‘గెలిచే చోటల్లా  మరాఠా అభ్యర్థులు’
x

‘గెలిచే చోటల్లా మరాఠా అభ్యర్థులు’

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మరాఠా అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ఉద్యమ నేత మనోజ్‌ జారంగే ప్రకటించారు.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మరాఠా అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ఉద్యమ నేత మనోజ్‌ జారంగే ఆదివారం ప్రకటించారు. జాల్నా జిల్లా అంతర్వాలి సార్తి గ్రామంలో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. గెలిచే అవకాశం ఉన్న చోట్ల మాత్రమే మరాఠా అభ్యర్థులను నిలబెడతానని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో మరాఠా వాదానికి మద్దతిచ్చే ఇతర అభ్యర్థులకు కూడా తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

మరాఠా సామాజికవర్గానికి విజయావకాశాలు లేని నియోజకవర్గాల్లో పార్టీ, కులం లేదా మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ డిమాండ్‌కు కట్టుబడి ఉన్న అభ్యర్థికి మద్దతు ఇస్తామని వెల్లడించారు. అయితే తమ డిమాండ్‌కు అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా రాయించిన అభ్యర్థికే తమ సపోర్టు ఉంటుందని స్పష్టం చేశారు.

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

OBC కేటగిరీ కింద మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని జరంగే చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Read More
Next Story