ఆధ్యాత్మికతను రాజకీయాలు కబళించాయా?
x

ఆధ్యాత్మికతను రాజకీయాలు కబళించాయా?

మతపర కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుంటుందా? హిందూ ఓటు బ్యాంకు కోసమే మహా కుంభ మేళాకు విస్త్రత ప్రచారం కల్పించారా?


మతపర కార్యక్రమాలను రాజకీయాలకు ముడిపెడుతున్నారా? హిందు ఓటు బ్యాంకు కోసం కుంభ్ మేళా(Maha Kumbh)ను బీజేపీ(BJP) వాడుకుందా? ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కుంభ్ మేళా ప్రభావం ఉంటుందా? అనే అంశాలపై ఇటీవల ‘‘ది ఫెడరల్’’ డిబేట్ నిర్వహించింది. నీలూ వ్యాస్ హోస్ట్‌గా ‘‘కాపిటల్ బీట్’’ పేరిట నిర్వహించిన డిబేట్‌లో.. సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి సునీతా అరోన్, రాజకీయ విశ్లేషకుడు, రచయిత పుష్పరాజ్ దేశ్‌పాండే, విద్యావేత్త అజయ్ గుడావర్తి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

విస్త్రత ప్రచారం..

ప్రపంచంలోనే అతిపెద్ద మతపర సమావేశాల్లో కుంభ మేళా ఒకటి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాలో కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభ మేళా గురించి ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విస్త్రత ప్రచారం నిర్వహించడం.. స్వయంగా ప్రధాని మోదీతో చాలా మంది రాజకీయ ప్రముఖులు పవిత్రస్నానాలు ఆచరించడం, ప్రయాగ్ రాజ్‌ చేరుకోడానికి దేశం నలుమూలల నుంచి వందల సంఖ్యలో ప్రత్యేక రైలు నడపడం, భారీ భద్రతను ఏర్పాటు చేయడం.. ఇవన్నీ హిందువులను ఆకర్షించాయి.

అయితే బీజేపీ రాజకీయ స్వప్రయోజనాలకు కుంభమేళాను వాడుకుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సునీతా అరోన్ మాట్లాడుతూ.. "గంగా స్నానం శతాబ్దాలుగా ఒక సంప్రదాయంగా వస్తోంది. కానీ ఈసారి హిందూ ఓటు బ్యాంకు సమీకరణకు దీన్ని ఉపయోగించుకున్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత, కుంభమేళా హిందూ భావజాలాన్ని మరింత ప్రేరేపించింది,’’ అని పేర్కొన్నారు.

"బీజేపీ హిందూ మతాన్ని ఒక సామూహిక సంస్కృతిగా మలచింది. ఇది బ్రాహ్మణీయ సంప్రదాయాలను దాటి.. కుంభ్, కావడి యాత్ర, హనుమాన్ జయంతి వంటి వేడుకల్లో తక్కువ కులాల హిందువులు కూడా విస్తృతంగా పాల్గొనేలా చేసింది. దీనివల్ల హిందూ మతం ఒక కలెక్టివ్ ఐడెంటిటీగా మారుతోంది." అని అజయ్ గుడావర్తి అభిప్రాయపడ్డారు,

"బీజేపీ హిందూ మత పరిరక్షకురాలిగా నిలబడటంలో విజయవంతమైంది. మతపరమైన చర్చలపై ఆధిపత్యాన్ని సాధించింది. కుంభ్ 2025లో గమనించదగిన ముఖ్యమైన మార్పు.. బ్రాహ్మణేతర వర్గాల పెద్ద ఎత్తున పాల్గొనడం. దీని వల్ల మతపరమైన చైతన్యంలో మార్పు వస్తోంది,’’ అని దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు.

బీజేపీ దీర్ఘకాల వ్యూహం?

ఉత్తరప్రదేశ్‌లో 2027 ఎన్నికలు జరగనున్నాయి. రానున్న రోజులో మతపర భావోద్వేగాలు ఓటింగ్‌పై ప్రభావం చూపుతాయా? అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story