి వెళ్లారు.

మొత్తం 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లోని తొమ్మిది లోక్‌సభ స్థానాలకు ఏడవ దశలో జూన్ 1 న పోలింగ్ జరగనుంది.

Read More
Next Story