AAP | ‘అధికంగా వచ్చిన నీటి బిల్లులు రద్దు చేస్తాం’
x

AAP | ‘అధికంగా వచ్చిన నీటి బిల్లులు రద్దు చేస్తాం’

‘నన్ను జైలుకు పంపిన తర్వాతే నీటి బిల్లులు (Water Tax) అధికంగా రావడం మొదలైంది’- ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్


తమ పార్టీ అధికారంలోకి వస్తే అధికంగా వచ్చిన నీటి పన్ను రద్దు చేస్తామని చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఢిల్లీ (Delhi)లో జరిగిన ఒక పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ జల్ బోర్డు నుంచి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకూ వాటర్ బిల్లులు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తనను జైలుకు పంపిన తర్వాతే నీటి బిల్లులు అధికంగా రావడం మొదలైందన్నారు.

"ఇంతకుముందు కూడా నేను ఇదే చెప్పాను. కానీ ఈ రోజు నేను అధికారిక ప్రకటన చేస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత AAP తిరిగి అధికారంలోకి వస్తే.. అధికంగా వచ్చిన బిల్లులను మాఫీ చేస్తాం. బిల్లులు తప్పుగా వచ్చాయని భావిస్తే వాటిని చెల్లించనవసరం లేదు" అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.

‘‘AAP ప్రభుత్వం నెలకు 20వేల లీటర్ల ఉచిత నీటిని అందజేస్తోంది. దీని ద్వారా నగరంలో 12 లక్షలకుపైగా కుటుంబాలు లాభపడుతున్నాయి’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. AAP వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది.

Read More
Next Story