ప్రధాని పాదాలను తాకిన నితీష్‌.. మోదీ అంటే గౌరవమా? లేక భయమా?
x

ప్రధాని పాదాలను తాకిన నితీష్‌.. మోదీ అంటే గౌరవమా? లేక భయమా?

బీహార్ సీఎం నితీష్ పలు సందర్భాల్లో ప్రధాని మోదీ పాదాలను తాకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు అలా వ్యవహరిస్తున్నారన్న దానిపై చర్చ కూడా జరుగుతోంది.


దర్భంగాలో జరిగిన ఓ బహిరంగ సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకినట్లు చూయించే వీడియో ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. ఇలా చేయడం నితీష్‌కు కొత్తేమీ కాదు. గతంలో రెండు సార్లు అలా చేశారు. జూన్‌లో జరిగిన ర్యాలీలో ఒకసారి అలాగే ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి మోదీకి పాదాభివందనం చేశారు. నితీష్ తీరుపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నీలు వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించిన ది ఫెడరల్ “క్యాపిటల్ బీట్” కార్యక్రమంలో ప్యానెలిస్ట్‌లు జయంత్ జిగ్యాసు, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ అశోక్ మిశ్రా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ ప్రధానితో కరచాలనం చేస్తాడని భావించారు. కాని ఆయన పాదాలను తాకడం పరిశీలకులను అబ్బురపరిచింది. గతంలో బీజేపీ కురువృద్ధులు అటల్ బీహారీ వాజ్‌పేయి, జార్జ్ ఫెర్నాండిస్‌తో కూడా నితీష్ ఇలాగే వ్యవహరించారు. మిశ్రా 1985 నుంచి నితీష్ పొలిటికల్ లైఫ్‌ను గమనిస్తున్నారు. గౌరవం, భయం లేదా ఆరోగ్య సమస్యలు కారణంగా అలా ప్రవర్తించి ఉండవద్దని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

దాడులకు భయపడేనా?

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ నితీష్‌కుమార్‌కు సన్నిహితంగా ఉన్న బ్యూరోక్రాట్‌లను లక్ష్యంగా చేసుకోవడంతో ఆయన భయపడి ఉండవచ్చు” అని మిశ్రా అభిప్రాయపడ్డారు. నితీష్‌ను రాజకీయంగా బలహీనపరిచేందుకు బీజేపీ పన్నుతున్న వ్యూహమని జిగ్యాసు పేర్కొన్నారు.

విధేయుడినని చాటుకునే ప్రయత్నమా?

నితీష్ చర్యలు బీజేపీకి సరెండర్ కావడానికి సంకేతంగా కనిపిస్తుందని మిశ్రా అంటున్నారు. మోదీ పాదాలను తాకడం ద్వారా ‘‘మీకు ఎప్పుడూ విధేయుడనే’’ అన్న సంకేతాన్ని నితీష్ పంపుతున్నారు. పెరుగుతున్న రాజకీయ అనిశ్చితి, పార్టీకి కాపాడుకోడానికి అలాగే బీజేపీతోనే తన స్నేహం కొనసాగుతుందని చెప్పడానికి నితీష్ పాదాభివందనం చేసి ఉండవచ్చన్నది మిశ్రా అభిప్రాయం.

నితీష్ తీరు తన స్థాయి నాయకుడికి తగదని జిజ్ఞాసు విమర్శించారు. “ఇది బీహారీలకు ఇబ్బందికరం. రాజకీయ అనుభవపరంగా చూస్తే.. నితీష్ కుమార్ కంటే మోదీ జూనియర్. మన ముఖ్యమంత్రి ఇంతటి స్థాయికి దిగజారడం నిరాశాజనకంగా ఉంది'' అని పేర్కొన్నారు.

JD(U) భవిష్యత్తుల్లో చిక్కులు..

నితీష్ చర్యల వల్ల జేడీ(యూ)కి వచ్చే చిక్కులను కూడా ప్యానెల్ ప్రస్తావించింది. పార్టీలోని అంతర్గత అసమ్మతిని మిశ్రా ఎత్తిచూపారు. కొంతమంది సభ్యులు నితీష్‌ నాయకత్వ సామర్థ్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. JD(U), RJD మధ్య త్వరలో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో రెండు కలిసి పోటీచేస్తేనే మనుగడ సాధ్యమని కొందరు చెబుతున్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌తో సహా కీలకమైన RJD నాయకులపై బీజేపీ కేసులను సిద్ధం చేసింది.

విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలు..

నితీష్ కుమార్ పదే పదే మోదీ పాదాలను తాకడంపై ప్రజలు, విమర్శకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నితీష్ ప్రవర్తన ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని మిశ్రా పేర్కొన్నారు. అయితే ఇది రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చని అభిప్రాయపడ్డారు. "నితీష్ కుమార్ అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. ఏ కారణం లేకుండా అలా వ్యవహరించడు" అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story