లోక్‌సభలో మణిపూర్ బడ్జెట్‌కు ఆమోదం..
x

లోక్‌సభలో మణిపూర్ బడ్జెట్‌కు ఆమోదం..

అక్కడ పాలనా మెరుగుపడింది. చిన్న చిన్న ఘటనలు మినహా శాంతి భద్రతల పరిస్థితి అదుపులో ఉంది’’ - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala seetaraman) మంగళవారం (మార్చి 11) లోక్‌సభ (Lok Sabha)లో 2025-26 సంవత్సరానికి మణిపూర్(Manipur) బడ్జెట్‌ను సమర్పించారు. ఇందులో ఈ ఏడాది ఖర్చు రూ. 32,656.81 కోట్ల నుంచి ₹35,103.90 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. మణిపూర్ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పాలనా మెరుగుపడిందని, కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా శాంతి భద్రతల పరిస్థితి నియంత్రణలో ఉందని చెప్పారు. గతంలో మణిపూర్‌లో దొంగిలించిన ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు.

అదనపు గ్రాంట్లకు ఆమోదం

మంగళవారం (మార్చి 11) లోక్‌సభ 2024-25 నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు నిధుల మంజూరును లోక్‌సభలో ఆమోదం లభించింది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ₹51,463 కోట్లు అదనపుంగా మంజూరయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,291 కోట్ల అదనపు గ్రాంట్లను, 2024-25 సంవత్సరానికి అదనపు గ్రాంట్ల కింద రూ. 1,861 కోట్లను మణిపూర్‌కు మంజూరు చేశారు. రెండో విడత అదనపు గ్రాంట్లలో ప్రభుత్వం మొత్తం రూ. 6.78 లక్షల కోట్ల అదనపు ఖర్చును కోరగా, అందులో రూ. 6.27 లక్షల కోట్లు పొదుపు ఆదాయాల ద్వారా సమీకరించనుంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹51,462.86 కోట్ల అదనపు ఖర్చును మిగిల్చినట్లు ఈ బడ్జెట్ ప్రతిపాదనలో పేర్కొన్నారు. అదనపు నిధులలో ₹5.54 లక్షల కోట్లు అప్పు చెల్లింపులకు వెళ్ళనున్నట్లు వివరించారు.

తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక నిర్వహణ..

"మేము ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ముందస్తుగా తీరుస్తున్నాం. తద్వారా ప్రభుత్వ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి" అని సీతారామన్ అన్నారు. మణిపూర్ బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. మొత్తం ఆదాయం రూ.35,368 కోట్లు కాగా, మొత్తం ఖర్చు రూ.35,104 కోట్లుగా ఉందని, ఇందులో రాష్ట్ర ఆదాయపు పన్ను ₹2,634 కోట్లు, ఆదాయేతర ఆదాయం రూ.400 కోట్లు అని తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ కోసం రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2024-25 రెండో విడత అదనపు నిధుల మంజూరు (SDG)కు సంబంధించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 2021-22 ఏడాదికి అదనపు గ్రాంట్లు 2025-26 మణిపూర్ బడ్జెట్, 2024-25 సంవత్సరానికి సంబంధించి మణిపూర్ అదనపు గ్రాంట్ల గురించి సీతారామన్ వివరించారు.

Read More
Next Story