సిద్దిఖీకి బెయిల్ నిరాకరణ..బిల్కిస్ బానో కేసును ఉటంకించిన జడ్జి
x

సిద్దిఖీకి బెయిల్ నిరాకరణ..బిల్కిస్ బానో కేసును ఉటంకించిన జడ్జి

లైంగిక వేధింపుల కేసులో నటుడు సిద్ధిఖీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాలతో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


లైంగిక వేధింపుల కేసులో నటుడు సిద్ధిఖీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాలతో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2016లో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ డయాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన 22 పేజీల ఆర్డర్‌లో జస్టిస్ డయాస్ కేసుకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత ఆరోపణలు చేయడం విశ్వసనీయతను తగ్గిస్తుందని డిఫెన్స్ లాయర్ వాదించారు. లైంగిక నేరాల కేసుల్లో పోలీసులకు బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం పెద్ద తప్పేమి కాదని, బాధితురాలి బాధను అర్థం చేసుకోవాలని జస్టిస్ డయాస్ ఉద్ఘాటించారు. బిల్కిస్ బానో కేసును న్యాయమూర్తి ఈ సందర్భంగా ఉటంకించారు. మహిళ సామాజిక స్థాయి, మత విశ్వాసాలు ఇక్కడ ముఖ్యం కాదని న్యాయం జరగడమే ముఖ్యమని న్యాయమూర్తి పేర్కొన్నారు. సిద్ధిఖీకి మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. నిందితుడు తన పలుకుబడిని ఉపయోగించి సాక్షులను బెదిరించడం లేదా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ నివేదికను ప్రచురించింది. అయితే ఐదేళ్లపాటు మరుగున పడిన ఈ నివేదికను బయటకు వచ్చింది. దాంతో బాధితురాలు ముందుకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని జస్టిస్ డయాస్ పేర్కొన్నారు.

నిందితుడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తి కావడంతో..ఎనిమిదేళ్ల తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మలయాళ సినిమాల్లో ప్రముఖ పాత్రధారి, నటీనటుల సంఘం అమ్మ మాజీ ప్రధాన కార్యదర్శి సిద్ధిఖీపై భారత శిక్షాస్మృతిలోని 376 (అత్యాచారం) , 506 (నేరపూరిత బెదిరింపు) కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Read More
Next Story