కేంద్ర బడ్జెట్ 2025 హైలెట్స్..
x

కేంద్ర బడ్జెట్ 2025 హైలెట్స్..

‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ - సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు రుణ పరిమితి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంపు, స్టార్టప్‌ కంపెనీలకు రూ. 10 కోట్లు వరకు.


ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ (Budget) 2025-26 పార్లమెంటులో కొద్ది సేపటి క్రితం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె పేర్కొన్నారు. "ఈ బడ్జెట్ గరీబ్ (పేదలు), యువ (యువత), అన్నదాత (రైతులు), నారి (మహిళలు)లపై దృష్టి సారిస్తుంది" అని సీతారామన్ పేర్కొన్నారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు..

- వ్యవసాయం రంగానికి సంబంధించి ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకం ప్రారంభం. ఈ పథకం కింద 100 జిల్లాల్లో నీరు పారుదల వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయనున్నారు. రాష్ట్రాలతో కలిసి దీన్ని అమలు చేయనున్నారు.

- సహకార సంఘాలు ఏర్పాటుకు ప్రణాళిక. బీహార్‌లో మఖానా (ఫాక్స్‌నట్) బోర్డు.

- అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల కోసం జాతీయ మిషన్ ప్రారంభం. పత్తి ఉత్పత్తి పెంచడానికి కృషి.

- కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతుల రుణ పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు.

- సుస్థిర మత్స్య అభివృద్ధి కోసం కొత్త రూపకల్పన. అండమాన్-నికోబార్, లక్షద్వీప్ దీవులపై ప్రధాన దృష్టి.


MSMEలకు..

- సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు రుణ పరిమితి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంపు, స్టార్టప్‌ కంపెనీలకు రూ. 10 కోట్లు వరకు.

- MSME వర్గీకరణ ఆధునీకరించి.. పెట్టుబడి పరిమితి 2.5 రెట్లకు పెంపు..టర్నోవర్ పరిమితి కూడా రెట్టింపు

- అంతర్జాతీయ మార్కెట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచే MSMEలకు రూ. 20 కోట్లు వరకు అందుబాటులో టర్మ్ లోన్స్

- SC/ST, మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు 5 లక్షల మంది తొలిసారి పారిశ్రామికవేత్తలకు రూ. 2 కోట్లు వరకు రుణం అందించేందుకు కొత్త పథకం.

సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుదారులకు అందుబాటులోకి ప్రత్యేక క్రెడిట్ కార్డులు.

Read More
Next Story