రాజ్యసభలో  NDAదే పైచేయి..
x

రాజ్యసభలో NDAదే పైచేయి..

రాజ్యసభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం అయింది. ఎన్డీయే ఎంపీల సంఖ్య 119 కాగా, ఇండియా కూటమి రాజ్యసభ సభ్యుల సంఖ్య 85.


రాజ్యసభలో ఎన్డీఏ మెజారిటీ మార్కు చేరుకుంది. ప్రస్తుతం నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ బలం 119కి పెరిగింది. పార్లమెంటు ఎగువ సభలో మొత్తం 245 సీట్లు ఉన్నాయి. ఎనిమిది ఖాళీల కారణంగా ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ సాధించడానికి 119 మంది సభ్యులు అవసరం. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 121కి చేరింది. దీంతో పార్లమెంటు ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం అయింది. ఇక ప్రతిపక్ష పార్టీల రాజ్యసభ సభ్యుల సంఖ్య 85గా ఉంది.

కొత్త ఎంపీలు వీరే..

కొత్తగా ఎన్నికైన బీజేపీ సభ్యులు అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్‌, రామేశ్వర్ తేలీ, బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మహారాష్ట్ర నుంచి ధీర్య షీల్ పాటిల్, ఒడిశా నుంచి మమతా మొహంతా, త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్జీ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్ మధ్యప్రదేశ్ నుంచి, రవీనీత్ సింగ్ రాజస్థాన్‌ నుంచి ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి నితిన్ పాటిల్ గెలుపొందగా, బీహార్ నుంచి రాష్ట్రీయ లోక్ మంచ్ అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ గెలుపొందారు.

12 స్థానాలకు ఉప ఎన్నికలు..

కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల లోక్‌సభకు ఎన్నికైనందున ఖాళీ అయిన 12 స్థానాలకు ఉపఎన్నికలు ప్రకటించారు. నలుగురు అభ్యర్థులు - బిజెపికి చెందిన ధైర్యషీల్ పాటిల్, ఎన్‌సిపికి చెందిన నితిన్ పాటిల్ (మహారాష్ట్ర నుంచి), రామేశ్వర్ తేలి, మిషన్ రంజన్ దాస్ (అస్సాం నుంచి)ను సోమవారం విజేతలుగా ప్రకటించారు.

Read More
Next Story