Aam Aadmi Party | RSSకు కేజ్రీవాల్ బహిరంగ లేఖ..
x

Aam Aadmi Party | RSSకు కేజ్రీవాల్ బహిరంగ లేఖ..

‘‘అబద్ధాలు చెప్పడం, తన పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లతో తప్పుడు వాగ్దానాలు చేయించడం కేజ్రీవాల్‌ మానుకోవాలి.’’ - బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా


ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికలు (Elections) ఫిబ్రవరిలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ(BJP)ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీవాసులకు హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు. అధికారంలోకి రాగానే వాటికి అమలు చేస్తామని సభ్యత్వ నమోదు కార్యక్రమాలనూ ప్రారంభించారు. తాజాగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు బహిరంగ లేఖ రాశారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆర్ఎస్ఎస్‌ను సూటిగా ప్రశ్నించిన కేజ్రీ..

"1. బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బులు పంచి ఓట్లను కొంటున్నారు. ఓట్ల కొనుగోలును ఆర్‌ఎస్‌ఎస్ సమర్థిస్తుందా? 2. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసముంటున్న పేదలు, దళితులు, పూర్వాంచల్ వాసులు, మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల ఓట్లను చీల్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చేయడం భారత ప్రజాస్వామ్యానికి సరైంది కాదని ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ నేతలకు చెప్పగలదా? అని ప్రశ్నించారు.

ఈసీకి ఫిర్యాదు..

తన సొంత నియోజకవర్గం న్యూఢిల్లీ సెగ్మెంట్‌లో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. ఓటరు జాబితాల్లో చేర్పులు, తొలగింపులు జరుగుతున్నాయన్న విషయాన్ని తాను ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

స్పందించిన వీరేంద్ర సచ్‌దేవా ..

కేజ్రీవాల్ లేఖకు ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే బీజేపీ ఢిల్లీ యూనిట్ కేజ్రీవాల్‌పై స్పందించింది. అరవింద్ పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని, ఆయన అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఎదురుదాడికి దిగింది. ఢిల్లీలోని రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నివాసితులను ఆప్ తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనుకుంటోందని బీజేపీ ఆరోపించింది.

‘‘అబద్ధాలు చెప్పడం మానేయాలని, అవినీతిని అంతం చేయాలని, తన పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లతో తప్పుడు వాగ్దానాలు చేయించడం మానుకోవాలని కేజ్రీవాల్‌కు అని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా (Virendra Sachdeva ) లేఖ రాశారు.

70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.

Read More
Next Story