విదేశీ ఉగ్రవాదులను కాంగ్రెస్ అనుమతించి, ఒప్పందాలు చేసుకుంది: నడ్డా
x

విదేశీ ఉగ్రవాదులను కాంగ్రెస్ అనుమతించి, ఒప్పందాలు చేసుకుంది: నడ్డా

మణిపూర్ జాతుల వైరాన్ని కాంగ్రెస్ తనకు రాజకీయ లబ్ది చేకూర్చడానికి వాడుకుంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.


మణిపూర్ జాతుల ఘర్షణపై రెండు జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్దం నడుస్తోంది. కుకీ- మైతేయ్ జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాయడాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో విదేశీ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించి ఒప్పందాలు చేసుకుందని, అందుకే ఈశాన్యాన జాతుల ఘర్షణలు ప్రారంభం అయ్యాయని నడ్డా ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ మణిపూర్ సంఘర్షణలను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తూనే ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే కే లేఖ రాశారు. పద్ధతి ప్రకారం ఓ నెరెటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.
మణిపూర్‌లో అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సమస్యలపై కాంగ్రెస్ చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. ‘‘ అప్పటి మీ తీవ్ర వైఫల్యం’’ పరిణామాలు ఈ నాటికి అనుభవిస్తున్నామని ఖర్గే కు రాసిన లేఖలో నడ్డా ఆరోపించారు.
సంచలనం కోసం ఈ చేష్టలు..
మణిపూర్‌ పరిస్థితిని సంచలనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పదేపదే ఎలా ప్రయత్నిస్తుందో తన లేఖలో ఖర్గే నడ్డా వివరించారు. కాంగ్రెస్ హయాంలో విదేశీ వలస ఉగ్రవాదుల రాకను అప్పటి హోంమంత్రి చిదంబరం చట్టబద్దం చేయడమే కాకుండా వారితో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారని లేఖలో ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా మరిచిపోయిందని పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు మణిపూర్ ఇలా మారిందని విమర్శలు గుప్పించారు.
స్పందించిన జైరాం రమేష్..
ఈ లేఖపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. నడ్డా రాసిన లేఖ పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చడానికి ఓ లేఖ రాశారన్నారు. మణిపూర్ ప్రజలు సాధారణ స్థితి, శాంతి, సామరస్యంతో త్వరగా రాష్ట్రానికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నామని రమేష్ ఆకాంక్షించారు.
" ఈ దిశగా కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో మొదటిది ప్రధానమంత్రి రాష్ట్రాన్ని ఎప్పుడు సందర్శిస్తారు? మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా లేనప్పుడు, సిఎం ఇంకా ఎంతకాలం కొనసాగుతారు? మణిపూర్‌లో ఘోర వైఫల్యాలకు కేంద్ర హోంమంత్రి బాధ్యత ఎప్పుడు తీసుకుంటారు? అని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు.
జాతి కలహాలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితిని పరిష్కరించినందుకు కేంద్రాన్ని దూషించడంతో పాటు, మణిపూర్‌లో పర్యటించనందుకు ప్రధానిపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
గత ఏడాది మే నుంచి ఇంఫాల్ వ్యాలీకి చెందిన హిందూ మొయితీలు- కొండ ప్రాంతాల్లో నివసించే క్రిస్టియన్ ఆధారిత కుకీ-జో సమూహాల మధ్య జాతి హింస ప్రారంభమైంది. హైకోర్టు మొయితీలను సైతం ఎస్టీల్లో చేరలాన్ని తీర్పు రావడంతో ఈ ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఈ జాతి హింసలో 220 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇక్కడ జాతుల ఘర్షణ కంటే ఎక్కువ మత్తు పదార్థాల వాడకంపై పైచేయి సాధించడానికి కొన్ని విదేశీ శక్తులు జాతుల ఘర్షణను వాడుకుంటున్నాయని కొంతమంది అనుమానిస్తున్నారు. ఇక్కడున్న క్రిస్టియన్ జనాభాతో కొత్త దేశాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు బలపడుతున్నాయి.



Read More
Next Story