
‘చైనా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై మోదీ స్పందించాలి’
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ డిమాండ్..
కేంద్రపాలిత ప్రాతం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పర్యాటక ప్రదేశం పహెల్గామ్‌లో 22 ఏప్రిల్ 2025న ఆరుగురు ఉగ్రమూకలు విచక్షణారహితంగా జరిగిన కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ (Operation Sindoor) చేపట్టి..పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళాలు మెరుపుదాడి చేసి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని బహిరంగ వేదికల్లో చెప్పుకున్నాడు. దీన్ని భారత్ ఖండించింది కూడా. మన దేశానికి సంబంధించిన వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని సహించబోమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
President Trump has long claimed that he personally intervened to halt Operation Sindoor on May 10, 2025. He has done so on 65 different occasions in various forums in at least seven different countries. The Prime Minister has never broken his silence on these claims made by his… pic.twitter.com/H20vsGfMxB
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 31, 2025
ఈ నేపథ్యంలో తాజాగా చైనా దాదాపు ట్రంక్ చేసిన వ్యాఖ్యలే చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ - భారత్(Pak-India) మధ్య చైనా మధ్యవర్తిత్వం వహించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. వాంగ్ యి వ్యాఖ్యలపై అయితే చైనా వాదనపై కేంద్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

