కుంభమేళాలో ముగిసిన ప్రధాని మోదీ పవిత్ర స్నానం..
మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న వరకు జరుగుతుంది. ఇప్పటి వరకూ 38 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
ప్రధాని మోదీ (PM Modi) కొద్ది సేపటి క్రితం యూపీలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) చేరుకున్నారు. ఉత్తర ప్రదేశ్ (Utter Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)తో కలిసి ఆయన పడవలో ప్రయాణించి.. త్రివేణి సంగమం(గంగ, యమునా, సరస్వతీ నదుల అనుసంధాన ప్రాంతం)లో పవిత్ర స్నానం చేశారు. రుద్రాక్ష మాల చేతబట్టి మంత్రాలను ఉచ్చరిస్తూ పుణ్యస్నానం ఆచరించారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా(Maha Khumb Mela) కు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇప్పటికే 38 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది.
PM @narendramodi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh#Mahakumbh #UttarPradesh #Mahakumbhliveupdates #MahaKumbhCalling #MahaKumbhOnDD pic.twitter.com/brcMfsdszL
— DD News (@DDNewslive) February 5, 2025