ఆ మెట్రో.. అండర్ గ్రౌండ్ అద్భుతం
x

ఆ మెట్రో.. అండర్ గ్రౌండ్ అద్భుతం

భారత దేశం ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు చేసింది. వినువీధిలో మన పతాకం ఎన్నోసార్లు రెపరెపలాడింది. అయినప్పటికీ భారతీయులకు ఓ కోరిక అలాగే మిగిలిపోయింది. అదేంటంటే..


కోల్ కత.. ఒకప్పటి దేశ రాజధాని.. పురాతన, ఆధునిక నిర్మాణాల సమ్మేళనం. ఓవైపు గంగానదీ నీటి పాయ హూగ్లీ.. దాని పైన ఉన్న అందమైన హౌరా. భారత్ ఇప్పటికే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. చంద్రుని మీద ల్యాండర్ పంపడం, అంతరిక్షంలో ఆదిత్య ఎల్ -1, కృష్ణ బిలాల పరిశోధన లాంటివి పూర్తి చేశాం. అలాగే త్వరలో అండర్ వాటర్ మెట్రోని సైతం భారత్ లో మొదటి సారిగా ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసిన ఆ ప్రాజెక్ట్ వివరాల ఫెడరల్ ప్రేక్షకుల కోసం..


లండన్ లో ఎప్పుడో 1890 లోనే అండర్ గ్రౌండ్ రైళ్లు వచ్చాయి. టెక్నాలజీ హబ్ గా దేశం మారుతున్న మనకు కూడా అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ లేదనే బాధ భారతీయుల్లో ఇప్పటికి ఉంది. అయితే దాన్ని తీర్చడానికి కలకత్త మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ దశాబ్ధం క్రితమే నడుం బిగించింది. అనుకున్న వన్నీ జరిగితే ఇప్పటికే అందులో భారతీయులు ప్రయాణించే వారే కానీ, అనుకోని కారణాలు, మధ్యలో వచ్చిన కోవిడ్ వల్ల ప్రాజెక్ట్ ఐదేళ్లు ఆలస్యం అయింది.







దేశంలోనే తొలి మెట్రోను ప్రారంభం జరిగింది కోల్ కతలోనే. 1980 దశకంలోనే దీనిని ప్రారంభించారు. అలా దేశంలోని తొలి మెట్రో నగరంగా కలకత్త ఖ్యాతికెక్కింది. తరువాతే దేశవ్యాప్తంగా మెట్రోరెళ్లు అందుబాటులోకి వచ్చాయి.


ఆధునిక జీవన విధానానికి వీటినే ప్రపంచం సింబాలిక్ గా చూస్తూ ఉంది. ఒకప్పటిలా మీ నగరంలో బస్సులు ఉన్నాయి.. ఫ్లై ఓవర్లు ఉన్నాయా అనే మాట బదులు.. మీ దగ్గర మెట్రో రైల్ ఉందా అనే మాట వాడుకలోకి వచ్చింది. ఇప్పుడే ఇదే మీ నగరంలోని అండర్ వాటర్ మెట్రో ఉందా అనే స్థాయికి వెళ్లింది. పదుల మీటర్ల దిగువన మెట్రో స్టేషన్.. సొరంగాలలో ప్రయాణం.. వహ్ అసలు ఆ అనుభూతే వేరు.


దేశంలో మెట్రో రైల్ సర్వీస్ ను ప్రారంభించిన తొలి నగరంగా నిలిచిన కోల్ కత.. అండర్ వాటర్ మెట్రో సైతం ప్రారంభించిన తొలి నగరంగా నిలవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 12న అండర్ వాటర్ మెట్రో ట్రయల్ రన్ ని పూర్తి చేసింది. హౌరామైదాన్ నుంచి మహకరన్ మధ్య ఈ ట్రయల్ జరిగింది.


ఈ చారిత్రక ప్రయాణంలో కలకత్త మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ పీ. ఉదయ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ‘ మా కల నిజమైంది. మరో ఏడు నెలల పాటు మిగతా పరీక్షలు నిర్వహించి వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తాం’ అని చెప్పారు.


ఈ ప్రాజెక్ట్ ను పశ్చిమ - తూర్పు కారిడార్ గా పిలుస్తున్నారు. ఇది హౌరా- కలకత్త నగరాలను కలుపుతుంది. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ. 11 వేల కోట్లను కేటాయించింది. తాజాగా దీనిని 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే హౌరా మైదాన్- ఎస్ప్లానేడ్ మధ్య నిర్మాణం పూర్తి చేశారు. వీటి మధ్య దూరం 4.8 కిలోమీటర్లు. ప్రస్తుతం ట్రయల్ రన్ వీటి మధ్యే జరిగింది. ప్రాజెక్ట్ మొత్తం పొడవు 16.55 కిలోమీటర్లు.


దీనిని గ్రీన్ లైన్ గా పిలుస్తున్నారు. కోల్ కత్తలోని ఐటీ హబ్ ప్రాంతమైన సాల్ట్ లేక నుంచి ప్రారంభం అయి హౌరా మైదాన్ లో పూర్తి అవుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం గంటన్నర నుంచి 30 నిమిషాలకు తగ్గుతుందని అంచనా ఉంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.


అనేక అవాంతరాలు..


మొదటి సవాల్ అక్కడి మట్టితో మొదలైంది. ఏడాది పొడవునా హుగ్లీలో నీరు ఉంటుంది. వందల ఏళ్ల నుంచి వచ్చి పోతపోసిన మట్టి పొరలుపొరలుగా పేరుకుని ఉంది. దీంతో భూగర్భంలో ఓదశలో మొత్తం కూడా వదులుగా ఉన్న ఇసుక మట్టే. అయితే రెండో దశ నుంచి కాస్త గట్టిగా, నిర్మాణానికి అనుకూలంగా ఉన్న మట్టి దొరికింది. అయితే నీటి బరువుకు ఇది తట్టుకుంటుందా లేదా అనే ఆందోళన ఎదురయింది. సాధారణంగా నీటికింద గుండ్రంగా నిర్మాణం కోసం సొరంగం తవ్వినప్పుడు మట్టి తనంతట తానే పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు.


‘275 ఎంఎం మందం కలిగిన ఆర్ సీసీ సెగ్మంట్ లైనర్లు వాడినట్లు, పీఐఓ కౌశిక్ మిత్ర వెల్లడించారు. మొత్తం 5.5 మీటర్ల వ్యాసంతో జంట సొరంగాలను నిర్మించాం’ అని చెప్పారు. సొరంగం మొత్తం పొడవు 520 మీటర్లు కాగా, కేవలం 45 సెకన్లలో 80 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లేలా వీటిని నిర్మించారు.





రికార్డు స్థాయిలో ఈ పనిని కేవలం 66 రోజుల్లో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం 15 వేల మంది కార్మికులు, 200 మంది ఇంజనీర్లను ఉపయోగించినట్లు సివిల్ ఇంజనీర్లు చెబుతున్న మాట. ప్రస్తుత నిర్మాణం హౌరా బ్రిడ్జీ( రవీంద్ర సేథ్) కింద 350 మీటర్ల దిగువన, నదీ గర్భం నుంచి 16 మీటర్ల దిగువన ఉంటుంది. నిర్మాణ సమయంలో, అనేకభవనాలు, పురాతన బంకిం సేథ్ ప్లైఓవర్ పునాదులను నష్టం లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెప్పారు.


మెట్రో సొరంగ మార్గం పశ్చిమ గట్టున ఉన్న హౌరా స్టేషన్ కాంప్లెక్స్ ను తూర్పును ఉన్న అర్మేనియన్ ఘూట్ ను కలుపుతుంది. అలాగే టన్నెల లోపల ప్రయాణీకులు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే అలారం దానంతటా అదే మోగేలా సెట్ చేశారు. అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగితే పొగ బయటకు వెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ నిర్మాణం అందుబాటులోకి వస్తే రోజుకి 30,000 వేలమంది ప్రయాణించే అవకాశం ఉంటుంది.





అలాగే నగరం మొత్తం కూడా మెట్రోతో అనుసంధానం పూర్తి అవుతుంది. ‘మేం టన్నెల్ లోపల నీలి కలర్ లైటింగ్ ను ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేశాం. అలాగే కదులుతున్న చేపలు.. కూడా ఉన్నాయి. ప్రయాణీకులు మాత్రం అదో మధురానుభూతి’అని పీఐఓ కౌశిక్ మిత్ర చెబుతున్న మాట.


మరీ మన హైదరాబాద్ మాటేమిటీ?


మనకు ఉన్న మూసీ నదీ హూగ్లీ అంతపెద్దది కాదు. అందువల్ల మనకు అండర్ వాటర్ మెట్రో అంటే కష్టమే. కానీ అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించాల్సిన అవసరం ఉంది.


ఎలా.. ఎక్కడ.. ఎందుకు..


జేబీఎస్ నుంచి అల్వాల్ వెళ్లే మార్గం.. ఆ వైపు ప్రయాణించే వారికి బాగా గుర్తుండే ఉంటుంది. ఇరుకు ఇరుకు రోడ్లు.. విపరీతంగా ఉన్న ట్రాఫిక్. ఒకప్పుడు నగరం అవతల ఉన్న మిలిటరీ కంటోన్మేంట్ నగరం విస్తరించడంతో ఇప్పుడు మధ్యలో ఉన్నట్లు అయింది. ట్రాఫిక్ ను రద్దీని నియంత్రించడానకి రాష్ట్ర ప్రభుత్వం మొదట కంటోన్మెంట్ ను సిటీ అవతలకి తరలించాని కేంద్రానిని ప్రతిపాదనలు పంపింది.


ఇప్పుడు ఉన్న భూమికి రెట్టింపు ఇస్తామని కూడా వివరించింది. అయితే ఆర్మీ అధికారుల దీనికి ఒప్పుకోలేదు. తరువాత మెట్రోని జేబీఎస్ నుంచి అల్వాల్ వరకూ విస్తరించాలని కూడా ప్రయత్నించింది. దీనికి కూడా ఆర్మీ ఒప్పుకోలేదు. పై నుంచి చూస్తే ఆర్మీ అధికారుల కార్యాలయాలు తేలిగ్గా కనిపిస్తాయని వివరించింది. అందుకే మెట్రో విస్తరణ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఇప్పుడు కోల్ కత అండర్ వాటర్ ప్రారంభం అయితే ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ మెట్రోని చూడవచ్చు. కాకపోతే ఎటోచ్చి నదీ కింద వెళ్లట్లేదు అనే ఆలోచన రాదు అంతే..


Read More
Next Story