స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీ రికార్డేమిటి?
x

స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీ రికార్డేమిటి?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధాని ఎవరంటే మోదీ అని చెప్పాలి. 2016లో 96 నిముషాలు ప్రసంగిస్తే.. ఈ సారి 2 నిముషాలు ఎక్కువే మాట్లాడారు.


ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రలోకెక్కారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 98 నిముషాల పాటు ప్రసంగించారు. గతంలో ఏ ప్రధాని ఇంత సేపు ప్రసంగించిన దాఖలాలు లేవు. ఇదివరకటి ఆయన ప్రసంగాలకు పరిశీలిస్తే అవన్నీ సగటున 82 నిమిషాలలోపు ఉన్నవే.

2017లో 56 నిముషాల పాటు..

కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాక 2014లో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మోదీ తొలిసారి 65 నిమిషాల పాటు ప్రసంగించారు. 2015లో దాదాపు 88 నిమిషాలు, 2016లో 96 నిమిషాలు, 2017లో 56 నిమిషాలు, 2018లో 83 నిమిషాల పాటు ప్రసంగించారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019లో దాదాపు 92 నిమిషాల పాటు ప్రసంగించారు. 2020లో మోదీ ప్రసంగం 90 నిమిషాల పాటు కొనసాగింది. 2021లో 88 నిమిషాల పాటు కొనసాగగా, 2022లో దాదాపు 74 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది మోదీ ప్రసంగం 90 నిమిషాల పాటు సాగింది.

మూడోసారి..తొలి ప్రసంగం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది 11వ సారి. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి ప్రసంగం ఇది.

14 నిముషాల్లో ముగించిన ఇందిరాగాంధీ..

మోదీ కంటే ముందు 1947లో జవహర్‌లాల్ నెహ్రూ, 1997లో ఐకే గుజ్రాల్ వరుసగా 72, 71 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. నెహ్రూ, ఇందిర కూడా వరుసగా 1954, 1966లో అతి తక్కువ వ్యవధిలో కేవలం 14 నిమిషాల్లోనే తమ ప్రసంగాలు ముగించారు.

మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట నుంచి అతి తక్కువ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు.

2012, 2013లో మన్మోహన్ సింగ్ ప్రసంగాలు వరుసగా 32 నిముషాలు, 35 నిమిషాల పాటు మాత్రమే ప్రసంగించారు. 2002, 2003లో వాజ్‌పేయి వరుసగా 25 నిముషాలు, 30 నిమిషాలలోపే తమ ప్రసంగాన్ని ముగించారు.

Read More
Next Story