రంగు పడితే గాని ఖర్గేకి బెంగాల్ దెబ్బేమిటో తెలిసిందా?
x

రంగు పడితే గాని ఖర్గేకి బెంగాల్ దెబ్బేమిటో తెలిసిందా?

రంగుపడితే గాని మల్లికార్జున ఖర్గేకి అధీర్ రంజన్ చౌదరి దెబ్బేమిటో తెలిసివచ్చినట్టు లేదంటున్నారు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్లు..


రంగుపడితే గాని మల్లికార్జున ఖర్గేకి అధీర్ రంజన్ చౌదరి దెబ్బేమిటో తెలిసివచ్చినట్టు లేదంటున్నారు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్లు. రెండు రోజుల కిందట పశ్చిమ బెంగాల్ పీసీసీ నేత అధీర్ రంజన్ చౌదరి టీఎంసీ అధినేత మమతా బెనర్జీని కాస్తంత తీవ్రంగానే ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యల్ని మల్లికార్జున ఖర్గే ఖండించడంతో పాటు అవి ఆయన వ్యక్తిగత విమర్శలుగా అభివర్ణిస్తూ అధీర్ ను తప్పుబట్టారు. అది జరిగిన తర్వాత పీసీసీ కార్యాలయం ఎదుట పెట్టిన ఖర్గే బ్యానర్లు, ఫ్లెక్సీలకు మసిపూసి పార్టీ క్యాడర్ కొందరు పరోక్షంగా నిరసన తెలిపారు. ఇది జరిగిన సరిగ్గా 24 గంటల తర్వాత మల్లికార్జున ఖర్గే అధీర్ రంజన్ చౌదరిని కాంగ్రెస్ కు క్రమశిక్షణాయుతమైన సైనికుడంటూ ప్రశంసించారు. ఇండియా కూటమి పట్ల టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ విధేయతను ప్రశ్నించినందుకు అధిర్ రంజన్ చౌదరిని మల్లికార్జున ఖర్గే మందలించారు. మమతా బెనర్జీని విశ్వసించలేమని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో చేతులు కలపవచ్చునని బహరంపూర్ నుంచి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన చౌదరి ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఖండించారు. దాంతో ఆయన చిత్రపటాలకు మసిపూశారు పశ్చిమ బెంగాల్లో. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే సోమవారం (మే 20)న పీటీఐతో మాట్లాడుతూ "వో హమారే లడకు సిపాహీ హై (అతను మా పోరాట యోధుడు)" అని చౌదరికి కితాబు ఇచ్చారు. ఖర్గే పిటిఐకి ఇలా అన్నారు.."ఆయన (అధీర్ రంజన్ చౌదరి) కాంగ్రెస్ పార్టీకి పోరాటయోధుడు, శ్చిమ బెంగాల్‌లో మా నాయకుడు" అన్నారు.
వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు అంశాన్ని ఇప్పుడు కొందరు టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారని, వాళ్లకి ఆ అర్హత లేదన్నారు. “వాళ్ళు విభిన్నంగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని అర్థం చేసుకునే స్థాయి మాకుంది అన్నారు ఖర్గే.
"పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో కలిసి నడవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. మేము దానికి కట్టుబడి ఉన్నాం" అని ఖర్గే చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లతో కలిసి ముంబైలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ మమతా బెనర్జీపై అధీర్ రంజన్ చౌదరి చేసిన విమర్శలను ఖర్గే శనివారం తోసిపుచ్చారు. 'మమతా బెనర్జీ ఇండియా కూటమితోనే ఉన్నారు.. ప్రభుత్వంలో చేరతామని ఇటీవలే చెప్పారు. అధిర్ రంజన్ చౌదరి నిర్ణయం తీసుకోరు. నేను, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటామని, అంగీకరించని వారు బయటకు వెళ్తారని " అని ఖర్గే అన్నారు.
ఖర్గే వ్యాఖ్యల తర్వాత, ఆదివారం కోల్‌కతాలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ముందు కాంగ్రెస్ అధ్యక్షుడి పోస్టర్లు, హోర్డింగ్‌లపై సిరా చల్లారు. ఆయన ఫోటోలకు మసిపూసారు. అది జరిగిన 24 గంటల తర్వాత మల్లికార్జున ఖర్గే అధీర్ రంజన్ ను ప్రశంసించడం గమనార్హం.
Read More
Next Story