
బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం..
జేడీ(యూ) చీఫ్‌తో పాటు మరో 19 మంది..
బీహార్(Bihar) ముఖ్యమంత్రిగా JD(U) అధినేత నితీష్ కుమార్(Nitish Kumar) కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ప్రమాణ స్వీకారం(Oath taking) చేయడం ఇది పదో సారి. ఆయనతో పాటు 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు అగ్ర నాయకులు హాజరయ్యారు. బీజేపీ, జేడీ(యూ) నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) , చిరాగ్ పాశ్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నుంచి ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత కొత్త మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం.
విస్తృత భద్రతా ఏర్పాట్లు
సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మూడు లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా.

