Judiciary | కొత్త చట్టాల అమలులో చండీగఢ్ ఫస్ట్..
చండీగఢ్‌లో మూడు కొత్త క్రిమినల్ చట్టాలను విజయవంతంగా అమలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (డిసెంబర్ 3) వాటిని జాతికి అంకితం చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను చండీగఢ్ రాష్ట్రం 100 శాతం అమలు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది చండీగఢ్. ఆంగ్లేయుల కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం తీసుకొచ్చి జూలై 1 నుంచి అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
చండీగఢ్ ప్రభుత్వానికి ప్రశంసలు..
మూడు చట్టాలను చండీగఢ్‌లో పూర్తిగా అమలు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈ కొత్త చట్టాల వల్ల ఎఫ్ఐఆర్ నమోదైన మూడేళ్లలో బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. మన న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వ్యవస్థ అవుతుందన్నారు. కొత్త చట్టాలను పూర్తిగా అమలు చేస్తున్నందుకు చండీగఢ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
కొత్త చట్టాలు జాతికి అంకితం..
చండీగఢ్‌లో మూడు కొత్త క్రిమినల్ చట్టాలను విజయవంతంగా అమలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (డిసెంబర్ 3) జాతికి అంకితం చేశారు.
క్రైమ్ సీన్ అనుకరణ
కొత్త చట్టాల ప్రకారం నేర పరిశోధనను అనుకరించే ప్రత్యక్ష ప్రదర్శనను మోదీ వీక్షించారు. ఇక్కడి పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రదర్శనను ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా, యూటీ చండీగఢ్ సలహాదారు రాజీవ్ వర్మ, చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సురేంద్ర సింగ్ యాదవ్ తిలకించారు.