Maharashtra | సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసర్‌గా రామేశ్వర్ నాయక్
ముఖ్యమంత్రి సహాయ నిధి అధికారిగా రామేశ్వర్ నాయక్‌ను సీఎం ఫడ్నవీస్ నియమించారు. ఇదివరకు ఈ స్థానంలో మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే సన్నిహితుడు మంగేష్ చివ్టే ఉండేవారు.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి రావడంతో అత్యధిక స్థానాలు గెలుపొందిన బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన డిప్యూటీలుగా ఏక్‌నాథ్ షిండే (శివసేన), అజిత్ పవార్ (ఎన్‌సీపీ) బాధ్యతలు చేపట్టారు. అయితే సీఎం తనకు అనుకూలంగా ఉన్న వారిని అధికారులుగా నియమించుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అధికారిగా రామేశ్వర్ నాయక్‌ను ఆయన నియమించారు. ఇదివరకు ఈ స్థానంలో మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే సన్నిహితుడు మంగేష్ చివ్టే ఉండేవారు. 2022 జూన్‌లో మహారాష్ట్ర సీఎంగా షిండే బాధ్యతలు స్వీకరించిన తర్వాత చివ్టేకు ఆ పదవి లభించింది. ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయక్ వైద్య సహాయ విభాగానికి నేతృత్వం వహించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రమాదాలలో బంధువుల ప్రాణాలు కోల్పోయినపుడు లేదా క్యాన్సర్, కిడ్నీ, హృద్రోగ బాధితుల సహాయార్థం అర్హులైన కుటుంబాలు, వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయం చేస్తుంది.