ఓటరు లిస్టు మాయజాలమే బీజేపీ విజయరహస్యమా?
x

ఓటరు లిస్టు మాయజాలమే బీజేపీ విజయరహస్యమా?

ఈసీ కార్యాలయం ముందు నిరసనకు సిద్ధమవుతున్న టీఎంసీ చీఫ్ మమత..


వెస్ట్ బెంగాల్‌(West Bengal)లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో బీజేపీ, టీఎంసీ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) భారతీయ జనతా పార్టీ (BJP)పై తీవ్ర ఆరోపణలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఓటర్ల పేర్లు తొలగించి.. హర్యాణా, గుజరాత్, పంజాబ్, బీహార్ రాష్ట్రాల వ్యక్తుల పేర్లను జాబితాలో చేరుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అండతోనే బీజేపీ ఇలా చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలకు సంబంధించిన పత్రాలను కూడా ఆమె ఇటీవల కార్యకర్తల సమావేశంలో బయటపెట్టారు. ఇదే వ్యూహంతో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తనకు అనుకూలంగా ఫలితాలు రాబట్టుకుందనేది మమతా వాదన.

మమత ఆరోపణలపై ఎన్నికల విశ్లేషకుడు, డేటా అనలిస్ట్ డాక్టర్ ప్యారెలాల్ గార్గ్ ‘కాపిటల్ బీట్’ కార్యక్రమంలో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో మార్పులు సాధ్యమే అని చెప్పారు. ఫామ్ 6 ద్వారా కొత్త పేర్లను చేర్చడం, ఫామ్ 7 ద్వారా కొన్ని పేర్లను తొలగించడం సాధ్యమేనని వివరించారు. ఎలక్షన్ యంత్రాంగం ఏదైనా ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే ఈ పని చేయడం అంతకష్టం కాదని చెప్పారు. “అప్డేటెడ్ ఓటర్ల జాబితా లేకపోతే నమ్మకమైన ఎన్నికలు జరగవని, జాబితాలను మార్చడం ద్వారా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని గార్గ్ పేర్కొన్నారు.

ఈ సంస్థలు ఎవరివి?

‘అసోసియేషన్ ఫర్ బిలియన్ మైండ్స్’, ‘ఇండియా 316’ అనే సంస్థలను బీజేపీ నియమించుకుందని మమత ఆరోపించారు. అయితే ఈ సంస్థలను నిజంగా ఎవరు నియమించారనేది తెలియాల్సి ఉందని గార్గ్ అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత ఎన్నికల కమిషన్‌దే.

“ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. లేకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది,” అని గార్గ్ అభిప్రాయపడ్డారు.

డిజిటల్ చీటింగ్?

మమతా బెనర్జీ ప్రధానంగా డిజిటల్ మోసాన్ని ప్రస్తావించారు. ఓటర్లను భౌతికంగా తరలించకుండా, కేవలం డేటాను మారుస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా మార్పు ఢిల్లీ లేదా రాష్ట్ర స్థాయిలో జరుగుతోందా? ఎపిక్ నంబర్లు మారకుండా.. పేర్లు, ఫోటోలు, వివరాలు మార్చడం ద్వారా అక్రమ ఓటింగ్‌కు పాల్పడుతున్నారని మమత ఆరోపించారు.

అది ఈసీ బాధ్యత..

‘‘ఎన్నికల ముందు ECI ఓటర్ల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. కాని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ వివరాలను ముందుగానే చెక్ చేసుకోలేరు.

పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తరువాతే తమ పేర్లు లేవని తెలుస్తుంది. ఓటరు జాబితా పక్కాగా ఉంచే బాధ్యత ఎన్నికల కమిషన్‌ ఉంది.’’ అని గార్గ్ చెప్పారు. ఓటరు జాబితాలో మార్పులు కేవలం బెంగాల్‌‌లోనే కాదు..ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యాణా రాష్ట్రాల్లోనూ జరిగాయని చెప్పుకొచ్చారు.

అలాంటప్పుడు మాత్రమే మోసం బయటపడుతుంది..

ECI ఫామ్ 9 (కొత్త ఓటర్ల కోసం), ఫామ్ 10 (తొలగించిన ఓటర్ల కోసం) సమాచారాన్ని బహిరంగం చేస్తే ఈ మోసాలు బయటపడతాయని గార్గ్ అంటున్నారు.

ఓటర్ల వివరాలను ECI ఆలస్యంగా అందించడంపై కూడా గార్గ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. “ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలో ఉంది. ఇది తక్షణమే అందించవచ్చు. ఆలస్యానికి అర్థం ఏమిటి?” అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలి?

డాక్టర్ గార్గ్ నాలుగు ముఖ్యమైన పరిష్కారాలను సూచించారు.‘‘ఎన్నికల కమిషన్‌తో చర్చలు – ప్రతిపక్ష పార్టీలు పారదర్శకతకు పట్టుబట్టాలి. సామాజిక స్థాయిలో వ్యతిరేకించడం అంటే ప్రజలు, రాజకీయపార్టీలు నిరసనలు తెలపాలి. ఫామ్ 9, 10 బహిరంగపర్చడం, ఓటర్ల జాబితా మార్పుల గురించి ప్రజలకు వెల్లడించాలి. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించకపోతే, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది,” అని పేర్కొన్నారు.

నిరసనకు సిద్ధమవుతున్నారా?

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టనున్నట్టు మమతా బెనర్జీ హెచ్చరించారు. కానీ ఈ నిరసనలు కోల్‌కతాలో జరుగుతాయా? లేదా ఢిల్లీలో నిర్వహిస్తారా అన్న విషయంలో స్పష్టత లేదు. మొత్తం మీద 2026 బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలో కీలక మలుపు కావచ్చు.

Read More
Next Story