
ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై షా ఆరోపణల్లో వాస్తవమెంత?
‘‘సల్వా జుడుం’ను రద్దుచేసి.. కొన ఊపిరితో ఉన్న నక్సలిజం మరో రెండు దశాబ్దాలు కొనసాగడానికి సుదర్శన్ రెడ్డి కారణమయ్యారు’’ - కేంద్ర హో మంత్రి
కేంద్రం హోంమంత్రి అమిత్ షా(Amit Shah) భారత(I.N.D.I.A) కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి(B Sudershan Reddy)పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. 2007 - 2011 మధ్య నక్సల్ వ్యతిరేక ఉద్యమం ‘సల్వా జుడుం’(Salwa Judum)ను రద్దుచేసి.. కొన ఊపిరితో ఉన్న నక్సలిజం మరో రెండు దశాబ్దాలు కొనసాగడానికి దోహదం చేశారని షా ఆరోపించారు. ‘‘జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నక్సల్(Naxals) అనుకూలమని నేను ప్రత్యేకంగా చెప్పలేదు. ఆదివాసీల ఆత్మరక్షణకోసం ఉన్న వ్యవస్థను ఆయన మూసివేశారు. దానివల్లే నక్సలిజం మరో రెండు దశాబ్దాలు ఊపిరిపోసుకుంది. అది ఆయన తీర్పేనని సుప్రీంకోర్టు రికార్డులే చెబుతున్నాయి.’’ అని ఓ మీడియా సంస్థతో అన్నారు షా.
తీర్పు వ్యక్తిగత అభిప్రాయం కాదు..
అయితే సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పు సుదర్శన్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదు. విచారణలో వాస్తవాల ఆధారంగా తీసుకున్న నిర్ణయం. అయినప్పటికీ బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం సుదర్శన్ రెడ్డిపై రాజకీయ దాడి మొదలుపెట్టింది. వాస్తవానికి సల్వా జుడుం పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహించిన అక్రమ ‘విజిలాంటీ’ ఉద్యమమే నక్సలైట్లను బలోపేతం చేసింది. సల్వాజుడుం కారణంగా వందలాది గిరిజన గ్రామాలు ఖాళీ అయ్యాయి. తమ భూములు, నివాసాలను వదిలి రహదారుల వెంట ఏర్పాటు చేసిన శిబిరాల్లో జీవించాల్సి వచ్చింది. నక్సల్స్‌ను ఎదుర్కోవడానికి తన బాధ్యతను విస్మరించి, పేద గిరిజనులను ఒకరిపై ఒకరు పోటీ పడేలా చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహించింది.
మోదీ పాలనలో భిన్నమైన విధానం..
అప్పటి మోదీ ప్రభుత్వం ఈ పోరాటాన్ని తీవ్రంగా పరిగణించి.. నక్సలైట్లను అదుపు చేయడానికి చట్టబద్ధ భద్రతా యంత్రాంగాన్ని ఉపయోగించింది. ఉద్యమాన్ని అణచివేయడంలో విజయం సాధించింది. గిరిజన యువకులను మావోయిస్టు తిరుగుబాటుదారులపై పోరాటంలోకి దించారు. బస్తర్ ఫైటర్స్ పేరుతో ఉన్న యువ గిరిజనులు దళం నక్సల్స్ జీవితాన్ని నరకంగా మార్చింది. మనుగడ అసాధ్యం అన్న భావక కల్పించింది. బస్తర్‌లో ఇటీవల జరిగిన నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో సాధించిన పెద్ద విజయాలను ఫెడరల్ హైలైట్ చేసింది కూడా.
నక్సలైట్లపై విజయాన్ని ఆలస్యం చేసింది సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు కాదు. బీజేపీ తప్పుడు ఆలోచనా విధానం.. సల్వా జుడుం ఆలోచన.
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు ప్రతిబింబించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసాలలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితవి. వాటిలో ది ఫెడరల్ సంబంధం లేదు.)