నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాని సీఎంలు ఎవరు?
x

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాని సీఎంలు ఎవరు?

పీఎం మోదీ అధ్యక్షతన జరిగే సమావేశానికి కర్ణాటక కేరళ, బెంగాల్ సీఎంలు సిద్ధరామయ్య, పినరయి విజయన్, మమత బెనర్జీ హాజరుకావడం లేదు.


ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన ఈ రోజు (మే 24) న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ (NITI Aayog meet) పాలక మండలి 10వ పాలక మండలి సమావేశం జరుగుతోంది. సాధారణంగా ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. అయితే కర్ణాటక(Karnataka), కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు వరుసగా సిద్ధరామయ్య, కేరళ పినరయి విజయన్, మమతాబెనర్జీ వెళ్లడం లేదు.

ముఖ్యమైన కార్యక్రమం ఉండడంతో..

సిద్ధరామయ్య (CM Siddaramaiah) మైసూర్‌లో ఓ ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తుండడం వల్ల ఢిల్లీకి వెళ్లడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తన ప్రసంగాన్ని ఇప్పటికే నీతి ఆయోగ్ పాలక మండలికి పంపారని, అయితే దాన్ని ఎవరు వినిపిస్తారన్న దానిపై స్పష్టత లేదు.

కేరళ నుంచి పైనాన్స్ మినిస్టర్..

కేరళ (Kerala) సీఎం పినరయి విజయన్ (CM Vijayan) కూడా హాజరుకావడం లేదు. ఆయన స్థానంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్‌ వెళ్తారని సమాచారం. అయితే ముఖ్యమంత్రులు వెళ్లే సమావేశానికి ఆయన హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. తన గైర్హాజరుకు కారణాన్ని మాత్రం విజయన్ బయటపెట్టలేదు. గత ఏడాది కూడా ఆయన వెళ్లకపోగా బాలగోపాల్‌ను పంపారు.

వెస్ట్ బెంగాల్ నుంచి చీఫ్ సెక్రటరీ ?

పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) హాజరుకావడంలేదని రాష్ట్ర సచివాలయ వర్గాలు తెలిపాయి. ఆమె వెళ్లకపోవడానికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ హాజరయ్యే ఉంది.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా..

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఈ సమావేశంలో 2025-26 బడ్జెట్‌లో తీసుకున్న చర్యలు, భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపు తర్వాత ఆర్థిక వ్యవస్థకు ఎదురుగాలి వీస్తోంది.

Read More
Next Story